OTT Movie : కొన్ని సినిమాలు అలాంటి సీన్స్ తో, డిఫరెంట్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక జంట లవ్ స్టోరీతో పాటు, ఆ సీన్స్ తో కూడా కేక పెట్టిస్తారు. సమ్మర్ లో హీట్ ను పెంచే ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
స్టోరీలోకి వెళితే…
టెస్సా యంగ్ అనే కాలేజ్ విద్యార్థిని, తన హైస్కూల్ ప్రియుడు నోహ్‌తో సంతోషంగా ఉంటుంది. కాలేజ్ మొదటి సంవత్సరం సరదాగా గడచిపోతూ ఉంటుంది. ఇంతలో ఆమెకు బ్యాడ్ బాయ్ ఇమేజ్ ఉండే హార్డిన్ స్కాట్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. టెస్సా డీసెంట్ గా ఉంటే, హార్డిన్ మనస్తత్వం పూర్తి భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ వారి మధ్య ఆకర్షణ పెరుగుతుంది. టెస్సా హార్డిన్‌తో సమయం గడపడం ప్రారంభిస్తుంది. ఒక పక్క బాయ్ ఫ్రెండ్ ఉండగానే, హార్డిన్‌తో కూడా ప్రేమలో పడుతుంది. అతని మీద కోరిక కలుగుతుంది.
టెస్సా తన విలువలను పక్కన పెట్టి హార్డిన్‌తో ఏకాంతంగా గడపడానికి ఇష్టపడుతుంది. వాళ్ళిద్దరూ యవ్వనంలో ఉండటంతో, ఇక పని ఆపకుండా మొదలుపెడతారు. ఎప్పుడు పడితే అప్పుడు వాళ్లు ప్రయివేట్ పనిలో మునిగి తేలుతారు. అయితే హార్డిన్ కు మిగతా వాళ్ళతో ఉన్న సంబంధాలు, అతని ప్రవర్తన కారణంగా వారి ప్రేమకు సవాళ్ళు ఎదురౌతాయి. ఒక దశలో టెస్సా, హార్డిన్ గురించి ఒక షాకింగ్ నిజాన్ని తెలుసుకుంటుంది. ఇది ఆమె హార్ట్ బ్రేక్ చేస్తుంది. చివరికి టెస్సా, హార్డిన్ లు విడిపోతారా ? వాళ్ళ మధ్య రొ*మాన్స్ మళ్ళీ మొదలౌతుందా ? హార్డిన్ గురించి టెస్సా తెలుసుకున్న సీక్రెట్ ఏమిటి ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ రొమాంటిక్ మూవీని మిస్ కాకుండా చూడండి.
Read Also : ఇదెక్కడి అరాచకంరా సామీ… ఒక్క అమ్మాయితో ఊర్లో ఉన్న అబ్బాయిలందరికీ అదే పని
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ అమెరికన్ మూవీ పేరు ‘ఆఫ్టర్’ (After). 2019 లో వచ్చిన ఈ మూవీకి జెన్నీ గేజ్ దర్శకత్వం వహించారు. 2014 లో అన్నా టాడ్ రాసిన నవల ఆధారంగా ఈ మూవీ తెరకక్కింది. ‘ఆఫ్టర్’ ఫిల్మ్ సిరీస్‌లో ఇది మొదటి భాగం. ఇందులో హీరో ఫియెన్నెస్ టిఫిన్, జోసెఫిన్ లాంగ్‌ఫోర్డ్ ప్రధాన పాత్రల్లో నటించారు. సెల్మా బ్లెయిర్, ఇనాన్నా సర్కిస్, షేన్ పాల్ మెక్‌గీ, పియా మియా, ఖదీజా రెడ్ థండర్, డైలాన్ ఆర్నాల్డ్, శామ్యూల్ లార్సెన్, జెన్నిఫర్ బీల్స్ సహాయక పాత్రల్లో నటించారు.
ఈ మూవీ యునైటెడ్ స్టేట్స్‌లో 2019 ఏప్రిల్ 12న అవిరాన్ పిక్చర్స్ ద్వారా విడుదలైంది. ఇది కమర్షియల్ గా కూడా విజయవంతమైంది. $14 మిలియన్ బడ్జెట్‌తో తెరకెక్కగా, ప్రపంచవ్యాప్తంగా $69 మిలియన్లకు పైగా వసూలు చేసింది. After సినిమాకు After We Collided (2020), After We Fell (2021), After Ever Happy (2022), After Everything (2023) వంటి సీక్వెల్స్ వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ అందుబాటులో ఉంది.