E-Paper
Advertisement

OTT Movie : డబ్బులిచ్చి చిన్న పిల్లతో పెళ్లి… ఈ బంగారు తల్లికి వచ్చిన కష్టం ఇంకే ఆడపిల్లకు రావొద్దు భయ్యా

OTT Movie : డబ్బులిచ్చి చిన్న పిల్లతో పెళ్లి… ఈ బంగారు తల్లికి వచ్చిన కష్టం ఇంకే ఆడపిల్లకు రావొద్దు భయ్యా
Advertisement

OTT Movie : ఒక గుండెల్ని పిండే ఎమోషనల్ మూవీ చూడాలనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. ఇది లండన్‌లోని ఒక బంగ్లాదేశీ ఇమ్మిగ్రెంట్ ఫ్యామిలీ కథ. చిన్న వయసులోనే ఒక ముసలి వ్యక్తిని పెళ్లి చేసుకుని, ఒక అమ్మాయి పడే వ్యధ ఇది. మధ్యలో ఒక యువకుడి ఎంట్రీతో కథ పూర్తిగా మారిపోతుంది. ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీలు సినిమాలుగా, చాలానే వచ్చాయి. అయితే ఈ స్టోరీ మరింత రియలిస్టిక్ గా ఉంటుంది. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

సారా గావ్రాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పేరు ‘బ్రిక్ లేన్’ 2007లో వచ్చిన ఈ బ్రిటీష్ చలనచిత్రం, బ్రిటీష్ రచయిత మోనికా అలీ అదే పేరుతో 2003లో రచించిన నవల నుండి రూపొందింది. దీనికి లారా జోన్స్, అబి మోర్గాన్ స్క్రీన్ ప్లే రాశారు. ఇందులో తన్నిష్ఠా చటర్జీ (నజ్నీన్), సత్యజిత్ శర్మ (చను), క్రిస్టోఫర్ సింప్సన్ (కరీం) మెయిన్ రోల్స్‌లో ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్‌లోని టెల్లూరైడ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రం మొదటి పబ్లిక్ స్క్రీనింగ్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా pime Video, Netflix లలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

నజ్నీన్ అనే 17 ఏళ్ల బంగ్లాదేశీ అమ్మాయి, అమ్మానాన్నలు ఏది చెప్తే అదే అన్నట్లు పెరిగింది. అరేంజ్డ్ మ్యారేజ్‌లో చను అనే బంగ్లాదేశీ అంకుల్‌ని పెళ్లి చేసుకుని లండన్ వచ్చేస్తుంది. చను మంచోడే కానీ చాలా ఓల్డ్. భార్య ఇంట్లోనే ఉండాలి, బయటకి రావద్దు అనే రూల్స్ పెడతాడు. నజ్నీన్ కు ఇద్దరు పిల్లలు కూడా పుడతారు. ఆమె లండన్‌లోని బ్రిక్ లేన్ అనే బంగ్లాదేశీ కాలనీలో ఇరుక్కుపోయి ఒంటరిగా బతుకుతుంది. ఇంగ్లీష్ రాదు, ఫ్రెండ్స్ లేరు, బయట ప్రపంచం తెలియదు… రోజూ సీలింగ్ చూస్తూ ఏడుస్తూ ఉంటుంది.  కొన్నేళ్ల తర్వాత ఇంట్లో డబ్బు కోసం సీమింగ్ మెషీన్ తెచ్చుకుని ఇంట్లోనే బట్టలు కుట్టడం మొదలు పెడతాడు చను.

Read Also : సీరియల్ కిల్లర్‌గా స్టార్ హీరోయిన్… జైల్లో ఉంటూనే వరుస హత్యలు… టీజర్‌తోనే టాక్ ఆఫ్ ది టౌన్

Advertisement

అప్పుడు డెలివరీ బాయ్‌గా కరీం అనే యంగ్ బంగ్లాదేశీ అబ్బాయి వస్తాడు. కరీంతో నజ్నీన్‌తో మాటలు మొదలవుతాయి. మొదట ఫ్రెండ్‌షిప్… తర్వాత ప్రేమ… తర్వాత పూర్తి అఫైర్ గా మారుతుంది. నజ్నీన్‌కి మొదటిసారి ఎవరో తనని అర్థం చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. కానీ ఇది బయటపడితే? చను తెలిస్తే? పిల్లలు? సొసైటీ? ఇలా రెండు వైపులా గందరగోళంలో పడుతుంది నజ్నీన్. చివర్లో తన కోసం, తన పిల్లల కోసం నజ్నీన్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏంటి ? ఆమె ఆ ముసలి భర్తతోనే ఉంటుందా ? కరీంతో వెళ్లిపోతుందా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

 

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×