BigTV English
Advertisement

Operation Sindoor: ప్రతీకారం తీర్చుకున్న భారత్.. పాక్ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు, 30 మంది మృతి!

Operation Sindoor: ప్రతీకారం తీర్చుకున్న భారత్..  పాక్ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు, 30 మంది మృతి!

Operation Sindoor:  పహల్‌గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్‌. మంగళవారం అర్ధరాత్రి ఒంటిన్నర దాటిన తర్వాత ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడులు చేసింది భారత సైన్యం. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి.


ఉగ్రవాదుల స్థావరాలను శాటిలైట్ ద్వారా గుర్తించిన సైన్యం, మిస్సైళ్లతో వాటిపై విరుచుకుపడ్డాయి. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల సదుపాయాలను నేలమట్టం చేసింవది. మొత్తం తొమ్మిది స్థావరాలపై భారత్ కి చెందిన త్రివిధ దళాలు దాడులు చేశాయి. ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా అర్థరాత్రి తర్వాత ఈ ఆపరేషన్ చేపట్టింది.

భారత సైన్యం దాడులు చేసినట్టు పాకిస్థాన్‌ నిర్ధారించింది. కోట్లి, ముజఫరాబాద్‌, బహవల్‌ పూర్‌ ప్రాంతాలపై మిసైల్స్‌తో దాడులు చేసినట్లు పాకిస్థాన్‌ సైనిక ప్రతినిధి వెల్లడించారు. ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో 12 మంది గాయపడినట్టు వెల్లడించింది. మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని ప్రకటించింది రక్షణ శాఖ. పాకిస్తాన్ సైనిక స్థావరాలపై ఎలాంటి దాడులు చేయలేదని వెల్లడించింది.


ప్రభుత్వం ప్రకటన తర్వాత ఇండియన్‌ ఆర్మీ రియాక్ట్ అయ్యింది. న్యాయం జరిగింది అని ఎక్స్‌లో పోస్టు చేసింది. మెరుపు దాడులకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. దాడులు చేపట్టిన ప్రాంతాలకు సంబంధించిన వివరాలను సైన్యం వెల్లడించలేదు. మరోవైపు శ్రీనగర్, జమ్ము, అమృత్‌సర్‌, ధర్మశాల, లేహ్‌ ఎయిర్‌పోర్టులను భారత్‌ మూసివేసినట్లు సమాచారం.

ఉగ్రవాదుల స్థావరాల దాడులకు సంబంధించి అమెరికా, రష్యా, యూకె, సౌదీ అరేబియా, యూఏఈ దేశాలకు వివరించింది భారత్. అటు అమెరికా విదేశాంగ మంత్రితో మాట్లాడారు భారత్ ఎన్ఐఏ చీఫ్ అజిత్ దోవల్.  1971 యుద్ధం తర్వాత భారత్ కి చెందిన త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ ఇదే.

ALSO READ: పీవోకెలో మిస్సైళ్లతో విరుచుకుపడిన భారత్

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత్‌ ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాల వివరాలు ఇలా ఉన్నాయి.

1. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ దూరంలో ఉన్న బహవల్‌ పూర్‌లో ఉన్న జై-షే మహమ్మద్ ప్రధాన కార్యాలయం

2. మురిడ్కే, సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కి.మీ దూరంలో ఉన్న లష్కరే క్యాంప్‌

3. సరిహద్దు నియంత్రణ రేఖ పూంఛ్‌- రాజౌరీకి 35 కి.మీ దూరంలో ఉన్న గుల్పూర్‌

4. పాక్‌ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌లోని తంగ్ధర్ సెక్టార్ లోపల 30 కి.మీ పరిధిలో ఉన్న సవాయ్‌ లష్కరే క్యాంప్‌

5. జే-షే-మహమ్మద్ లాంచ్‌ ప్యాడ్‌ బిలాల్‌ క్యాంప్‌

6. రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 15 కి.మీ.ల దూరంలో ఉన్న జే-షే-మహమ్మద్ లాంచ్‌ ప్యాడ్‌

7. రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 10.కి.మీ పరిధిలో ఉన్న బర్నాలా క్యాంప్‌

8. సాంబా-కతువా ఎదురుగా అంతర్జాతీయ సరిహద్దుకు 8కి.మీ దూరంలో ఉన్న జై-షే-మహమ్మద్ సర్జల్ క్యాంప్

9. అంతర్జాతీయ సరిహద్దు కు 15 కిమీ దూరంలో సియాల్‌కోట్ సమీపంలో ఉన్న హిజ్బుల్ ముజాహిద్దీన్ శిక్షణా శిబిరం మెహమూనా క్యాంప్

 

 

Related News

Bihar Assembly Election 2025: బీహార్‌ తొలి విడత పోలింగ్‌.. 121 స్థానాలకు బరిలో 1,314 మంది

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Delhi Politics: ఓట్‌ చోరీపై కొత్త బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ.. బ్రెజిల్‌ మోడల్‌‌కు ఓటు హక్కు, హవ్వా

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Muzaffarnagar: కళాశాల విద్యార్థినులకు వేధింపులు.. యూపీ పోలీసుల స్పెషల్ ట్రీట్‌మెంట్

Big Stories

×