E-Paper
Advertisement

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Crime Thriller Series: ప్రేమ అంటే కేవలం మనసులు కలవడం కాదు… కొన్నిసార్లు అది హత్యలకు, కుట్రలకు, అబద్ధాలకు కూడా దారి తీస్తుంది. అలా జరిగిన నాలుగు హత్యలు… లెక్కలేనన్ని అబద్ధాలు. దాని చుట్టూ తిరిగే సస్పెన్స్ థ్రిల్లరే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ మూవీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అన్న వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ నాగపూర్‌లో ఒక పేరుమోసిన రాజకీయ నాయకుడి కుమార్తె సోను అకస్మాత్తుగా అదృశ్యమవడంతో మొదలవుతుంది. ఆమె తన తండ్రి కార్ డ్రైవర్ కొడుకు మయాంక్ తో ప్రేమలో పడుతుంది. అతను మధ్యతరగతి యువకుడు. ఒక హోటల్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మయాంక్ తన ప్రియురాలైన సోనును హత్య చేసి, శవాన్ని కారు డిక్కీలో తీసుకెళ్లినట్లు పోలీసులు కన్ఫామ్ చేస్తారు. ఈ క్రమంలోనే ఆ కారును ఆపిన ఒక పోలీస్ ఆఫీసర్, ఒక క్యాబ్ డ్రైవర్, ఒక పశువుల కాపరి కూడా హత్యకు గురవుతారు.

Advertisement

మొత్తం ఈ నాలుగు హత్యల కేసులో 22 ఏళ్ల మయాంక్ ప్రధాన నిందితుడిగా మారతాడు. రెండేళ్లపాటు అతను పోలీసులకు దొరకకుండా పరారీలో ఉంటాడు. బ్రిటన్‌కు చెందిన ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఈ మిస్టరీ కేసుపై ఆసక్తితో ఇండియాకు వచ్చి విచారణ ప్రారంభిస్తాడు. అతను పరారీలో ఉన్న మయాంక్‌ను ట్రేస్ చేసి, అతని వెర్షన్‌ను ప్రపంచానికి చూపిస్తాడు. మయాంక్ తాను ఎవరినీ చంపలేదని, తన ప్రియురాలిని తానే ప్రాణంగా ప్రేమించానని చెబుతాడు. సిరీస్ లో క్రమంగా ఆ నాలుగు హత్యల వెనుక ఉన్న నిజాలు బయట పడతాయి. మరి ఆ నిజాలు ఏంటి ? అసలు ఆ అమ్మాయిని చంపింది ఎవరు ? చివరికి ఏమైంది ? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ పై ఒక లుక్కేయాల్సిందే.

తెలుగులోనూ స్ట్రీమింగ్

దర్శకుడు పుష్కర్ సునీల్ మహాబల్ ఈ కథను డాక్యుమెంటరీ స్టైల్‌లో మంచి సస్పెన్స్‌తో నడిపించాడు. పాలక్ జైస్వాల్ సోనుగా, తిగ్మాన్షు ధులియా, దేవన్ భోజాని వంటి నటులు ఇందులో నటించారు. ‘బ్లాక్, వైట్ అండ్ గ్రే: లవ్ కిల్స్’. SonyLIVలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ 6 ఎపిసోడ్లతో వచ్చి, తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ చూసిన తర్వాత ప్రేమ గురించి కొత్తగా ఆలోచించాల్సి వస్తుంది.

Advertisement

Read Also: ఇంగ్షీషు వోవెల్స్ తో సాగే కథ… ఓటీటీలోకి వచ్చిన తమిళ రొమాంటిక్ ఆంథాలజీ

Tags

Related News

వీళ్ళకు చావులేదు… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ సీక్వెల్

సముద్రం ఎడారిగా మారితే ? మనిషి మాంసం కోసం అగాధపు జీవుల అరాచకం… థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్

ZEE5లో సెప్టెంబర్ సినిమాల జాతర… మైండ్ బ్లాక్ చేసే మల్టీ-లాంగ్వేజ్ మూవీస్ సిరీస్ల లిస్ట్

1300 కోట్ల థ్రిల్లర్ తెలుగులో… కేక పుట్టిస్తున్న మైండ్ బ్లాక్ క్రైమ్ కామెడీ

2600 కోట్ల కలెక్షన్లు… 7.9 IMDb రేటింగ్… తెలుగులో అందుబాటులో ఉన్న ఆల్ టైమ్ క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో పండగే పండగ… తెలుగులో ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు

ఫ్రెండ్స్‌తో చూస్తే పొట్టచేక్కలవ్వాల్సిందే… పిచ్చి పిచ్చి గొడవలతో నవ్వించే కామెడీ డ్రామా

ఎఫైర్ ను అడ్డం పెట్టుకుని ఇదేం పాడుపని ? ప్రతీ నిమిషం నెయిల్ బైటింగ్ సస్పెన్స్

Big Stories

Advertisement
×