BigTV English

Crime News: తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో గుద్ది చంపిన కసాయి కొడుకు

Crime News: తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో గుద్ది చంపిన కసాయి కొడుకు

Crime News: ప్రస్తుతం సమాజంలో మానవత్వానికి విలువ లేకుండా పోయింది. చిన్న చిన్న గొడవలకే క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆస్తి తగాదాల కారణంగా సొంత అన్నదమ్ములే ఒకరిని ఒకరు దారుణంగా చంపుకుంటున్నారు. ఆవేశంలో ఓపికను కోల్పోయి ప్రాణాలనే తీసుకుంటున్నారు. కొందరు అయితే సొంత కన్న పిల్లలనే చంపుకుంటున్నారు. అసలు ఈ సమాజం ఎటుపోతుంది..? చిన్న చిన్న కారణాలకే తాము మనుషులం అనే విషయాన్ని మరిచిపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు.


క్షణాకావేశంలో తీసుకునే నిర్ణయాలు వల్ల జీవితాలే నాశనం అవుతున్నాయి. ఇలాంటి ఘటనలు ప్రస్తుత సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్న చిన్న గొడవలకే మానవత్వం మరిచిపోయి స్నేహతులను, పిల్లలను, అన్నదమ్ములను చంపుకుంటున్నారు. ఆస్తుల కోసం అయితే.. ఏకంగా తోబుట్టువులను, తల్లిదండ్రులను సైతం చంపడానికి వెనుకాడడం లేదు. తల్లిదండ్రుల ఆస్తుల్లో కూతుర్లకు కూడా వాటా ఇవ్వాలని గత ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చాయి. అయితే చాలా ప్రాంతాల్లో ఈ చట్టాలను పట్టించుకోవడం లేదు. సోదరికి ఆస్తి ఇస్తే పేరెంట్స్ పై ద్వేషం పెంచుకుంటున్నారు.

Also Read: Iran Explosion: భారీ పేలుడు.. 500 మందికి తీవ్రగాయాలు..


తాజాగా విజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పూసపాటిరేగ మండలం నడిపూరకల్లాలు గ్రామానికి చెందిన తల్లిదంద్రులు అప్పలనాయుడు(60), జయమ్మ(58) ఇటీవల తన కూతురుకి ఆస్తిలో వాటా ఇచ్చారు. అయతే సోదరికి ఆస్తిని ఇవ్వడం సోదరునికి ఇష్టం లేదు. పేరెంట్స్ కూతరుకి ఆస్తి ఇవ్వడంతో.. కుమారుడు రాజశేఖర్ జీర్ణించుకోలేకపోయాడు. తనకు దక్కాల్సిన మొత్తం ఆస్తిలో చెల్లికి ఇవ్వడంపై పేరెంట్స్ పై కక్ష పెంచుకున్నాడు.

ఈ క్రమంలోనే తల్లిదండ్రులను దారుణంగా చంపేశాడు. కనిపెంచిన సొంత తల్లిదండ్రులు అని కూడా చూడకుండా ట్రాక్టర్ తో ఢీకొట్టి దారుణంగా చంపాడు. ఈ దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్తి కోసం తల్లిదండ్రులను కిరాతకంగా చంపిన కుమారుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: DSC Free Coaching: సూపర్ న్యూస్.. ఎలాంటి ఫీజు లేకుండా స్టైఫండ్ ఇచ్చి ఫ్రీకోచింగ్

 

Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×