E-Paper
Advertisement

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా
Advertisement

Sports Comedy Series OTT : ఒకప్పుడు కాలేజ్ ఫుట్‌బాల్‌ లో సూపర్‌ స్టార్… ఒక్క తప్పుతో కెరీర్ మొత్తం నాశనం అయితే ? మళ్లీ మైదానంలోకి రావడానికి తన అసలు గుర్తింపునే దాచేసి, కొత్త పేరుతో ఓ చిన్న కాలేజ్ టీమ్‌ లో చేరితే ? అక్కడ ఎవరూ గుర్తుపట్టకుండా ఆడాలని చూస్తున్నా, తన టాలెంట్‌ తోనే స్టార్‌ గా మారిపోతే ? ఇదే కాన్సెప్ట్‌తో నవ్వులు, స్పోర్ట్స్, ఎమోషన్, కామెడీ కలిపి తెరకెక్కించిన సిరీస్ ‘Chad Powers’. గ్లెన్ పావెల్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు మైఖేల్ వాల్డ్రాన్‌ తో కలిసి ఈ సిరీస్‌ ను రూపొందించారు. Eli Manning చేసిన వైరల్ అండర్‌ కవర్ స్కెచ్ నుంచి ప్రేరణ పొందిన ఈ స్పోర్ట్స్ కామెడీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి రస్ హాలిడే అసలు ఏం చేశాడు ? చాడ్ పవర్స్‌ గా అతని ముసుగు ఎంతకాలం నిలిచింది ? టీమ్‌ లో అతనికి ఎదురైన సమస్యలేంటి ? అనే వివరాలను కథలో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

రస్ హాలిడే ఓ ప్రతిభావంతుడైన కాలేజ్ క్వార్టర్‌బ్యాక్. కానీ అతని కెరీర్‌ ను ఓ క్షమించరాని తప్పు దెబ్బతీస్తుంది. ఎనిమిదేళ్ల తర్వాత కూడా మళ్లీ ఫుట్‌బాల్‌ లో తన స్థానాన్ని సంపాదించుకోవాలనే పట్టుదలతో రస్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంటాడు. తన రూపాన్ని మార్చుకుని, చాడ్ పవర్స్ అనే కొత్త వ్యక్తిగా మారి, బలహీనంగా ఉన్న సౌత్ జార్జియా క్యాట్‌ఫిష్ కాలేజ్ టీమ్‌ లో వాక్-ఆన్ ప్లేయర్‌ గా చేరతాడు. అసలు ఆట ఇక్కడే మొదలవుతుంది. కొత్త టీమ్‌లో తన ప్రతిభను నిరూపించుకోవాలి, అదే సమయంలో తన అసలు గుర్తింపు బయట పడకుండా జాగ్రత్తపడాలి.

Advertisement

కానీ చాడ్ పవర్స్ మైదానంలో అదరగొట్టడం మొదలు పెట్టడంతో అతనిపై అందరి దృష్టి పడుతుంది. కోచ్‌లు, సహచరులు, స్నేహితులు అనుమానాలు పెంచుకుంటుండగా, రస్ వేసుకున్న ముసుగు ఎప్పుడు తొలగిపోతుందోననే టెన్షన్‌ తో కామెడీ మరింత పెరుగుతుంది. అయితే ఈ ప్రయాణంలో రస్‌ కు కేవలం ఫుట్‌బాల్ మాత్రమే సవాల్ కాదు. టీమ్‌ తో కలిసిపోవడం, సంబంధాలను కాపాడుకోవడం, తన గతాన్ని దాచడం కూడా అతనికి పెద్ద పరీక్షగా మారతాయి. చివరికి కెరీర్‌ ను కాపాడుకోవడానికి వేసుకున్న ఈ వేషమే అతని జీవితాన్ని కాపాడుతుందా ? లేక అదే అతని అసలు కెరీర్‌కు చివరి దెబ్బ అవుతుందా ? అనేదే సిరీస్‌ లోని అసలు మజా.

Also Read : అడవి నేపథ్యంలో ఊపిరి బిగబట్టించే వేట… రక్తం ఉడికించే మలయాళం సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్

ఓటీటీలో తెలుగులో ఉందా?

Advertisement

గ్లెన్ పావెల్, పెర్రీ మాట్‌ఫెల్డ్, క్వెంటిన్ ప్లెయిర్, విన్ ఎవెరెట్, ఫ్రాంకీ రోడ్రిగెజ్, స్టీవ్ జాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కామెడీ స్పోర్ట్స్ సిరీస్‌కు గ్లెన్ పావెల్, మైఖేల్ వాల్డ్రాన్ క్రియేటర్స్. మొదటి సీజన్ 2025 సెప్టెంబర్ 30న ప్రారంభమైంది. రెండో సీజన్ 2026 సెప్టెంబర్ 3న ఆరు ఎపిసోడ్లతో విడుదలైంది. భారత్‌ లో ఈ సిరీస్ JioHotstarలో అందుబాటులో ఉంది. తెలుగు ఆడియో అందుబాటులో లేదు.

Tags

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×