BigTV English

Santhanam’s DD Next Level : పాట తీస్తారా? తాట తియ్యాలా.. సంతానానికి చెప్పు దెబ్బలు

Santhanam’s DD Next Level : పాట తీస్తారా? తాట తియ్యాలా.. సంతానానికి చెప్పు దెబ్బలు

Santhanam’s DD Next Level : కోలీవుడ్ హీరో సంతానం పేరు ఈ మధ్య వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ హీరో తాజాగా నటిస్తున్న డిడి నెక్స్ట్ లెవెల్ సినిమాలో ఓ పాట హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేవుడిపై భక్తితో పడాల్సిన గోవింద నామాలను సినిమాల్లో అభ్యంతరంగా వాడారంటూ కొందరు హిందువులు ఆయనపై తీవ్ర ఆరోపణలు చేస్తూ మండిపడుతున్నారు. ఇప్పటికే పలు చోట్ల సంతానం పై కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఈ వివాదం మరో మలుపు తిరిగింది. హిందూ సంఘాలు హీరోకు దిమ్మతిరిగే షాకిచ్చారు. మరి దీనిపై హీరో ఎలా స్పందించారో ఒకసారి తెలుసుకుందాం..


సంతానం సినిమాకు వివాదం..

హిందువుల కలియుగ దైవం అయినటువంటి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద నామాలతో పేరడీ చేయటంతోనే వివాదంలో చిక్కుకున్నారు.. సంతానం హీరోగా చేసిన డీడీ నెక్స్ట్ లెవల్ సినిమా మే 16న రిలీజ్ కానుంది. ఇటీవల రెండు నెలల క్రితం ఈ సినిమా నుంచి ఓ పాటను విడుదల చేశారు. శ్రీనివాస గోవిందా.. అనే పాటతో పేరడీ చేశారు. పార్కింగ్ డబ్బులు గోవిందా.. పాప్ కార్న్ ట్యాక్స్ గోవిందా.. అంటూ సాగే లిరిక్స్ తో పేరడీ సాంగ్ ను క్రియేట్ చేశారు. ఈ పాట గత రెండు నెలల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తాజాగా హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వెంకటేశ్వర స్వామి గోవింద నామాలతో ఇలా కామెడీ చేయటం సవ్యంగా లేదని ఈయన తీరుపై అలాగే చిత్ర బృందం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తమిళనాడులో పలు చోట్ల సంతానం పై, మూవీ యూనిట్ పై పోలీసులకు ఫిర్యాదులు చేశారు.. ఇక కొందరు ఈ పాటను సినిమా నుంచి వెంటనే డిలీట్ చేయాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ వివాదం తీవ్రస్థాయికి చేరింది..


Also Read : రిలీజ్‌ కాదు.. షూటింగ్‌కు ముందే 100 కోట్లు రిటర్న్… నిజంగా ఇది నాని మూవీనేనా..?

కమెడియన్ ఫోటోను చెప్పుతో కొట్టిన హిందూ సంఘాలు.. 

వెంకటేశ్వర స్వామి గోవింద నామాలతో ఇలా కామెడీ చేయటం హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని వెంటనే ఈ పాటను డిలీట్ చెయ్యాలని నిరసన సెగ వినిపించింది.. ఈ పాట పై సోషల్ మీడియాలో వివాదం మొదలైనప్పుడే హీరో స్పందించారు. సెన్సార్ నిబంధనల ప్రకారం ఏ పాట ఉంటుందని ఇందులో దేవుడిని ఉద్దేశించి లేదని క్లారిటీ ఇచ్చారు. కానీ ఈ వివాదం మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించలేదు. తాజాగా మరోసారి భగ్గుమంది.. తిరుపతిలోని నాలుగు కాళ్ల మండపం వద్ద హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. డిడి నెక్ట్ లెవల్ సినిమాలోని శ్రీనివాస గోవింద నామాల పాటలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. సంతానము,నిర్మాత చిత్రాలపై చెప్పుతో కొట్టి హిందు సంఘాలు నిరసన తెలుపుతున్నారు. తమిళనాడు ప్రభుత్వము హిందు వ్యతిరేక దొరణిలో ఇలాంటి వారిని ప్రోత్సాహిస్తుంది… ఈ విషయంపై టిటిడి అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని హిందువులు కోరుతున్నారు.. ఇక హీరో నిర్మాతలు బహిరంగంగా క్షమాపణ చెప్పి సాంగ్ ని డిలీట్ చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వివాదం కాస్త రోడ్డెక్కింది. మరి దీనిపై ఆ మూవీ యూనిట్ స్పందిస్తారేమో చూడాలి…

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×