Fire accident: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్యాట్నీ సెంటర్ లోని ఎస్బీఐ బ్యాంక్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనం నాలుగో అంతస్తు నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. వెంటనే చుట్టుపక్కల వారు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది. భారీగా ఎగిసిపడుతున్న మంటలను సిబ్బంది ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. అగ్నిప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
భారీగా అగ్నికీలలు ఎగిసిపడుతూ ఉండడంతో.. మంటలను ఆర్పడం కష్టమవుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఆదివారం కావడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. అయితే, ఆ భవనంలో ఎవరైనా ఉన్నారా? లేదా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read: Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. ఈ జిల్లాల్లో పిడుగులు, రాళ్లతో కూడిన వర్షం..