OTT Movie : రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలను, ఓటీటీలో ఫాలో అయ్యేవాళ్ళు ఎక్కువగానే ఉన్నారు. వీటిలో ఉండే బో*ల్డ్ సీన్స్ కోసం ఒంటరిగా వీటిని చూస్తూ తృప్తి పడుతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ సినిమాలో బో*ల్డ్ సీన్స్ సెగలు పుట్టిస్తాయి. ఈ సినిమాను చూస్తే రాత్రి ఏమోగాని, పగలు కూడా నిద్ర పట్టడం కష్టంగానే ఉంటుంది. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
బాబీ అనే అమ్మాయి, తనకు కాబోయే ఫియాన్సీ కాయో తో సంతోషంగా ఉంటుంది. అయితే అతను మాత్రం ఆమెను వాడుకోవడానికి మాత్రమే చూస్తుంటాడు. అతను ఆమెను మోసం చేస్తున్నాడని తెలుసుకున్నప్పుడు, బాబీకి ప్రపంచం తలకిందులవుతుంది. కాయో మరొక మహిళతో సంబంధం కలిగి ఉన్నాడని, ఫోటోల ద్వారా బాబీకి తెలుస్తుంది. దీంతో ఆమె అతనితో వివాహాన్ని రద్దు చేసుకుంటుంది. ఇప్పుడు తన జీవితంలో మార్పును కోరుకుంటుంది బాబీ. కొత్త హాబీలను అలవర్చుకుంటూ, జుట్టు రంగు మార్చుకుంటుంది. మోటార్‌సైకిల్ క్లబ్‌లో చేరుతుంది. ఈ సమయంలో ఆమె మార్కో అనే హాండ్సమ్ జడ్జిని కలుస్తుంది. అతనితో ఆమె శృంగారంలో హద్దులు దాటిపోతుంది. ఇక తన కామ దాహాన్ని తీర్చుకోవడానికి, అతనితో పడకగదిలో ఒక యుద్ధమే చేస్తుంది. అయితే కొన్ని రోజుల్లోనే మార్కో కూడా పూర్తిగా నమ్మదగినవాడు కాదని బాబీకి అనుమానం వస్తుంది.
అతనికి మానసిక సమస్యలతో బాధపడుతున్న భార్య, ఆసుపత్రిలో ఉన్న కుమార్తె ఉన్నారని బాబీ తెలుసుకుంటుంది. ఆతరువాత మార్కో, బాబీ తో తాను మంచివాడినని చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు. ఆమె కూడా ఇప్పుడు అతన్ని క్షమిస్తుంది. ఇంతలో బాబీ స్నేహితుడు థియాగో ఆమెకు మద్దతుగా ఉన్నట్లు కనిపిస్తాడు. కానీ చివర్లో అతను కాయోతో కలిసి మనీ లాండరింగ్ కేసులో పాల్గొని, బాబీని హత్య చేయడానికి ప్రయత్నిస్తాడని తెలుస్తుంది. ఒక రోజు కాయో, థియాగో బాబీని చంపాలని ప్లాన్ చేస్తారు. కానీ కాయో ఆమెను చంపలేకపోతాడు. ఈ గందరగోళంలో థియాగో కాయోను చంపేస్తాడు. చివరకు బాబీ ఈ కుట్ర నుంచి బయటపడుతుందా ? ఆమెకు ఎవరు నమ్మకంగా ఉంటారు? మార్కో ఆమెకు సహాయం చేస్తాడా ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : ప్రియుడు ఉండగానే మరొకడితో… చెమటలు పట్టించే బో*ల్డ్ సీన్స్… ఈ రొమాన్స్ కి నిద్ర కష్టమే
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
ఈ బ్రెజిలియన్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బర్నింగ్ బెట్రాయల్’ (Burning Betrayal). 2023 లో వచ్చిన ఈ మూవీకి డీగో ఫ్రేటస్ దర్శకత్వం వహించారు. ఇది స్యూ హెకర్ రాసిన ‘O Lado Bom de Ser Traída’ నవల ఆధారంగా రూపొందించబడింది. ఈ మూవీ బాబీ అనే అమ్మాయి జీవితం చుట్టూ తిరుగుతుంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.