Weekly Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఈ వారం (సెప్టెంబర్ 07 – సెప్టెంబర్ 13) రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పంచమ బుధాదిత్య యోగం వల్ల శుభఫలితాలు చూస్తారు. చతుర్థ మందు శుక్రుడు లక్ష్మీ కటాక్షం ప్రసాదిస్తున్నాడు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. 5వస్థానంలో కేతు సంచారం వల్ల కొన్ని విషయాల్లో తడబడుతారు. విహార యాత్రలు చేస్తారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. పాత గొడవలు తిరగబెడుతాయి. సోదరుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అదృష్ట సంఖ్య 5
సంతానంతో చిన్న చిన్న గొడవలు మొదలవుతాయి. మానసికంగా కృంగి పోతారు. మీ మాటల్లోని సత్యాన్ని ఎదుటి వారు గ్రహించలేరు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఇంటి విషయాలు బయటి వ్యక్తులతో చర్చించకండి. దూర ప్రయాణాలు చేయడం వల్ల మానసికంగా కుదుటపడుతారు. అదృష్ట సంఖ్య:6
సమస్యలు అడ్డుపడుతున్నా పెద్దల ఆశీర్వాదంతో వాటిని అధిగమిస్తారు. నేత్ర సంబంధిత వ్యాధులు ఇబ్బంది పెడతాయి. పితృవర్గం వారు మిమ్మల్ని ఆదుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో వ్యతిరేక తీర్పులు వస్తాయి. నమ్మిన వారే మోసం చేస్తారు. అదృష్ట సంఖ్య 8
ఆకర్షణీయమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదాయాన్ని వివిధ మార్గాల ద్వారా పెంచుకుంటారు. షేర్లలో పెట్టుబడుల వల్ల లాభాలు పొందుతారు. 8వస్థానంలో చంద్ర, రాహువు సంయోగం వల్ల అవమానాలు ఎదురవుతాయి. అదృష్ట సంఖ్య:3
వృత్తిలో తగిన గుర్తింపు లభిస్తుంది. రాజకీయ పరమైన పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా బలపడుతారు. సౌమ్యంగా మాట్లాడటం మంచిది. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడతాయి. ఎదుటి వారికి సలహాలు ఇవ్వకండి. అదృష్ట సంఖ్య:5
ఖర్చులు అధికమవుతాయి. ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనానికి బయలుదేరుతారు. శతృ బాధలు తప్పవు. పీఠాధిపతులను దర్శించుకుంటారు. గతంలో చేసిన మంచి మీకు ఉపయోగపడుతుంది. వాహన ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించండి. అదృష్ట సంఖ్య:3
ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట
అదృష్ట యోగం సిద్ధిస్తుంది. 9వస్థాన గురు దృష్టి లక్ష్మీ యోగాన్ని అధికారి యోగాన్ని ప్రసాదిస్తుంది. దశమంలో శుక్రగ్రహ సంచారం శుభయోగాన్ని లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదిస్తుంది. పదోన్నతులు కలుగుతాయి. పరస్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించండి. మీ అభ్యున్నతిని చెడగొట్టాలని చూస్తారు. అదృష్ట సంఖ్య:8
శుభగ్రహాల దృష్టివల్ల ఉన్నతమైన ఆలోచనలతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారంలో సంతృప్తి కలుగుతుంది. స్థిరమైన ఆర్థిక బలం చేకూరుతుంది. తీర్థక్షేత్రాలను దర్శిస్తారు. గంగాస్నాన ఫలం లభిస్తుంది. అదృష్ట సంఖ్య:4
అష్టమశుక్రుడు స్థానభ్రంశం కలిగిస్తాడు. పిత్రార్జింతో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. విదేశీ ప్రయాణాలు ఫలిస్తాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త వింటారు. వివాహ ప్రయత్నాలు చేస్తారు. సోదర, సోదరీమణులు అన్నివిధాలా అనుకూలంగా ఉంటారు. వేలంపాటలో విలువైన ఆస్తి దక్కించుకుంటారు. అదృష్ట సంఖ్య: 2
ఊహించని శుభఫలితాలను పొందుతారు. వంశపారంపర్య ఆస్తులు కలిసి వస్తాయి. ఉద్యోగపరంగా పైకి ఎదుగుతారు. బంధువులతో కలిసి గడుపుతారు. లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. యంత్ర పరికరాలతో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. అదృష్ట సంఖ్య:5
గురుబలం అధికంగా ఉంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. రాజకీయ నాయకులు ప్రజల్లోను అధిష్టానం వద్ద గుర్తింపు పొందుతారు. అష్టమంలో కుజుడు ప్రమాదాలను కలిగిస్తాడు. అదృష్ట సంఖ్య:3
వృత్తిపరమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. 4వస్థానంలో రాశ్యాధిపతి కేంద్ర దృష్టి వలన ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. పంచమంలో శుక్రగ్రహం లక్ష్మీ యోగాన్ని ఇస్తుంది. స్వయంకృత అపరాధం వలన కీలకమైన అవకాశాన్ని కోల్పోతారు. ఊహల లోకం నుండి బయటకు రండి.. దైవదర్శనాలు చేస్తారు. ఆరోగ్య సమస్యలని అశ్రద్ధ చేయకూడదు. అదృష్ట సంఖ్య:6
ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే