BigTV English

OTT Movie : కొత్త కోడలిని మాత్రమే వెంటాడే శాపం … ఈ ఇంట్లో కాళ్ళు పెడితే కాటికే

OTT Movie : కొత్త కోడలిని మాత్రమే వెంటాడే శాపం …  ఈ ఇంట్లో కాళ్ళు పెడితే కాటికే

OTT Movie : ఓటిటిలో హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని, ఎదురుచూసే ప్రేక్షకులు ఎక్కువగా ఉన్నారు. సస్పెన్స్ ను ఒక రేంజ్ లో చూపించే ఒక వెబ్ సిరీస్, ఇప్పుడు ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చింది. కన్నడ భాషలో హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో ఖుషి రవి ప్రధాన పాత్రలో నటించింది. ఈమె ఇదివరకే దియా, భైరవకోన సినిమాలలో నటించింది. ఆరు ఎపిసోడ్లతో వచ్చిన ఈ సిరీస్ ను మొదటినుంచి మొదలు పెడితే చివరి వరకు ఉత్కంఠంగా ఉంటుంది. ఒక కుటుంబంలో శాపం కారణంగా, ఆ ఇంట్లో కోడళ్ళు చనిపోతూ ఉంటారు. ఈ మిస్టరీ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే…


జి ఫైవ్ (ZEE5) లో

ఈ కన్నడ హారర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘అయ్యన మనే’ (Ayyana Mane). ఈ వెబ్ సిరీస్ కు రమేష్ ఇందిరా దర్శకత్వం వహించారు. ఇందులో ఖుషి రవి,మానసి సుధీర్, హితా చంద్ర శేఖర్, అర్చన కొట్టేగే, రమేష్ ఇందిరా వంటి నటులు నటించారు. ఇది జి ఫైవ్ (ZEE5) లో 2025 ఏప్రిల్ 25 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ, కన్నడ భాషలలొ అందుబాటులో ఉంది. ఈ సిరీస్ 1990 నేపథ్యంలో రూపొందింది. ఈ సిరీస్ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో ఉత్కంఠభరితమైన కథనంతో ప్రేక్షకులను  ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ ఆరు ఎపిసోడ్‌లతో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ ఆరు ఎపిసోడ్‌లలో ప్రతి ఎపిసోడ్‌లో, ఒక కోడలి మరణం చోటుచేసుకుంటుంది. ఒక్కో ఎపిసోడ్ ఇరవై నిమిషాల నిడివి ఉంటుంది.


స్టోరీ లోకి వెళితే

ఒక ఇంట్లో అనుమానాస్పదంగా కోడళ్ళ మరణాలు సంభావిస్తూ ఉంటాయి. ఆ ఇంట్లోకి కొత్తగా జాజి అనే అమ్మాయి కాపురానికివస్తుంది. వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆ ప్రాంతంలో వింత ఆకారాలు, శబ్ధాలు రావడం జాజి గమనిస్తుంది.  ముఖ్యంగా ఆ ఇంటికి సమీపంలో ఉండే బావిలో నుంచి, వింత శబ్ధాలు ఆమెను భయపెడుతుంటాయి.  వీటిగురించి తెలుసుకోవడానికి జాజి ప్రయత్నిస్తుంది. ఆ ఇంటి చరిత్ర తెలుసుకున్నప్పుడు, ఒళ్ళు జలదరించే విషయాలు బయటికి వస్తాయి. ఇది వరకే ఆ ఇంట్లో కోడళ్ళు చనిపోయారని తెలుసుకుంటుంది. ఇది ఒక శాపం కారణంగా జరుగుతోందనే విషయం కూడా తెలుస్తుంది. ఈ మరణాల వెనుక ఉన్న కారణం ఏమిటి ? దాని వెనుక ఎవరున్నారు ? ఆ శాపం వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి ? కొత్త కోడలు కూడా చనిపోతుందా ?ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ కన్నడ హారర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి. ఇందులో అనుమానాస్పద మరణాలు, దైవ ఆరాధనతో ముడిపడిన అంశాలు, వాటిని ఛేదించే ప్రయత్నంలో జరిగే ఉత్కంఠభరిత సన్నివేశాలు ఈ సిరీస్‌ను ప్రత్యేకంగా నిలిపాయి.

Read Also : ప్రియుడనుకుంటే యముడయ్యాడు … ఒక అమ్మాయిని ముగ్గురుకలసి … ఈ రివేంజ్ డ్రామా ఘోరం సామి

Tags

Related News

OTT Movie : అర్దరాత్రి కార్లో ఏకాంతంగా లవర్స్… పోలీస్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… గుండె జారిపోయే రియల్ స్టోరీ

OTT Movie : నలుగురు అబ్బాయిలు ఒకే అమ్మాయితో… ఈ ఆడపులి రివేంజ్ కాటేరమ్మ జాతర మావా

OTT Movie : పెళ్ళైన మహిళ మరో వ్యక్తితో… మర్డర్స్ తో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్… ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

OTT Movie : ట్రాన్స్ జెండర్ల బ్రూటల్ రివేంజ్… ఒక్కో ట్విస్టుకు గూస్ బంప్స్… పెద్దలకు మాత్రమే ఈ మూవీ

OTT Movie : షార్ట్ ఫిలిం పేరుతో బీచ్ కి తీసుకెళ్లి… టీనేజ్ అమ్మాయితో ఆ పని… మస్ట్ వాచ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie :సిటీ జనాల్ని చితగ్గొట్టే డిమాన్స్… సూపర్ హీరోలనూ వదలకుండా దబిడి దిబిడే

OTT Movie : ఈ వారం ఓటీటీలోకి అడుగు పెట్టిన సిరీస్ లు… ఒక్కోటి ఒక్కో జానర్ లో

OTT Movie : తలపై రెడ్ లైన్స్… తలరాత కాదు ఎఫైర్స్ కౌంట్… ఇండియాలో వైరల్ కొరియన్ సిరీస్ స్ట్రీమింగ్ షురూ

Big Stories

×