Nagabandham: పెద్దకాపు సినిమాతో నటుడిగా ప్రేక్షకులను పలకరించిన.. విరాట్ కర్ణ.. హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో చిత్రం నాగబంధం. ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహించగా.. నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. అనంత పద్మనాభ స్వామి బ్యాక్ డ్రాప్ లో సోషియో ఫాంటసీ కథగా వచ్చిన ఈ సినిమా.. గ్రాఫిక్స్ పరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే కంటెంట్ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో ఫైట్స్ తో పాటు కొన్ని సన్నివేశాలకు అనవసరంగా నిడివిని పెంచారు అనే కామెంట్లు కూడా ఆడియన్స్ నుంచి వినిపించాయి. అలా జూలై 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. నెల కూడా కాకుండానే సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.
ముఖ్యంగా విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీకి రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసినా.. థియేటర్లలో సినిమాను మిస్ అయ్యామని భావించే ఆడియన్స్ కి ఇది మాత్రం సర్ప్రైజ్ అనే చెప్పాలి. నేటి నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే సినిమా థియేటర్లలో సినిమాను మిస్ అయిన అభిమానులు ఎంచక్కా ఓటీటీలో చూడవచ్చు.
ఇకపోతే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చింది కానీ అసలు ట్విస్ట్ తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా హిందీ మినహా తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది.
also read: మంగళవారం సీక్వెల్ పై డైరెక్టర్ బిగ్ అప్డేట్.. ఈసారి అంతకుమించి అంటూ!
ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. 1756 – 1962 నేపథ్యంలో అనంత పద్మనాభ ఆలయం చుట్టూ సాగుతుంది. ఇండియన్ ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ప్రభాకర్ (జగపతిబాబు) తన 30 సంవత్సరాల కెరియర్ లో ఎన్నో రహస్యాలను ఛేదించినా.. నాగబంధం రహస్యాన్ని మాత్రం కనిపెట్టలేక పోతాడు. ఇక దీనిపై తన శిష్యులు టెస్లా, అలీ పరిశోధనలు చేస్తూ హిమాలయాలకి వెళ్తారు. అక్కడ ఎన్నో ఏళ్లుగా బంధించబడి ఉన్న బైరాగి తన మంత్ర శక్తితో అలీ గతాన్ని గుర్తు చేసి, తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. ప్రపంచాన్ని జయించాలంటే నాగబంధాన్ని విడిపించాలని, అందుకోసం బ్రహ్మ కమలం తీసుకురావాలని ఆలీని ఆదేశిస్తాడు.
తన అనుచరులతో బ్రహ్మకమలం వెతుకుతూ.. అడ్డుకున్న వాళ్లను, అందుకు సంబంధించిన వివరాలు తెలిసీ.. చెప్పని వాళ్లను క్రూరంగా చంపుతూ ఉంటాడు. చివరికి ఆ బ్రహ్మ కమలం శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో ఉన్న స్వామివారి నాభిలో ఉండే పద్మంలో ఉందని తెలిసి.. ఒక ప్లాన్ ప్రకారం ఆలయం నుంచి బయటకు తీసుకురాగా.. ఓ కారణంగా అది భైరవకోన సమీపంలోని సముద్రంలో పడిపోతుంది. ఇక దాన్ని తీసుకురావడానికి అలీ మనుషులు తులసీవనం గ్రామానికి బయలుదేరుతారు. అక్కడ డబ్బు ఆశ చూపి రుద్ర ( విరాట్ కర్ణ) సహాయంతో పడవలో భైరవకోనకు వెళ్తారు.
మరి ఆ స్వర్ణకమలం అలీ మనుషులకు దొరికిందా ? లేదా? రుద్ర వాళ్లకు సహాయం చేశాడా? ఆ బ్రహ్మ కమలానికి, రుద్రాకీ ఉన్న సంబంధం ఏమిటి? ఇందులో పార్వతి (నభా నటేష్)ఎవరు? ముస్లిం రాజుతో కలిసి బైరాగి పన్నిన కుట్ర ఏంటి ? అసలు నాగబంధం నేపథ్యం ఏమిటి? 1956లో ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.