BigTV English
Advertisement

OTT Movie : ముగ్గురు అన్నదమ్ముల చేతిలో నలిగిపోయే అమ్మాయి … సీను సీనుకో ట్విస్ట్ తో మెంటలెక్కించే మూవీ

OTT Movie : ముగ్గురు అన్నదమ్ముల చేతిలో నలిగిపోయే అమ్మాయి … సీను సీనుకో ట్విస్ట్ తో మెంటలెక్కించే మూవీ

OTT Movie :  హారర్ సినిమాలు సరికొత్త స్టోరీలతో ప్రేక్షకులను భయపెట్టడానికి థియేటర్లలోకి వస్తూనే ఉన్నాయి. మరోవైపు ఇలాంటి సినిమాలు ఓటీటీలో కూడా దూసుకుపోతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఇందులో త్రిప్తి డిమ్రి ప్రధాన పాత్రలో నటించింది. సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు కూడా దక్కాయి. ఒక రివేంజ్ హారర్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా మూవీ లవర్స్ ని ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుంది. దీని పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో

ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బుల్‌బుల్’ (Bulbbul). 2020 లో వచ్చిన ఈ మూవీకి అన్వితా దత్ దర్శకత్వం వహించారు. దీనిని క్లీన్ స్లేట్ ఫిల్మ్‌జ్ కింద అనుష్క శర్మ, కర్నేష్ శర్మ నిర్మించారు. ఇందులో అవినాష్ తివారీ, పావోలీ డామ్, రాహుల్ బోస్, పరంబ్రత చటోపాధ్యాయతో పాటు త్రిప్తి డిమ్రీ ప్రధాన పాత్రలో నటించారు. ఇది 1880ల నాటి బెంగాల్ ప్రెసిడెన్సీ నేపథ్యంలో జరుగుతుంది. ఈ మూవీ ఒక చిన్న అమ్మాయి జీవితంలోని దుర్ఘటనలు, ఆమెలో వచ్చే విచిత్రమైన మార్పును చూపించారు. ‘బుల్బుల్’ 24 జూన్ 2020న నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో విడుదలైంది.


స్టోరీలోకి వెళితే

1881లో బుల్‌బుల్ అనే ఐదేళ్ల అమ్మాయితో జమీందార్ ఇంద్రనీల్ కు బాల్య వివాహం జరిపిస్తారు. అతనికి వయసు ఎక్కువగా ఉండటంతో, ఆమె ఇంద్రనీల్ చిన్న సోదరుడు సత్యతో సన్నిహితంగా ఉంటుంది. వీరిద్దరి మధ్య పెద్దగా వయసు అంతరం ఉండదు కాబట్టి త్వరగానే కలిసిపోతారు. వారిద్దరూ కలిసి దయ్యాల కథలు చెప్పుకుంటూ సరదాగా గడుపుతారు. ఇంద్రనీల్ మరో సోదరుడు మహేంద్ర, అతని భార్య బినోదిని కూడా అక్కడే నివసిస్తారు.

కొన్ని సంవత్సరాల తర్వాత, సత్య లండన్ నుండి తిరిగి వస్తాడు. అప్పటికి ఎన్నో సంఘటనలు జరిగిపోయి ఉంటాయి. ఇంద్రనీల్ గ్రామాన్ని విడిచి వెళ్లిపోతాడు. మహేంద్ర చనిపోతాడు. బినోదిని వితంతువుగా ఒక ఔట్‌హౌస్‌లో ఉంటుంది. గ్రామంలో అబ్బాయిలు వరుసగా చనిపోతుండటంతో, జనం దానిని దెయ్యం పనిగా భావించడం వంటివి జరుగుతాయి. అలాగే బుల్‌బుల్ కి కాళ్ళు చచ్చుబడిపోతాయి. ఒక డాక్టర్ ఆమెకు చికిత్స చేస్తూ ఉంటాడు. ఇలా వీటన్నిటిని చూసిన సత్య ఒక్కసారిగా షాక్ అవుతాడు.

ఫ్లాష్‌బ్యాక్‌లో బుల్‌బుల్ తో  సత్య సన్నిహితంగా ఉండటం చూసి, ఇంద్రనీల్‌కు వారిపై అనుమానం కలుగుతుంది.  ఈ క్రమంలో ఇంద్రనీల్ ఆ అనుమానాన్ని మనసులోనే దాచుకుని, సత్యను సైలెంట్ గా లండన్‌కు పంపిస్తాడు. దీంతో సత్యతో కలిసి రాసుకున్న కథను బుల్‌బుల్ బాధతో కాల్చేస్తుంది. సత్యను ప్రేమిస్తుందని అపార్థం చేసుకున్న ఇంద్రనీల్… బుల్‌బుల్ కాళ్లను దారుణంగా గాయపరుస్తాడు. ఆమె కదలలేని స్థితిలో ఉండగా, మహేంద్ర ఆమెపై అత్యాచారం చేస్తాడు. ఈ దాడి తర్వాత బుల్‌బుల్ కు అతీంద్రియ శక్తులు వస్తాయి. ఆమెకు ఆ శక్తి వచ్చినప్పుడల్లా చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు.

ఇక అదే శక్తితో మొదట మహేంద్రను చంపి ప్రతీకారం తీర్చుకుంటుంది. తరువాత తన గ్రామంలో స్త్రీలపై అఘాయిత్యం చేసే పురుషులను చంపడం మొదలు పెడుతుంది. ఊరు ఊరంతా ఈ హత్యలను ఒక ప్రేతాత్మ చేస్తుందని భావిస్తారు. చివరికి సత్య పరిస్థితి ఏమౌతుంది ? ఆమెకు శక్తులు ఎలా వచ్చాయి ? దీనికి ముగింపు ఎలా ఉంటుంది ? అనేది ఈ మూవీని చూసి తెలుసుకోండి.

Read Also : కొత్త కోడలిని మాత్రమే వెంటాడే శాపం … ఈ ఇంట్లో కాళ్ళు పెడితే కాటికే

Related News

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : పసికూనను తింటేగానీ తీరని ఆకలి… సూపర్ హీరోలను ఈకల్లా పీకి పారేసే మాన్స్టర్… ఫుల్ యాక్షన్ ధమాకా

Baramulla OTT : పట్టపగలే పిల్లలు అదృశ్యం… కుమార్తె రూమ్ లో కుక్క వాసన… ఇంటెన్స్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్

The Bengal Files: ఓటీటీకి వివాదస్పద చిత్రం.. ‘ది బెంగాల్‌ ఫైల్స్‌’, ఎక్కడ చూడాలంటే!

OTT Movie : కళ్ళతో చూస్తే ఆత్మహత్య… ప్రపంచాన్ని తుడిచి పెట్టే మిస్టీరియస్ శక్తి… గ్రిప్పింగ్ థ్రిల్లర్… ఊహించని ట్విస్టులు

OTT Movie : దసరా ఉత్సవాలపై 40 నిమిషాల మూవీ…. ‘ప్రొద్దుటూరు దసరా’ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

OTT Movie : స్నేహితుడిని ఇంటికి ఆహ్వానిస్తే… ఒక్కొక్కరిని మట్టుబెడుతూ పని కానిచ్చే సైకో… గూస్ బంప్స్ తెప్పించే థ్రిల్లర్

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

Big Stories

×