Actress Bharath : సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వారంతా ఇప్పుడు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొందరేమో హీరోలుగా రానిస్తున్నారు. ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక మూవీస్ లో నటించి కామెడీ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నారు చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ అయ్యాడు. అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తున్నాడు. అయితే ఎక్కువగా సినిమాల్లో కనిపించలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భరత్ తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలో తన జీవితంలో ఎదురైన కష్టాల గురించి బయటపెట్టాడు. ఆ వీడియో వైరల్ అవుతుంది. భరత్ ఏమన్నారో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
భరత్ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు..?
ఈ కుర్రాడు స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన భరత్ గురించి చాలా మందికి కొన్ని విషయాలు గురించి తెలియదు. ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చిన అప్పటినుండి భరత్ బొద్దుగా ఉండేవాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన బాద్షా లో స్లిమ్ కనిపించాడు.. అలాగే అల్లు శిరీష్ ఏబిసిడి లో కూడా భరత్ ను చూసిన ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఎందుకు అంత సన్నగా అయిపోయాడు అని అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో ఎంతోమంది అభిమానుల నుంచి ప్రశ్నలు తలెత్తడం తో.. ఆయన సన్నగా అవ్వడానికి కారణాలను ఇంటర్వ్యూలో బయట పెట్టి అందరిని కన్నీళ్లు పెట్టించాడు.. అంతేకాదు లావు ఉంటే తనకు ఎదురైన పరిస్థితులను వివరించారు.
భరత్ అనారోగ్య సమస్యలు..
ఈ కుర్రాడు ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు మెడిసన్ కోర్స్ పూర్తి చేసినట్లు బయటపెట్టాడు. చెన్నై లోని ఒక కాలేజీ లో జాయిన్ అయిన కొత్తలో నాకు ఆక్సిడెంట్ అయిందని, అప్పటివరకు లావుగా ఉండే నేను ఒక్కసారిగా సన్నగా తయారయ్యానని తెలియజేశాడు. కొన్నాళ్లకు జిమ్ లో వర్కవుట్ చేస్తున్న సమయంలో ఒక ఐరన్ రాడ్ నా కంటిలో గుచ్చుకోవడం తో కంటిలోని బ్లాక్ ఏర్పడింది. ఇప్పటికీ సరిగ్గా కనిపించదు అని భరత్ అన్నాడు. ఈ వీడియో వైరల్ అవ్వడం తో భరత్ కష్టాలను చూసి ప్రతి ఒక్కరు అయ్యో పాపం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మరోసారి వైరల్ గా మారింది.
Also Read : ఆ ఒక్కటి అడక్కు..నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న సుమక్క..
సినిమాల విషయానికొస్తే..
రెడీ మూవీ లో చిట్టినాయుడు గా భరత్ పాత్ర చాలా హైలెట్ అయ్యింది. వెంకీ,దూకుడు,కింగ్, రగడ లాంటి చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా భరత్ నటనతో ఎంతో మందికి దగ్గరయ్యాడు.. ప్రస్తుతం హీరో ఫ్రెండ్ గా నటిస్తున్నాడు. ఈ మధ్య ఒకటి, రెండు సినిమాల్లో మాత్రమే కనిపించాడు. సినిమా అవకాశాలు రాలేదో తెలియలేదు. కానీ పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. ప్రస్తుతం తన స్టడీస్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. సినిమాలంటే ఇష్టం ఉన్న ఈ యాక్టర్ కు వరుస అవకాశాలు వస్తాయేమో చూడాలి..