E-Paper
Advertisement

ఒక్క అమ్మాయి కోసం ఇద్దరబ్బాయిలు… తెలుగులోనే ట్రయాంగిల్ వెబ్ సిరీస్

ఒక్క అమ్మాయి కోసం ఇద్దరబ్బాయిలు… తెలుగులోనే ట్రయాంగిల్ వెబ్ సిరీస్
Advertisement

Romantic series: ఓటీటీలో క్రైమ్, థ్రిల్లర్, హారర్ కథలే కాదు.. కాలేజీ లైఫ్, లవ్ స్టోరీలు వంటి యూత్ డ్రామాలకు కూడా ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. అలాంటి ప్రేక్షకుల కోసం మరోసారి ఓటీటీలో సందడి చేస్తోంది ‘క్యాంపస్ బీట్స్ సీజన్ 7: ది గేమ్ ఆఫ్ లవ్’ (Campus Beats Season 7: The Game of Love). ఇప్పటికే యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు కొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసారి కథలో డ్యాన్స్ కాంపిటీషన్స్ మాత్రమే కాదు.. ప్రేమలో తీసుకోవాల్సిన కఠిన నిర్ణయాలు, స్నేహం కోసం చేసే త్యాగాలు, కాలేజీ భవిష్యత్తును మార్చే అనూహ్య పరిణామాలు కూడా ఉన్నాయి. కాలేజీ రోజులను మరోసారి గుర్తు చేసుకునేలా చేసే ఈ సిరీస్ ఏ ఓటీటీలోకి వచ్చింది ? ఈ సిరీస్ కథ ఏంటి ? అనేది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

Advertisement

వైట్‌హాల్ కాలేజీలో జరిగే ప్రతిష్టాత్మకమైన బ్రెయిన్ అండ్ బ్రాన్ కప్ పోటీలతో సినిమా స్టార్ట్ అవుతుంది. కాలేజీ మొత్తం ఆ పోటీల హడావుడిలో మునిగిపోతుంది. డ్యాన్స్ చేయడం మాత్రమే కాదు.. ప్రతి టీమ్ గెలవాలనే పట్టుదలతో ముందుకు సాగుతుంది. ఈ హడావుడి మధ్య నేత్ర జీవితంలో మరో పెద్ద సంఘర్షణ మొదలవుతుంది.

ఒకవైపు తనను ఎంతో ప్రేమించే, ఎప్పుడూ అండగా నిలిచే సుమీర్. మరోవైపు ఇంకా మనసులో చెరిగిపోని ఎక్స్ లవర్ ఇషాన్. ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో అర్థంకాక ఆమె ఆలోచనలో పడుతుంది. మరోవైపు డ్యాన్స్ పోటీలు జరుగుతున్న కొద్దీ విద్యార్థుల మధ్య పోటీ, ఈర్ష్య, విభేదాలు పెరుగుతాయి. అదే సమయంలో కాలేజీ భవిష్యత్తునే ప్రమాదంలో పడేసే ఒక సీక్రెట్ ముప్పు ముంచుకొస్తుంది. అది ఏమిటో ఎవరికీ అర్థం కాదు.

Advertisement

నేత్ర చివరికి తన మనసు మాట వింటుందా ? ఇషాన్, సుమీర్‌లలో ఎవరితో తన జీవితాన్ని కంటిన్యూ చేయాలని డిసైడ్ అవుతుంది ? కాలేజీని కమ్ముకున్న ఆ ప్రమాదం ఏంటి? దాని నుంచి విద్యార్థులు ఎలా బయటపడ్డారు ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సిరీస్ పై ఒక లుక్కేయాల్సిందే.

తెలుగులో స్ట్రీమింగ్ అవుతోందా ?

‘క్యాంపస్ బీట్స్ సీజన్ 7’లో శంతను మహేశ్వరి, శృతి సిన్హా, పారస్ కల్నావత్ ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు అనిరుద్ధ రాజ్‌దెర్కర్ యూత్ ఎమోషన్స్‌ను ఈ సిరీస్ ద్వారా చక్కగా తెరపైకి తీసుకొచ్చాడు. ప్రతి ఎపిసోడ్ ఎండ్ అయ్యే సరికి తర్వాత ఏం జరుగుతుందా అనే ఆసక్తి పెరుగుతుంది. Amazon MX Playerలో ఈ సిరీస్ ఫ్రీగానే స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్ 7లో 6 ఎపిసోడ్లు ఉన్నాయి. ఈ హిందీ సిరీస్ ఇంకా తెలుగులో అందుబాటులో లేదు. ఒకవేళ చూడాలనుకుంటే సీజన్ 7 కంటే ముందు మిగతా 6 సీజన్లు చూస్తే బెటర్. డ్యాన్స్, యూత్ ఫుల్ లవ్ స్టోరీలు, కాలేజీ డ్రామాలను ఇష్టపడే వారు మిస్ అవ్వకుండా ఈ సిరీస్ ను చూడాల్సిందే.

Read Also: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాకు చుక్కలు చూపించే లేడీ సింగం… ఒక్కొక్కడికీ చుక్కలే

Related News

పేర్లు తెలిస్తే చాలు చంపే టాలెంట్… స్పైన్ చిల్లింగ్ కొరియన్ హర్రర్ సిరీస్

సముద్రం అడుగున గుట్టలుగుట్టలుగా బంగారం… హై-వోల్టేజ్ యాక్షన్ తో దుమ్మురేపే డిజాస్టర్ థ్రిల్లర్

బాత్రూమ్ లో మందుతో తల్లి మృతి… అనుమానమంతా తండ్రిపైనే… నిమిషానికో ట్విస్ట్ మావా

పోలీస్ అధికారి రాసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఏ ఓటీటీలో అంటే?

ప్రాణంగా చూసుకున్న పాపనే చంపి ఫ్రిడ్జ్ లో… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న తమిళ సిరీస్

దురదృష్టవంతుడి చేతిలో విశ్వవినాశనాన్ని ఆపే బాధ్యత… మైండ్ బెండింగ్ సైన్స్ ఫిక్షన్ కామెడీ సిరీస్

బ్యాచిలర్ పార్టీకని వెళ్ళి దిక్కుతోచని చిక్కుల్లో… కట్ చేస్తే బట్టల్లేకుండా బీచ్ లో

Big Stories

Advertisement
×