Andhra Pradesh News: హమ్మయ్య.. ఆ ప్రకటన వస్తుందని ఎదురుచూపుల్లో ఉన్న రైతన్నల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. ఈ మాటలు ఆషామాషీగా చెప్పిన మాట కాదు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఇక ఆందోళన వద్దు. మీ ఖాతాల్లో చెక్ చేసుకుంటే సరి. ఇక అసలు విషయంలోకి వెళితే..
రైతన్నా.. నీకోసమే
ఏపీలోని రైతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోంది. ధాన్యం అమ్మిన 24 గంటల్లో రైతన్నల ఖాతాల్లోకి నగదు జమ కావడం, వరదల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవడం, మిర్చి రైతులకు అండగా ప్రభుత్వం ముందుండడం, ఇవన్నీ కూటమి ప్రభుత్వం రైతుల పట్ల చూపుతున్న ప్రేమకు తార్కాణాలు. ఇలా రైతన్నల కోసం ఎన్నో సబ్సిడీ యంత్రాలను కూడా ప్రభుత్వం అందజేసింది. అందుకే సీఎం చంద్రబాబు ఇది రైతు ప్రభుత్వం అని అంటుంటారు.
ఈ స్కీమ్ తో.. రైతన్నకు అండగా
ఏపీలో అన్నదాత సుఖీభవ స్కీమ్ ద్వారా రైతాంగానికి అండగా నిలవాలన్నదే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. పెట్టుబడి సాయం అందిస్తే కాస్త రైతన్నలకు ఆర్థిక భారం తగ్గించాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. అందుకే పెట్టుబడి సాయం కింద కేంద్రం అందిస్తున్న రూ. 6000 సాయానికి, ప్రభుత్వం కూడా అండగా ఉంటోంది. ప్రభుత్వం తరపున మరో రూ. 14 వేలు కలిపి రైతన్నల ఖాతాలో నగదు జమ కానుంది.
బడ్జెట్ లో రైతాంగానికి పెద్దపీట
ఏపీ బడ్జెట్ లో రైతాంగానికి అండగా నిలిచే అన్నదాత సుఖీభవ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 9400 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో ప్రతి ఏడాది అర్హత గల ప్రతి రైతుకు రూ. 20 వేలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అందుకే ఏకంగా రైతన్నల కోసం అన్ని కోట్ల బడ్జెట్ ను కేటాయించింది.
ఇంతకు పథకం ఎప్పుడు?
ఏపీ రైతులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న పథకం గురించి చల్లని కబురు వచ్చేసింది. తాజాగా సీఎం చంద్రబాబు పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ పథకం గురించి కీలక సమాచారం చెప్పేశారు. ఈ నెలలో తప్పక రైతన్నల ఖాతాలో అన్నదాత సుఖీభవ నిధులు జమ కావడం ఖాయమని చంద్రబాబు ప్రకటించారు. సీఎం నోట ఈ మాట రావడంతో ఈ స్కీమ్ గురించి ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చినట్లు చెప్పవచ్చు.
Also Read: AP Rains: ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు.. మరో 4 రోజులు అక్కడ ఇదే పరిస్థితి.. ఎందుకిలా?
నిధుల జమకు ఈ పద్దతేనా?
ప్రస్తుతం కేంద్రం జమ చేస్తున్న రూ. 6 వేల నగదు మూడు విడతలుగా రైతుల ఖాతాలో జమ చేస్తుంది. ఇదే తరహాలో ఏపీ కూటమి ప్రభుత్వం కూడా ఇవ్వదలచిన రూ. 14 వేల నగదును మూడు విడతలుగా జమ చేస్తుందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఏదిఏమైనా రైతన్నలు మాత్రం తమకు ఎలాగైనా ప్రభుత్వ సాయం అందితే చాలని తెలుపుతున్నారు. మరి రైతన్నలూ.. ఈ నెలలో మీ ఫోన్ టన్.. టన్ అంటూ మ్రోగే సమయం ఆసన్నమైంది.