E-Paper
Advertisement

పాడుబడిన బావిలో పగతో రగిలిపోయే యువరాణి… తెలుగులో లేటెస్ట్ మలయాళం హర్రర్ మిస్టరీ థ్రిల్లర్

పాడుబడిన బావిలో పగతో రగిలిపోయే యువరాణి… తెలుగులో లేటెస్ట్ మలయాళం హర్రర్ మిస్టరీ థ్రిల్లర్
Advertisement

Malayalam Horror movie: బ్లడ్ మూన్ చూడడానికి రెండు కళ్ళూ సరిపోవు కదా. కానీ ఆ బ్లడ్ అంటే వణికిపోయే జనాలు కూడా ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే హర్రర్ మూవీ మాత్రం అదిరిపోతుంది. ఓ పాడుబడిన బావిలో పగతో రగిలిపోతుంది యువరాణి. ఆ యువరాణి కథ ఏంటో తెలియాలంటే ‘సీక్రెట్ ఆఫ్ కళింగ’ (Secret of Kalinga) అనే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులో ఉన్న ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ లాంగ్వేజ్ ఏంటి ? సినిమాను ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాలపై ఒక లుక్ వేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

కేరళలోని అతిరప్పిల్లి సమీపంలో ఒక ప్రముఖ కాలేజీ క్యాంపస్ లో కథ షురూ అవుతుంది. ఈ కాలేజీ భూమి వందల సంవత్సరాల క్రితం నాటి పురాతన ‘కళింగ’ సామ్రాజ్యానికి చెందినది. కాలేజీ వెనుక భాగంలో “మందాకిని కాడు” అనే దట్టమైన అడవి ఉంటుంది. అయితే ఆ అడవిలోకి వెళ్ళడం నిషేధం. అదే అడవిలో ఒక పురాతన బావి ఉంటుంది. శతాబ్దాల క్రితం కళింగ రాజ్యానికి చెందిన ఒక యువరాణి ఆత్మను ఆధ్యాత్మిక బంధనాలతో ఆ బావిలో బంధించి ఉంచారు.

Advertisement

అయితే కాలేజీలోని విద్యార్థి సంఘాల ఒత్తిడి వల్ల ఆ నిషేధిత అడవిని తెరవాలని నిర్ణయం తీసుకుంటారు. ఒక బ్లడ్ మూన్ ఎక్లిప్స్ రోజున, న్యూ ఇయర్ వేడుకలు జరుగుతాయి. అలాంటి టైమ్ లో కొందరు విద్యార్థులు అనుకోకుండా ఆ బావిపై ఉన్న పవిత్రమైన సీల్‌ను బ్రేక్ చేస్తారు. ఆ క్షణం నుంచి వందల ఏళ్ల నాటి ప్రాచీన శాపానికి విముక్తి దక్కుతుంది. అప్పటి నుంచి క్యాంపస్ చుట్టుపక్కల వింతైన, భయంకరమైన, అప్పుడప్పుడు నవ్వు తెప్పించే సంఘటనలు జరగడం మొదలవుతుంది.
ఆ సంఘటనతో విద్యార్థులతో పాటు టీచర్లు కూడా గందరగోళంలో చిక్కుకుపోతారు. ఈ సినిమాలో ఆ పురాతన యువరాణి ఆత్మ వేరే వాళ్ళ శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది ? ఆమె శాపం ఏమిటి ? ఆ ఆత్మను ఎలా శాంతింపజేయాలి ? అనేది ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమాను మిస్ అవ్వకుండా చూడాల్సిందే.

తెలుగులోనూ స్ట్రీమింగ్

2026లో వచ్చిన మలయాళ సోషియో ఫాంటసీ హారర్-కామెడీ సినిమా ‘సీక్రెట్ ఆఫ్ కళింగ’. సనీష్ ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో, ధ్యాన్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఒక వినూత్నమైన హారర్-కామెడీ థ్రిల్లర్. ఇదే ఏడాది జూన్ 18న థియేటర్లలో విడుదలై మంచి సస్పెన్స్‌తో ఆడియన్స్‌ను అలరించిన ఈ సినిమా ప్రస్తుతం Sun NXTలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళ భాషలో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ ఇంకా అవైలబుల్ గా లేదు. మూవీ కాలేజీ స్టూడెంట్స్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు అందరికీ నచ్చేలా ఉంది.

Advertisement

అల్తాఫ్ సలీం, రియాజ్ ఖాన్, మాళవిక మీనన్, మెరీనా మైఖేల్ వంటి నటీనటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ప్రాచీన చరిత్ర, ఆధ్యాత్మికత, ఆధునిక కాలేజీ లైఫ్ మూడింటినీ ఒక్కటిగా ముడిపెట్టి చూపించిన విధానం బాగుంది. కొన్ని చారిత్రక యుద్ధ సన్నివేశాలను ఏఐ యానిమేషన్ టెక్నాలజీతో విజువలైజ్ చేయడం ఈ సినిమా ప్రత్యేకత.

Read Also: 17 ఏళ్ల అమ్మాయిపై గ్యాంగ్ అఘాయిత్యం… 7.5 రేటింగ్ తో అదరగొడుతున్న సినిమా తెలుగులోనే

Tags

Related News

OTT Apps banned:కేంద్రం కఠిన నిర్ణయం.. 50 ఓటీటీలు బ్యాన్!

అపరిచితుడితో జంప్ అవ్వాలనుకునే అమ్మాయి… తమిళ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

అమ్మాయి అందంగా ఉందని సొళ్ళు కారిస్తే అరాచకం… తండ్రిని చంపమంటూ షరతు

హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాకు చుక్కలు చూపించే లేడీ సింగం… ఒక్కొక్కడికీ చుక్కలే

రౌడీని రంగంలోకి దింపే చర్చ్… ఓటీటీలోకి వచ్చిన మలయాళ పీరియాడిక్ యాక్షన్ డ్రామా

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన నాగబంధం.. అక్కడే అసలు ట్విస్ట్!

బేస్మెంట్ లోని సొరంగంలోకి ఆత్మలను లాక్కెళ్ళే దుష్టశక్తి… స్పైన్ చిల్లింగ్ హర్రర్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×