BigTV English

OTT Movie : కారు పోయి మేక వచ్చే… సీను సీనుకూ పొట్ట చెక్కలే… హాట్ సమ్మర్ లో కూల్ సినిమా

OTT Movie : కారు పోయి మేక వచ్చే…  సీను సీనుకూ పొట్ట చెక్కలే… హాట్ సమ్మర్ లో కూల్ సినిమా

OTT Movie : కామెడీ జానర్లో వచ్చే సినిమాలను చూడటానికి అని వర్గాల ప్రేక్షకులు ఇష్టపడుతుంటారు. ఈ సినిమాలు ఫ్యామిలీతో సహా చూసే విధంగా ఉండడమే దీనికి కారణం. బాలీవుడ్ నుంచి వచ్చిన అలాంటి ఒక కామెడీ మూవీ మంచి వ్యూస్ తో ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు కామెడీ సన్నివేశాలతో కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


స్టోరీలోకి వెళితే

నిర్మా అనే అమ్మాయికి మొహమాటం ఎక్కువ, ఆత్మవిశ్వాసం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఈమె ముంబైలో ట్రావెల్ ఏజెన్సీలో చైనీస్ కు చెందిన మాండరిన్ భాష ట్రాన్స్లేటర్ గా పని చేస్తుంది. ఇలా సంపాదించిన డబ్బుతో, మొదటిసారిగా ఒక కారును కొంటుంది. ఇందుకు ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. అయితే అదే రాత్రి ఆమె కారును ఎవరో దొంగలిస్తారు. ఈ కేసును పోలీసులు కూడా పెద్దగా పట్టించుకొకపోవడంతో, నిర్మా నిరాశలో ఉంటుంది. ఈ క్రమంలో ఆమె అనుకోకుండా ఒక ఖైదీని కలుస్తుంది. అతను ఆమెకు ఆర్టిస్ట్ అనే ఒక వ్యక్తిని కలవమని సలహా ఇస్తాడు. నిజానికి ఆర్టిస్ట్ ఒక తెలివైన మోసగాడు. చిల్లర దొంగతనాలు చేసుకుంటూ కాలం గడుపుతుంటాడు. నిర్మా అతనిని కలిశాక, కారును తిరిగి పొందడానికి ఆమెకు సహాయం చేయడానికి అంగీకరిస్తాడు.


మరోవైపు ఈ కారు ఫైయాజ్ భాయ్ అనే గ్యాంగ్‌స్టర్ దగ్గర ఉందని తెలుస్తుంది. అతను తన పెంపుడు మేకకు బాహుబలి అనే పేరు పెట్టి ఎంతగానో ప్రేమిస్తాడు. ఈ కారు తిరిగి పొందే ప్రయత్నంలో నిర్మా, ఆర్టిస్ట్ అనేక పాట్లు పడతారు. ఈ సన్నివేశాలు అందరినీ కడుపుబ్బా నవ్విస్తాయి. ఫైయాజ్ భాయ్‌ కు చెందిన బాహుబలి మేకను అడ్డు పెట్టుకొని, కారును తిరిగి దక్కించుకోవాలని ప్లాన్ వేస్తారు. అయితే వీరి ప్లాన్ ఆ గ్యాంగ్‌ స్టర్ కు తెలిసిపోతుంది. చివరికి నిర్మా కారును తిరిగి దక్కించుకుంటుందా ? గ్యాంగ్‌ స్టర్ వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి ? ఆర్టిస్ట్, నిర్మాకు ఏ విధంగా సహాయపడతాడు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ బాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : ఈ అమ్మాయి రెచ్చగొడితే ఏ మగాడైనా లొంగిపోవాల్సిందే… కేసును పక్కన పెట్టి మరీ తెల్లార్లూ…

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో

ఈ బాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్ పేరు ‘చాప్‌స్టిక్స్’ (Chopsticks). 2019 లో తెరపైకి వచ్చిన ఈ మూవీకి సచిన్ యార్డి దర్శకత్వం వహించారు. ఇందులో మిథిలా పాల్కర్, అభయ్ డియోల్, విజయ్ రాజ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ కథ ఒక యువతి జీవితంలో జరిగే అనూహ్య సంఘటనల చుట్టూ తిరుగుతుంది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో అందుబాటులో ఉంది.

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×