E-Paper
Advertisement

Cashero on OTT : అతీంద్రియ శక్తులతో అరాచకం… ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ కొరియన్ సూపర్ హీరో సిరీస్… 8 ఎపిసోడ్లు ఒకేసారి

Cashero on OTT : అతీంద్రియ శక్తులతో అరాచకం… ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ కొరియన్ సూపర్ హీరో సిరీస్… 8 ఎపిసోడ్లు ఒకేసారి
Advertisement

Cashero on OTT : కొరియన్ సిరీస్ లకు ప్రస్తుతం ఎంత క్రేజ్ ఉందంటే… ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ కే డ్రామాలలో సిరీసులు వచ్చినా, లేదా సినిమాలు వచ్చినా వదలకుండా చూస్తారు ఆడియన్స్. ప్రేక్షకుల డిమాండ్ మేరకు ఓటీటీలు కూడా రోజుకో సిరీస్ లతో అలరిస్తున్నాయి. తాజాగా ఒక హార్ట్ టచింగ్ కొరియన్ సిరీస్ ఓటీటీలోకి అడుగు పెట్టింది. మరి ఆ సిరీస్ ఏంటి ? ఏ ఓటీటీలో ఉంది? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

2025లో విడుదలైన సౌత్ కొరియన్ సూపర్‌ హీరో యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్ ‘కాషెరో’ (Cashero). ఈ సిరీస్ నుంచి మొత్తం 8 ఎపిసోడ్స్ ను ఒకేసారి రిలీజ్ చేశారు. లీ జూన్-హో క్రియేట్ చేసిన వెబ్‌టూన్ ఆధారంగా తీసిన Netflix ఒరిజినల్ ఇది. డైరెక్టర్ లీ జూన్-హో దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో కిమ్ హ్యాంగ్-గి (కాంగ్ సాంగ్-ఉంగ్ – కాషెరో), చోయి వూ-షిక్, పార్క్ జి-హ్వాన్, కిమ్ బైంగ్-చుల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సూపర్‌ హీరో యాక్షన్, కామెడీ డ్రామా రీసెంట్ గానే ఓటీటీలో రిలీజ్ అయింది. IMDbలో 7.2 రేటింగ్ ఉన్న ఈ సిరీస్ ఫన్, ఎమోషనల్ సూపర్‌ హీరో స్టోరీ అని ప్రశంసలు కూడా అందుకుంది.

Advertisement

Read Also :  2026లో సై-ఫై హర్రర్ థ్రిల్లర్ ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’కు ఎండ్ కార్డు… ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చు అంటే ?

స్టోరీలోకి వెళ్తే…

కథ సాధారణ గవర్నమెంట్ ఎంప్లాయీ కాంగ్ సాంగ్-ఉంగ్ (కిమ్ హ్యాంగ్-గి) చుట్టూ తిరుగుతుంది. సాంగ్-ఉంగ్ ఒక ఆర్డినరీ మనిషి. జీతం తక్కువ, ఫ్యామిలీ రిస్పాన్సిబిలిటీస్ ఎక్కువ. ఇంకేముంది రొటీన్ స్ట్రగుల్స్ కూడా ఎక్కువే. ఈ క్రమంలోనే అతనికి ఒక యూనిక్ సూపర్ పవర్ వస్తుంది. తన దగ్గర ఉన్న క్యాష్ ఆధారంగా సూపర్ స్ట్రెంగ్త్ వస్తుంది. అంటే ఎంత డబ్బు ఉంటే అంత బలం అన్నమాట. డబ్బు ఖర్చు అయితే పవర్ తగ్గిపోతుంది. ఉదాహరణకు ₹1 లక్ష ఉంటే సూపర్‌ మ్యాన్ లెవెల్ బలం, కానీ డబ్బు అయిపోతే సడన్ గా సాధారణ మనిషిలా అవుతాడు.

Advertisement

సాంగ్-ఉంగ్ ఈ పవర్‌ను మొదట సాధారణ జీవితంలో ఉపయోగిస్తాడు. ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి, చిన్న చిన్న సమస్యలు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఈ నేపథ్యంలోనే ఒక సందర్భంలో పెద్ద క్రైమ్ సిండికేట్, కరప్ట్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయిన కేసులో చిక్కుకుంటాడు. డబ్బు సేవ్ చేసి సూపర్‌ హీరోగా మారి క్రిమినల్స్‌ ను పరుగులు పెట్టిస్తాడు. కథలో కామెడీ (డబ్బు అయిపోయి పవర్ లాస్ అయ్యే సీన్స్), యాక్షన్ (స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు మాస్ ఫైట్స్), ఎమోషనల్ డ్రామా (ఫ్యామిలీ, లవ్ ట్రాక్) మిక్స్ ఉంటుంది. సిరీస్ లో డబ్బు పవర్ కాదు, హార్ట్ పవర్ అనే మెసేజ్ ఇచ్చారు. మరి విలన్స్ తో హీరో ఫైట్ ఎలా జరిగింది ? సూపర్ పవర్స్ ఉన్న వేరే హీరోలు ఎవరు ? అన్నది సిరీస్ ను చూసే తెలుసుకోవాలి.

Tags

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×