E-Paper
Advertisement

OTT Movie : అంతు చిక్కని ఏలియన్ మిస్టరీ… గవర్నమెంట్ బండారం బట్టబయలు… బుర్రబద్దలయ్యే ట్విస్టులున్న సై-ఫై థ్రిల్లర్

OTT Movie : అంతు చిక్కని ఏలియన్ మిస్టరీ… గవర్నమెంట్ బండారం బట్టబయలు… బుర్రబద్దలయ్యే ట్విస్టులున్న సై-ఫై థ్రిల్లర్
Advertisement

OTT Movie : యాక్షన్, సస్పెన్స్‌తో నడిచే ఒక థ్రిల్లర్ సినిమాను చూడాలనుకుంటున్నారా ? అయితే ఈ సినిమాపై ఓ లుక్ వేయండి. ఇందులో ఒక అమ్మాయి, ఒక ప్రమాదకరమైన డ్రగ్ గ్యాంగ్ ని ఎదుర్కొంటుంది. ఈ సినిమాలో వచ్చే ఛేసింగ్ సీన్స్ ఉత్కంఠతను పెంచుతాయి. క్లైమాక్స్ ట్విస్ట్ కి మైండ్ బెండ్ అవుతుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకివెళ్తే …

కథలోకి వెళ్తే

అలెక్సిస్ ఒక టీనేజ్ అమ్మాయి. తన శాడిస్ట్ తండ్రి, స్థానిక బైకర్ గ్యాంగ్ లీడర్ వల్ల కష్టాలు పడుతుంటుంది. ఆమె జోష్, ఎమ్మీ, జాక్ అనే తన ముగ్గురు స్నేహితులతో కలిసి నేషనల్ పార్క్‌లో హైకింగ్ కోసం వెళ్తుంది. అక్కడ వాళ్లు అనుకోకుండా కొకైన్‌తో నిండిన ఒక క్రాష్ అయిన డ్రగ్ ప్లేన్‌ను కనుగొంటారు. ఈ ప్లేన్‌ను కనుగొనడం వాళ్ల సరదా ట్రిప్‌ కాస్తా ప్రమాదకరమైన ట్రిప్ గా మారుతుంది. ఎందుకంటే డ్రగ్స్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఒక రూత్‌లెస్ క్రిమినల్ గ్యాంగ్ వాళ్ల వెనుక పడుతుంది. అలెక్సిస్ ఆమె స్నేహితులు ఈ గ్యాంగ్‌తో తలపడాల్సి వస్తుంది. కానీ వాళ్లను వేటాడే ఈ గ్యాంగ్ కంటే మరింత ప్రమాదకరమైన శత్రువు బయటపడుతుంది. ఇక్కడ ఒక ఏలియన్ సంచరిస్తున్నట్లు తెలుస్తుంది.

Advertisement

ఇప్పుడు అలెక్సిస్ అడవిలో తన తెలివితేటలు, ధైర్యాన్ని ఉపయోగించి గ్యాంగ్‌ను అవుట్‌స్మార్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కథ ముందుకు సాగుతున్న కొద్దీ, అలెక్సిస్ తండ్రి ఈ డ్రగ్ స్మగ్లింగ్ ఆపరేషన్‌లో ఒక భాగమని, ఆమెను ఈ ప్రమాదంలోకి లాగిన వ్యక్తి అతనేనని తెలుస్తుంది. ఈ నిజం ఆమెను మానసికంగా కుంగదీస్తుంది. కానీ ఆమె తన స్నేహితులను కాపాడడానికి, తన తండ్రి గ్యాంగ్‌ని ఎదుర్కోవడానికి నిర్ణయించుకుంటుంది. సినిమా ఒక టెన్స్‌డ్ క్లైమాక్స్‌లో ముగుస్తుంది. ఈ పోరాటంలో అలెక్సిస్ విజయం సాధిస్తుందా ? తన స్నేహితులను కాపాడుకుంటుందా ? ఆ ఏలియన్ కథ ఏమిటి ? ఈ సినిమా ఎలాంటి ముగింపును ఇస్తుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

‘కాస్కేడ్’ (Cascade) 2023లో విడుదలైన కెనడియన్ థ్రిల్లర్ చిత్రం. ఎగిడియో కాస్మిగ్లియో దర్శకత్వంలో, సారా వైస్‌గ్లాస్ (అలెక్స్), జోయెల్ ఓలెట్ (జెస్సీ), సాడీ లఫ్లామ్-స్నో (ఎమ్), స్టీఫెన్ కలిన్ (విన్స్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2023 జూలై 6న గెలాక్సీ సినిమాస్‌లో ప్రీమియర్ అయింది. 2023 అక్టోబర్ 17న నెట్‌ఫ్లిక్స్ లో విడుదలై, 1 గంట 35 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 4.8/10 రేటింగ్ ను అందుకుంది.

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×