E-Paper
Advertisement

మాన్స్టర్ ను బోల్తా కొట్టించే కిలాడీ లేడీ… బొమ్మలా మారి మతిపోగోట్టే పని

మాన్స్టర్ ను బోల్తా కొట్టించే కిలాడీ లేడీ… బొమ్మలా మారి మతిపోగోట్టే పని
Advertisement

Action Adventure Thriller OTT : అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇక దానికి ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తోడైతే వచ్చే కిక్కు మామూలుగా ఉండదు. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోనూ ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా దొరుకుతుంటాయి. మీరు కూడా అలాంటి సినిమాలకు ఇష్టపడితే ఈ మూవీ ఖచ్చితంగా మీ కోసమే. మాన్స్టర్స్ ను వేటాడుతూ ఈ టీం చేసే యాక్షన్ స్టంట్స్, అబ్బురపరిచే యాక్షన్ సీన్స్ ను చూడాలంటే.. అంతకంటే ముందు ఆ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? సినిమా పేరేంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

రెండు ఓటీటీలలో అందుబాటులో

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు Chronicles of the Ghostly Tribe (2015). ఇదొక చైనీస్ యాక్షన్-అడ్వెంచర్ ఫాంటసీ థ్రిల్లర్. ‘ఘోస్ట్ బ్లోస్ అవుట్ ది లైట్’ అనే పాపులర్ నవల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో చైనాలోని పురాతన రహస్యాలు, వింత జీవుల గురించి చూడవచ్చు. ఈ సినిమా ఇప్పుడు Amazon Prime Videoలో అందుబాటులో ఉంది. అలాగే Apple TV లో కూడా ఈ మూవీని వీక్షించవచ్చు. ఈ సినిమాకు ‘లూ చువాన్’ దర్శకత్వం వహించగా, సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ (VFX), రాక్షస జీవుల డిజైన్ అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ముఖ్యంగా మంచు పర్వతాలలో జరిగే పోరాట దృశ్యాలు, పురాతన సమాధుల సెట్టింగ్‌ లు ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచంలో అడుగు పెట్టిన ఫీలింగ్ తెప్పించాయి. కేవలం దయ్యాల కథగా కాకుండా, సైన్స్ ఫిక్షన్ – పురాణ గాథల కలయికతో సాగే ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా మేకర్స్ దీన్ని తీర్చిదిద్దారు.

Advertisement

Also Read : మరో ప్రపంచానికి తీసుకెళ్లే ఫాంటసీ థ్రిల్లర్స్… ప్రతీ సినిమా ఒక అద్భుతమే

కథలోకి వెళ్తే…

1979లో ఈ మూవీ స్టోరీ షురూ అవుతుంది. మంగోలియా సరిహద్దులో ‘డెమోన్ పగోడా’ అనే వింతైన ప్రాంతం ఉంటుంది. అక్కడ కొన్ని భారీ జీవుల శిలాజాలు బయట పడడం ఆసక్తికరంగా మారుతుంది. చైనా ప్రభుత్వం ఈ రహస్యాన్ని ఛేదించడానికి హు బాయి (మార్క్ చావో) నేతృత్వంలో ఒక సైనిక బృందాన్ని ఏర్పాటు చేసి, పంపుతుంది. ఈ ప్రయాణంలో వారు ఊహించని విధంగా వింత రాక్షసులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే అతీంద్రియ శక్తుల దాడికి బలవుతారు.

Advertisement

ఈ ప్రమాదంలో హు బాయి తప్ప మిగిలిన వారంతా చనిపోతారు. అందరూ అదే నిజమని నమ్ముతారు. ఈ సంఘటన జరిగిన కొన్నేళ్ళ తర్వాత హు బాయి ఒక లైబ్రేరియన్‌ గా సెటిల్ అవుతాడు. కానీ గతంలో జరిగిన ఆ భయంకరమైన సంఘటనలు అతన్ని నిద్ర పోనివ్వవు. ఈ నేపథ్యంతోనే ఓరోజు అకస్మాత్తుగా చనిపోయిందనుకున్న తన ప్రియురాలు షిర్లీ యాంగ్ మళ్ళీ ప్రత్యక్షం అవుతుంది. కానీ ఆమె పూర్తిగా మారిపోతుంది. ఆమె దాచిపెడుతున్న ఆ రహస్యం ఏంటి ? ‘ఘోస్ట్లీ ట్రైబ్’ అనే పురాతన జాతికి, భూమి మీదకు రాబోతున్న ప్రమాదానికి లింకు ఏంటి ? అనే విషయాలను తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×