Prabhas Seenu : ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక ఫ్రెండ్స్ ఉంటారు. కొంతమంది తన ఫ్రెండ్స్ ని ఫ్యామిలీ మెంబర్ లాగా భావిస్తూ ఉంటారు. జీవితంలో ఒకరు ఏ స్థాయికి వెళ్లినా కూడా తమ ఫ్రెండును గుర్తుపెట్టుకుంటారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అలాంటి ఫ్రెండ్షిప్స్ చాలామంది మధ్యలో ఉన్నాయి. రచయితగా కెరియర్ మొదలుపెట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ నేడు ఒక స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. అయితే త్రివిక్రమ్ సునీల్ మధ్య ఎంత ఫ్రెండ్షిప్ ఉందో పలు ఇంటర్వ్యూలో చెబుతూ వచ్చారు. ఇద్దరూ కలిసి పంజాగుట్ట రూమ్ లో ఉంటూ ఇండస్ట్రీలో కష్టపడ్డారు. ఇప్పుడు త్రివిక్రమ్ ఏ స్థాయిలో ఉన్నా కూడా సునీల్ తో అదే ఫ్రెండ్షిప్ ని కొనసాగిస్తూ ఉంటారు. రామ్ చరణ్,శర్వానంద్,రానా మధ్యలో కూడా అలాంటి ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి కూడా శీను అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు.
ప్రభాస్ తో శీను పరిచయం
ప్రభాస్ శీను గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఎన్నో సినిమాల్లో నటుడుగా కనిపించి తనకంటూ కొద్దిపాటి గుర్తింపును సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ప్రభాస్ శీను కి మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా అంటే గబ్బర్ సింగ్ అని చెప్పాలి. అలానే విక్రమార్కుడు సినిమా కూడా తనకి మంచి పేరును తీసుకొచ్చింది. అయితే ప్రభాస్ తో పరిచయం ఎలా ఏర్పడింది అంటే.? శీను కి చదువులు పట్ల పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. శీను నాన్న ఇదే విషయాన్ని వాళ్ళ ఫ్రెండ్ ఎవరితోనో చెబితే. వీడిని ఇండస్ట్రీకి పంపించడం బెటర్ అని యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేశారు. వైజాగ్లో సత్యానంద్ యాక్టింగ్ స్కూల్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ స్కూల్లో సెలబ్రిటీ పిల్లలు తప్ప ఇంకెవరూ జాయిన్ అవ్వరు. అయితే ప్రభాస్ శీను నాన్నకి ఉన్న పరిచయాలు వలన ప్రభాస్ సీన్ సత్యానంద్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు.
శీను ప్రభాస్ శీను ఎలా అయ్యాడు
ఇకపోతే అక్కడ ప్రభాస్ తో శీనుకి పరిచయం ఏర్పడింది. ప్రభాస్ రాఘవేంద్ర ఈశ్వర్ సినిమాలు చేస్తున్న తరుణంలో నాకు పెద్దగా అవకాశాలు రావట్లేదు నేను ఆపేద్దాం అనుకుంటున్నాను అని శీను ప్రభాస్ తో చెప్పాడట. అయితే ప్రభాస్ దానికి బదులుగా ఆపేయడం ఎందుకు నాతో పాటు ఉండు ఏదైనా వస్తే చేసుకుంటూ వెళ్ళు అని చెప్పాడట. అలా శీను ప్రభాస్ తో పాటు ఉండిపోవటం మొదలుపెట్టాడు. ఈ తరుణంలో అక్కడక్కడ శీను కి అవకాశాలు కూడా మెల్లమెల్లగా రావడం మొదలయ్యాయి. ఆర్టిస్టుగా కూడా శీను బిజీ అయ్యాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ ఏ స్థాయిలో ఉన్నాడు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికీ కూడా శీనుకి ప్రభాస్ కు మధ్య అదే ఫ్రెండ్షిప్ ఉంటుందట. ఈ విషయాన్ని శీను ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.
Also Read : JanaNayagan Shooting Update : అవుట్ డోర్ షూటింగ్ అక్కడే, అదే ఫైనల్ కాబోతుందా.?