OTT Movies : థియేటర్లలోకి వస్తున్న ప్రతి సినిమాలు పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఈమధ్య హారర్ సినిమాలో ఎక్కువగా సందడి చేస్తున్నాయి. ఓటీటీలో ఎక్కువగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ మూవీస్ కు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే పలు ఓటీటీ సంస్థలు ప్రతి వారం ఈ జానర్ కు సంబంధించిన కొత్త లను, సిరీస్ లను అందిస్తున్నారు. తాజాగా ఓ హారర్ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చేసింది.. ఆ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి తెలుసుకుందాం..
మూవీ..
హిందీ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. హారర్ మూవీలకు ఎంత డిమాండ్ ఉందో తెలిసిందే.ముంబై మహా నగరంలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ రూపొందింది. జుహు బీచ్ లో ఒక పాడుబడిన దెయ్యాల నౌకను తరలించే క్రమంలో ఈ నడుస్తుంది. ఇందులో హీరో ఒక షిప్పింగ్ అధికారిగా ఉద్యోగం చేస్తుంటాడు. ఇతను తన భార్య, కుమార్తెను కోల్పోయి ఒంటరిగా క్షోభను అనుభవిస్తుంటాడు. అయితే ఒక రోజు సముద్రం ఒడ్డుకి ఒక ఓడ కొట్టుకొని వస్తుంది. అది చూడటానికి విచిత్రంగా ఉంటుంది.. ఆ ఓడ పేరు సి బర్డ్… ఇక ఈ మూవీ పేరు భూత్ : ది హాంటెడ్ షిప్’. 2020 ఫిబ్రవరి 21న థియేటర్లో విడుదలైన ఈ బాలీవుడ్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది..
ఓటీటీ..
భాను ప్రతాప్ సింగ్ తెరకెక్కించిన ఈ మూవీలో విక్కీ కౌశల్ భూమి పెడ్నేకర్, ఆశుతోష్ రానా ప్రధాన పాత్రల్లో నటించారు. కరణ్ జోహార్, హిరూ యష్ జోహార్, అపూర్వ మెహతా, శశాంక్ ఖైతాన్ సంయుక్తంగా ఈ ను నిర్మించారు. ప్రస్తుతం ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది బాలీవుడ్ వర్షన్ అయినప్పటికీ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.
Also Read :పాట తీస్తారా? తాట తియ్యాలా.. సంతానానికి చెప్పు దెబ్బలు
స్టోరీ విషయానికొస్తే..
ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఓడలో ఒక పాప ఉంటుందని హీరో కనిపెడతాడు. అయితే నౌకలో హీరోకు అనేక భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయి. అదే సమయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. ఓడలో ఉండే దెయ్యం, ఒక చిన్న పాపను బంధించి ఉంచిందని హీరో తెలుసుకుంటాడు. అలాగే ఈ దెయ్యంకు, గతంలో ఓడలో జరిగిన ఓ విషాదకర ఘటనకు సంబంధం ఉందని తెలుసుకుంటాడు.. ఆ తర్వాత దైర్యం చేసి ఓడలో ఏం జరుగుతుంది అనే దాన్ని హీరో కనిపెడతాడు. అసలు ఆ ఓడలోకి దెయ్యాలు, ఆత్మలు ఎలా వచ్చాయి? చివరకు ఏమైంది? అన్నది తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకుండా చూసేయ్యండి..
ఇలాంటి సినిమాలు ఓటీటీలో అందుబాటులో ఉంటున్నాయి. కొత్త సినిమాలు బోలెడు వచ్చేస్తున్నాయి. అందులో ఎక్కువగా హారర్ సినిమాలు వస్తున్నాయి.. కొత్త సినిమాలు సైతం ఓటీటీలోకి వచ్చేస్తున్నా అయితే ఇక్కడ వచ్చిన సినిమాలు అన్ని కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి..