E-Paper
Advertisement

Christmas Special 2025 : ‘హ్యారీ పోటర్ సీజన్ 2’తో పాటు క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానున్న కొత్త సిరీసులు ఇవే

Christmas Special 2025 : ‘హ్యారీ పోటర్ సీజన్ 2’తో పాటు క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానున్న కొత్త సిరీసులు ఇవే
Advertisement

Christmas Special 2025 : క్రిస్మస్ వచ్చేసింది కదా… ఇంట్లో ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని ఏదైనా మంచి షో చూద్దామని అనుకుంటున్నారా ? అలాంటి ఆడియన్స్ కోసమే ఈ సారి ఓటీటీ డిస్కవరీ ప్లస్ సూపర్ ఎక్సైటింగ్ లైనప్‌తో వచ్చింది. మ్యాజిక్, థ్రిల్, ప్రకృతి అద్భుతాలు, ఘోస్ట్ హంటింగ్ అన్నీ ఉన్న షోలతో వరుసగా మూడు రోజుల పాటు ఎంటర్టైన్ చేయబోతోంది.

Harry Potter: Wizards of Baking – Season 2

హ్యారీ పోటర్ ఫ్యాన్స్‌కి ‘విజార్డ్ ఆఫ్ బేకింగ్ సీజన్ 2’ అనేది ఈ క్రిస్మస్ పెద్ద గిఫ్ట్. వీజ్లీ ట్విన్స్ (జేమ్స్ & ఒలివర్ ఫెల్ప్స్) హోస్ట్‌లుగా, ప్రొఫెషనల్ బేకర్స్ హ్యారీ పోటర్ సినిమాల సీన్లను అద్భుతమైన కేక్‌లు, స్వీట్స్‌గా తయారు చేస్తారు. గెస్ట్ జడ్జెస్, స్టార్స్‌తో మ్యాజిక్ ఫుల్ గా ఉంటుంది ఈ షో. డిసెంబర్ 22–23 ఎపిసోడ్స్ క్రిస్మస్ డే నుంచి డిస్కవరీ+లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఫ్యామిలీతో కలిసి చూడటానికి ఇది పర్ఫెక్ట్ క్రిస్మస్ షో.

Ghost Adventures: House Calls – Season 2

Advertisement

క్రిస్మస్ ఈవ్ (24 డిసెంబర్)కి థ్రిల్ కావాలంటే ఇది బెస్ట్ సిరీస్. ఇందులో జాక్ బగాన్స్, అతని టీమ్ సాధారణ ఇళ్లలో దెయ్యాల భయంతో బాధపడుతున్న ఫ్యామిలీలకు సహాయం చేస్తారు. రియల్ హాంటెడ్ హోమ్స్‌లోకి వెళ్లి రికార్డింగ్స్ చేసి, అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఈవెంట్స్ ఇన్వెస్టిగేట్ చేస్తారు. దెయ్యాలతో ఎలా డీల్ చేయాలో అడ్వైస్ కూడా ఇస్తారు. ధైర్యం ఉంటేనే చూడండి ఈ సిరీస్ ను.

The Nature of Christmas

క్రిస్మస్ డే అంటే డిసెంబర్ 25 స్పెషల్ ‘ది నేచర్ ఆఫ్ క్రిస్మస్’. క్రిస్మస్‌తో ప్రకృతి ఎలా కనెక్ట్ అయిందో చూపించే అద్భుత డాక్యుమెంటరీ. బైబిల్ స్టోరీలోని గాడిద, సాంటా రైన్‌డియర్, క్రిస్మస్ ట్రీలు, చిన్న రాబిన్ పక్షి… ఇవన్నీ ఎలా లింక్ అయ్యాయో ఫన్నీగా, ఇంట్రెస్టింగ్‌గా చెప్తారు. ఇందులో మంచు కప్పిన అడవులు, అందమైన ల్యాండ్‌స్కేప్స్ చూస్తూ రిలాక్స్ అవ్వొచ్చు. ఈ డాక్యుమెంటరీని యానిమల్ ప్లానెట్‌లో ఫస్ట్, తర్వాత డిస్కవరీ ప్లస్ లో రిలీజ్ చేయనున్నారు.

Hustlers, Gamblers, Crooks – Season 2

Advertisement

క్రిస్మస్ తర్వాత డిసెంబర్ 26 ఎక్సైట్‌మెంట్ కొనసాగాలంటే ఇది షో. హాలీవుడ్ థ్రిల్లర్ స్టైల్‌లో రియల్ స్టోరీలు, హై రిస్క్‌లు, బిగ్ విన్స్, డ్రామాటిక్ ట్విస్టులు ఉంటాయి ఇందులో. హస్ట్లర్స్, గ్యాంబ్లర్స్, క్రూక్స్ లైఫ్‌ను వాళ్లే చెప్పే విధంగా ఉంటుంది. ఒకవేళ ఎప్పటిలా ఈసారి సినిమాలు కాకుండా, క్రిస్మస్ సందర్భంగా కొత్తగా ఏదైనా చూద్దాం అనుకుంటే ఈ షోలను డోంట్ మిస్.

Read Also : ఏడాది గడిచినా విడుదలకు నోచుకోని ఉపేంద్ర యాక్షన్ థ్రిల్లర్… చేతులెత్తేసిన మేకర్స్

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×