OTT Movie : బాలీవుడ్ అందాల నటి మాధురి దీక్షిత్ ను ఇప్పటి వరకు డాన్స్ చేస్తూ, లవ్లీగా స్మైల్ ఇచ్చే గ్లామరస్ రోల్స్ లో చూసి ఉంటాం. అయితే ఆమెను ఇప్పుడు ఒక భయంకరమైన అవతారంలోకి ట్రాన్స్ ఫార్మ్ అవుతోంది. తొందరలోనే విడుదల కానున్న ‘మిసెస్ దేశ్‌పాండే’ సిరీస్ లో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా దీని టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. 20 సెకన్ల టీజర్‌తోనే నెటిజన్స్ “అమ్మో… మాధురి ఇంత డేంజర్‌గా ఉంటుందా?” అని షాక్ అయిపోయి రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ సిరీస్‌లో మాధురి ఒక సీరియల్ కిల్లర్. అది కూడా జైల్లో ఉంటూనే వరుస మర్డర్స్ ప్లాన్ చేసే డేంజర్ ఆంటీగా నటిస్తోంది. ఈ టీజర్‌లో మాధురి మిర్రర్ ముందు మేకప్ రిమూవ్ చేసుకుంటూ, జైలు యూనిఫాంలో కనిపించడం చూస్తే… ఆమె డార్క్ సైడ్ అసలు ఎంత ఇంటెన్స్‌గా ఉంటుందో అర్థమవుతుంది!
మిసెస్ దేశ్‌పాండే (మాధురి ) ఇప్పటికే ఎన్నో మర్డర్స్ చేసి జైల్లో ఉంది. ఇప్పుడు బయట ఒక కొత్త కిల్లర్ ఆమె స్టైల్‌లోనే వాళ్లని కాపీ చేస్తూ మర్డర్స్ చేస్తుంటాడు. పోలీసులు ఆ కేసును సాల్వ్ చేయడానికి మిసెస్ దేశ్‌పాండేనే జైల్ నుంచి బయటకు తీసుకొచ్చి హెల్ప్ అడుగుతారు. నీ లాంటి మైండ్ ఉన్నవాడిని నీవే పట్టు అన్నట్టు చెప్తారు. అయితే ఈ ఆంటీ జైల్లో కూర్చుని బయట మర్డర్స్ ఆపేస్తుందా ? లేక ఇంకో గేమ్ ఆడుతుందా? అసలు ఆమె గతంలో ఏం జరిగింది? ఆమె కొడుకు ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నాడా? అనే పెద్ద పెద్ద ట్విస్ట్‌లతో ఈ స్టోరీ ఉంటుందట.
మాధురి ఫస్ట్ టైం పూర్తి నెగెటివ్ షేడ్ రోల్ లో కనిపిస్తోంది. ఇది ఫ్రెంచ్ సిరీస్ ‘లా మాంట్’ (La Mante) ఆధారంగా తెరకెక్కించిన సిరీస్. ఇది అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మాధురి మొదటి సారిగా డార్క్ రోల్ లో నటించింది. ఆమె డాన్సర్ ఇమేజ్‌ని పూర్తిగా పక్కన పెట్టి, ఈ సిరీస్ లో సీరియల్ కిల్లర్ రోల్ లో నటిస్తుండటంతో ఈ సిరీస్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంటెన్స్ థ్రిల్లర్స్‌కి ఫేమస్ అయిన నాగేష్ కుకునూర్ డైరెక్షన్ లో ఈ సిరీస్ వస్తుండటంతో ఈ సిరీస్ హైప్ క్రియేట్ చేస్తోంది.
Read Also : ప్రియుడి కోసం భర్తనే బలిచ్చే భార్య… కట్ చేస్తే బుర్రపాడు ట్విస్టు… చిన్నపిల్లలు చూడకూడని మూవీ
ఈ సిరీస్ JioHotstar ఓటీటీలోనే రిలీజ్ అవ్వబోతోంది. ఇది తెలుగు డబ్బింగ్ తో కూడా రాబోతుంది. అయితే రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ కాలేదు. కానీ తొందరలోనే వచ్చేస్తుందని టాక్ నడుస్తోంది. iఇది నాగేష్ కుకునూర్ దర్శకత్వంలో అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ & కుకునూర్ మూవీస్ ప్రొడక్షన్ నిర్మాణంలో ఇది తెరకెక్కుతోంది. మాధురి ఇందులో కిల్లర్ పాత్రలో నటించగా, సపోర్టింగ్ కాస్ట్‌లో ప్రియాన్షు చట్టర్జీ, దీక్షా జూనేజా, సిద్ధార్థ్ చందేకర్ లాంటి నటులు ఉన్నారు. మాధురి చివరిసారిగా 2022లో ‘మాజా మా’తో వచ్చి, ‘ది ఫేమ్ గేమ్’తో డిజిటల్ డెబ్యూ చేసింది. ఈ సిరీస్‌తో ఆమె నెగిటివ్ రోల్ ని ఎక్స్‌ప్లోర్ చేస్తోంది.