E-Paper
Advertisement

అడవి నేపథ్యంలో ఊపిరి బిగబట్టించే వేట… రక్తం ఉడికించే మలయాళం సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్

అడవి నేపథ్యంలో ఊపిరి బిగబట్టించే వేట… రక్తం ఉడికించే మలయాళం సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్
Advertisement

Ananthan Kaadu OTT: ఓ అడవిలో దాక్కున్న వేటగాళ్లు… వాళ్ల జీవితాల్లోకి అనుకోకుండా అడుగు పెట్టిన ఓ శ్రీలంక తమిళ్ విప్లవకారుడు… ఆ తర్వాత మొదలయ్యే గ్యాంగ్ వార్, రాజకీయ కుట్రలు, ప్రాణాల కోసం పోరాటం. ఒకే శత్రువును ఎదుర్కోవడానికి పరస్పరం భిన్నమైన నేపథ్యాలున్న కొందరు ఒక్కటైతే ఏం జరుగుతుంది ? ఈ ప్రశ్నకు యాక్షన్, పొలిటికల్ డ్రామా, రివెంజ్ ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కించిన మలయాళం-తమిళ్ బైలింగ్వల్ సినిమా ‘Ananthan Kaadu’. మరి 1990ల తిరువనంతపురం నేపథ్యంలో అసలు ఏం జరిగింది ? అడవిలో మొదలయ్యే ఆ వేట ఎక్కడికి దారి తీసింది ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ 1990ల కాలం నాటి తిరువనంతపురం నేపథ్యంలో సాగుతుంది. స్థానికంగా చిన్న చిన్న నేరాలు చేస్తూ, తమదైన ప్రపంచంలో బతికే కొందరు గ్యాంగ్‌స్టర్ల జీవితాల్లోకి ఓ శ్రీలంక తమిళ్ విప్లవకారుడు ఎంట్రీ ఇస్తాడు. మొదట వాళ్ల మధ్య ఎలాంటి సంబంధం ఉండదు. కానీ పరిస్థితులు మారడంతో ఒక సాధారణ శత్రువును ఎదుర్కోవడానికి వాళ్లు అతనితో చేతులు కలపాల్సి వస్తుంది. అక్కడి నుంచే కథలో అసలు యాక్షన్ మొదలవుతుంది.

Advertisement

ఒకవైపు స్థానిక గ్యాంగ్‌ల మధ్య ఆధిపత్య పోరు, మరోవైపు రాజకీయ శక్తుల ప్రభావం, ఇంకోవైపు గుర్తింపు, వలస, ప్రతీకారం వంటి అంశాలు కథను ముందుకు నడిపిస్తాయి. ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితుల్లో పాత్రలు తమ ప్రాణాల కోసం పోరాడాల్సి వస్తుంది. అడవి నేపథ్యంలోని యాక్షన్ సన్నివేశాలు, వెంటాడే వేట, మారుతున్న సంబంధాలు కథకు టెన్షన్ పెంచుతాయి. సినిమా ఎండింగ్ వరకు కట్టిపడేస్తుంది.

అయితే ఆ శ్రీలంక తమిళ్ వ్యక్తి అసలు ఎవరు ? స్థానిక గ్యాంగ్‌స్టర్లు అతనితో ఎందుకు కలిశారు ? రాజకీయ ఆధిపత్య పోరులో ఎవరు ఎవరిని వాడుకున్నారు ? ప్రతీకారం కోసం మొదలైన ఈ ప్రయాణం చివరికి ఎలాంటి పరిణామాలకు దారితీసింది ? అన్నదే సినిమాలో చూడాల్సిన అసలు ఆసక్తికరమైన అంశం.

Advertisement

Also Read : సముద్రం ఎడారిగా మారితే ? మనిషి మాంసం కోసం అగాధపు జీవుల అరాచకం… థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్

తెలుగులో ఉందా?

ఆర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 2 నుంచి Manorama MAXలో స్ట్రీమింగ్ అవుతోంది. జియెన్ కృష్ణకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మురళి గోపి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ఆర్యతో పాటు మురళి గోపి, ఇంద్రన్స్, విజయరాఘవన్, సునీల్, అచ్యుత్ కుమార్, రెజీనా కసాండ్రా, శాంతి బాలచంద్రన్, నిఖిలా విమల్, దేవ్ మోహన్ తదితరులు నటించారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. ఈ సినిమా జూన్ 25న థియేటర్లలో విడుదలైంది. తాజాగా డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. ఇది మలయాళం, తమిళం భాషల్లో రూపొందిన బైలింగ్వల్ సినిమా. తెలుగు ఆడియో అందుబాటులో లేదు. పీరియడ్ బ్యాక్‌డ్రాప్, గ్యాంగ్ వార్, పొలిటికల్ డ్రామా, యాక్షన్, రివెంజ్ కలిసిన ఈ కథ ను యాక్షన్ ప్రియులు ఓసారి ట్రై చేయొచ్చు. ఈ వీకెండ్ మర్చిపోకుండా ఒక లుక్కేయండి.

Related News

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

ఒలింపిక్స్ వివాదం వెనుక అసలు కథ… 6.2 రేటింగ్ ఉన్న మైండ్ బెండింగ్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ

20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన పళ్లబురుసు .. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

వీళ్ళకు చావులేదు… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ సీక్వెల్

సముద్రం ఎడారిగా మారితే ? మనిషి మాంసం కోసం అగాధపు జీవుల అరాచకం… థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్

ZEE5లో సెప్టెంబర్ సినిమాల జాతర… మైండ్ బ్లాక్ చేసే మల్టీ-లాంగ్వేజ్ మూవీస్ సిరీస్ల లిస్ట్

1300 కోట్ల థ్రిల్లర్ తెలుగులో… కేక పుట్టిస్తున్న మైండ్ బ్లాక్ క్రైమ్ కామెడీ

Big Stories

Advertisement
×