Bigg Boss 9 Telugu Granda Launch: బుల్లితెర ప్రేక్షకులంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆ టైం వచ్చేసింది. మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ షో తిరిగి బుల్లితెరపైకి రాబోతోంది. ఇవాళ(సెప్టెంబర్ 7) బిగ్ బాస్ కొత్త సీజన్ గ్రాండ్ గా లాంచ్ కాబోతోంది. ఎప్పుటిలాగే ఈసారి కూడా కింగ్ నాగార్జున షోని హోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే వరుస ప్రోమోలు రిలీజ్ చేస్తూ నాగార్జున కొత్త సీజన్ పై బజ్ పెంచుతున్నాడు. మరోవైపు అగ్నీ పరీక్ష పేరుతో కామన్ మ్యాన్స్ ని సిద్ధం చేస్తున్నారు. ఈసారి హౌజ్ లో రెండు ఇల్లు, రెండు టీంలు ఉండబోతున్నాయి.
సెలబ్రిటీలు, సామాన్యులు మధ్య హోరాహోరీ ఉండబోతుంది. ఇక ఈ రణరంగానికి బిగ్ బాస్ 9 తెలుగు కొత్త సీజన్ సిద్ధమైంది. నేడు గ్రాండ్ లాంచ్ తో బుల్లితెరపై బిగ్ బాస్ కొత్త సిజన్ సందడి చేయబోతోంది. మొన్నటి వరకు సీరియల్స్, షోలోతో బిజీగా అయిన ఆడియన్స్ మూడు నెలల పాటు బిగ్ బాస్ షోతో డబుల్ ఎంటర్టైన్మెంట్ పొందబోతున్నారు. ఇక హోస్ట్ చెప్పినట్టు హౌజ్ లో చదరంగమా? రణరంగమా? అనేది కంటెస్టెంట్స్ డిసైడ్ చేస్తారు. సామాన్యులు వర్సెస్ సెలబ్రిటీలు అనగానే హౌజ్ లో ఎలాంటి వాడి వేడి ఉండబోతుందో అర్థమైపోతుంది.
ఇదంత చూస్తుంటే ఈసారి బిగ్ బాస్ షో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటున్నారు. ఎన్నో అంచనాలతో రేపు బిగ్ బాస్ కొత్త సీజన్ గ్రాండ్ గా లాంచ్ కాబోతోంది. ఈ రోజు సాయంత్ర 7 గంటలు షో ప్రారంభం కానుంది. అయితే ఈసారి సామాన్యులకు ఎంట్రీ ఉండటంతో సెలబ్రిటీల కంటెస్టెంట్స్ ఎవరనే ఫోకస్ కాస్తా తగ్గింది. మరోవైపు అగ్నీ పరీక్షలో సామాన్యుల దూకుడు చూస్తుంటే సెలబ్రిటీలకు చుక్కలే అన్నట్టు అనిపిస్తోంది. మరి హౌజ్ వచ్చే సెలబ్రిటీలు ఎవరనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో మాత్రం సెలబ్రిటీ కంటెస్టెంట్స్ లిస్ట ఒకటి చక్కర్లు కొడుతుంది. దీని ప్రకారం ఈసారి హౌజ్ లో సినీ, టీవీ, యూట్యూబ్, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయేన్సర్స్ తో పాటు ఫోక్ సింగర్స్ ని కూడా దింపుతున్నారు.
రీతూ చౌదరి, తనూజ గౌడ, జానీ మాస్టర్ మాజీ అసిస్టెంట్ శ్రేష్టి వర్మ, జబర్థస్త్ ఇమ్మాన్యుయేల్, ఆషా సైీ, సంజనా గల్రానీ, ఫోక్ సింగర్ రాము రాథోడ్, సుమన్ శెట్టి, భరణీలు కన్ఫాం అయినట్టు తెలుస్తోంది. దీంతో లాంచ్ ఈవెంట్ లో తొమ్మిది మంది సెలబ్రిటీలు, ఆరు మంది కామన్ పీపుల్ హౌస్ లోకి ఎంటర్ అవుతారని తెలుస్తోంది. కామనర్స్ లో మాస్క్ మ్యాన్ హరీష్, దమ్ము శ్రీజ, ఆర్మీ పవన్ కల్యాణ్, డీమాన్ పవన్, మనీష్, ప్రియా ఉన్నారని టాక్. మరీ ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరనేది ఫుల్ క్లారిటీ రావాలంటే ఈ రోజు సాయంత్రం వరకు వేచి చూడక తప్పదు. బిగ్ బాస్ మరింత ఆసక్తి పెంచేందుకు ఈసారి సరికొత్తగా ప్లాన్ చేసింది టీం. షో మొదలైన తొలి రోజే ఓ షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుంది. బిగ్ బాస్ హౌజ్ ని రెండు భాగాలుగా చేసి.. కామనర్స్, సెలబ్రిటీల మధ్య సూపర్ వార్ ఆడించపోతున్నాడు బిగ్ బాస్.