E-Paper
Advertisement

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్
Advertisement

Psychological Horror Series: నిద్ర పట్టకపోవడం అనేది హెల్త్ ప్రాబ్లం అని మనందరికీ తెలుసు. ఈ డిజిటల్ యుగంలో చాలామంది ఈ సమస్యతో బాధ పడుతున్నారు. ముఖ్యంగా స్ట్రెస్, టెన్షన్ వల్ల ఇలాంటి సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే Insomnia సినిమాను చూశాక మాత్రం నిద్రలేమి అంటే కొత్త నిర్వచనం వెతుక్కోవాలి. అలాగని ఇదేమీ హెల్త్ కు సంబంధించిన క్లాస్ చెప్పే సినిమా కాదు, పక్కా హర్రర్ మూవీ. మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అసలు మూవీ స్టోరీ ఏంటి ? అన్న విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

సినిమాలో మన కథానాయిక పేరు ఎమ్మా అవెరిల్. ఆమెకు 40 ఏళ్లు దగ్గర పడతాయి. 40వ పుట్టినరోజుకు రెండు వారాల ముందు తీవ్రమైన నిద్రలేమి బారిన పడుతుంది. సరిగ్గా ఆమె తల్లికి కూడా 40 ఏళ్లు వచ్చే సరికే ఇలాగే నిద్ర పట్టక పిచ్చి పట్టి, కుటుంబంపై దాడి చేస్తుంది. అందుకే తన రక్తంలోనే ఏదో లోపం ఉందేమోనని భయపడుతూ, ఎమ్మా తన కుటుంబానికి పొంచి ఉన్న ఒక పెద్ద ప్రమాదాన్ని అడ్డుకుంటుంది. ఇదంతా సీజన్ 1 లో జరుగుతుంది.

Advertisement

సీజన్ 2లో ఆ శాపం ముగిసిపోయిందని భావిస్తుంది ఎమ్మా. కానీ ఆమె జీవితంలోకి మరిన్ని వింతైన సంఘటనలు జరుగుతూ భయపెడతాయి. ఆమెకు నిద్ర పట్టకపోవడంతో కథ మళ్లీ మొదటికి వస్తుంది. కానీ ఈసారి ఆమె ఒంటరిగా ఉండదు. ఆమె నిద్రలో నడుస్తున్నప్పుడు తన ఇంట్లోనే ఎవరో అపరిచిత వ్యక్తి తిరుగుతున్నట్లు, తన పిల్లలను గమనిస్తున్నట్లు ఆమెకు భ్రాంతి కలుగుతుంది. తన తల్లి గతం గురించి తనకు తెలియని మరో చీకటి కోణం దాగి ఉందని ఎమ్మా గ్రహిస్తుంది.

అందుకే ఆసుపత్రి రికార్డులను తిరగేస్తుంది. తన సోదరి ఫోబ్ దాచిన కొన్ని రహస్యాలను వెలికితీసే క్రమంలో ఆమె మరింత టెన్షన్ పడుతుంది. ఆమెకు కనిపిస్తున్న సీన్స్ నిజమా ? లేక నిద్ర లేకపోవడం వల్ల ఆమె మైండ్ ఆడుతున్న డ్రామానా ? ఈ సీజన్ ముగింపులో అయినా ఎమ్మా తన కుటుంబ శాపానికి కారణమైన అసలు కారణాన్ని కనిపెడుతుందా ? గతం నుండి తమను వెంటాడుతున్నఆ క్రైమ్ మిస్టరీ ఏంటి ? క్లైమాక్స్ లో వచ్చే మైండ్-బ్లోయింగ్ ట్విస్ట్‌ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను డోంట్ మిస్.

తెలుగులో ఉందా లేదా ?

Advertisement

బ్రిటిష్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సిరీస్ Insomnia సీజన్ 2. సారా పిన్‌బరో నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ SonyLIVలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇంగ్లీష్ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ ఇంకా రాలేదు. అయితే మీరు గనుక ఈ సిరీస్ ను చూడాలి అనుకుంటే, అంతకన్నా ముందు సీజన్ 1 చూస్తే బెటర్. ఎందుకంటే కథపై క్లారిటీ వస్తుంది. ఆ తరువాత సెకండ్ సీజన్ ను కంటిన్యూ చేయొచ్చు.

Read Also: రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

Tags

Related News

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×