Bellamkonda Sreenivas: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పై కేసు నమోదు అయింది. సాయి శ్రీనివాస్ జూబ్లీహిల్స్ లో జర్నలిస్టుల కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆయన ఇంటికి వెళ్తున్న టైం లో,రాంగ్ రూట్లో రావడమే కాకుండా ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడని దీంతో, అతని మీద జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది.
హీరో పై కేసు నమోదు ..కార్ సీజ్ ..
ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడని, ఇప్పటికే కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ పై దురుసుగా ప్రవర్తించడం ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా, బెల్లంకొండ శ్రీనివాస్ వ్యవహరించినట్లు ఈ నోటీసులో ఫిర్యాదు చేశారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేసిన పోలీసులు బెల్లంకొండ శ్రీనివాస్ కారుని సీజ్ చేశారు. ప్రస్తుతం భైరవం మూవీ ప్రమోషన్స్ లో బిజీగా, ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చుట్టూ ఈ కేసు చుట్టుకోవడంతో సినిమా ప్రమోషన్స్ కి ఏమైనా ఆటంకం కలుగుతుందా, అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాఫిక్ పోలీస్ తో వాగ్వాదం దిగడం అందరికీ తెలిసిందే, ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేయడం తో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈనెల 13న రోడ్ నెంబర్ 45 లో జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని తన ఇంటికి వెళ్తున్న టైం లో చౌరస్తా వద్ద రాంగ్ రూట్ లో, కారు రివర్స్ చేశారు అదే టైంకి అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేష్, బెల్లంకొండ శ్రీనివాస్ వాహనాన్ని అడ్డుకున్నారు. మీరు రాంగ్ రూట్లో వెళ్తున్నారు అంటూ కానిస్టేబుల్ సూచించాడు. అయినా హీరో వినకపోవడంతో ఆయనతో కానిస్టేబుల్ వాదించాడు. ఇక ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో, వారి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.
భైరవం మూవీ…ప్రమోషన్స్ కు బ్రేక్ ..
భైరవం మూవీ నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, కలిసి నటిస్తున్నారు. ఈ మూవీకి విజయ్ కనకమెడల దర్శకత్వాన్ని వహిస్తున్నారు. ఈ సినిమా మే 30న ప్రేక్షకులు ముందుకు రానుంది. తాజాగా రిలీజ్ చేసిన దమ్మరో ధం పాట, టీజర్ మూవీపై అంచనాలను పెంచేస్తుంది. ఇక ప్రమోషన్స లో, ముగ్గురు హీరో లు పాల్గొంటున్నారు. నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు ఇప్పటివరకు సరైన హిట్టు పడలేదు. ముగ్గురు హీరోలు ఈ మూవీ పైనే ఆశలుపెట్టుకున్నారు. ఈ మూవీ మే 30న రిలీజ్ కానుంది. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అరెస్ట్ నేపథ్యంలో, ఈ మూవీ ప్రమోషన్స్ కి ఏమైనా ఆటంకం కలుగుతుందేమోనని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు.