E-Paper
Advertisement

నీటి రాక్షసుడు సృష్టించే భీభత్సం… ఊరు ఊరంతా ఒక్కటై చేసే పనికి బుర్ర బద్దలు

నీటి రాక్షసుడు సృష్టించే భీభత్సం… ఊరు ఊరంతా ఒక్కటై చేసే పనికి బుర్ర బద్దలు
Advertisement

Fantasy action Movie on OTT : ఫాంటసీ సినిమాలు చూసేందుకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. వీటిలో కూడా రక రకాల కంటెంట్ తో అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా చైనాలో సూపర్ హిట్ కూడా అయింది. ఒక మాన్‌స్టర్ ను పట్టుకునే క్రమంలో ఇది జరుగుతుంది. ఒక ఊరి పక్కన ఉన్న నదిలో ఉన్న భయంకరమైన నీటి రాక్షసిని, దాన్ని ఎలాగైనా చంపాలని కంకణం కట్టుకున్న ఒక యువకుడికి మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా. ఇందులో భయపెట్టే హారర్ సీన్లు మాత్రమే కాకుండా, ఆ రాక్షసిని పట్టుకోవడానికి వేసే ప్లాన్లు, నీటి అడుగున జరిగే సాహసాలు చాలా ఉత్కంఠభరితంగా ఉంటాయి. ఒక చిన్న గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగుంటాయి. అందుకే వింత జంతువుల సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఇది మంచి టైమ్ పాస్ మూవీ. సుమారు 1 గంట 17 నిమిషాల నిడివి ఉన్న ఈ చైనీస్ సినిమా చూపు పక్కకు తిప్పుకోనివ్వదు కూడా.

ఎక్కడ చూడచ్చు అంటే 

2019లో వచ్చిన ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘వాటర్ మాన్స్టర్’ (Water Monster movie). ఇది చైనాకు చెందిన ఒక సూపర్ హిట్ ‘వెబ్ మూవీ’. సినిమా 2019 జూలై 12న చైనాలో విడుదలైంది. అయితే ఇది నేరుగా థియేటర్లలో కాకుండా, చైనాలోని ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ ఫామ్ అయిన Tencent Videoలో ‘వెబ్ మూవీ’గా విడుదలై మంచి ఆదరణ పొందింది. ఆ తర్వాతే ఇది ఇతర భాషల్లోకి డబ్ చేయబడింది. జియాంగ్ సోదరులు దర్శకత్వం వహించిన ఈ చిత్రం, తక్కువ బడ్జెట్‌తో నిర్మించినప్పటికీ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో ప్రధానంగా చైనీస్ జానపద కథల్లో వినిపించే ‘వాటర్ మంకీ’ (నీటి కోతి) అనే పురాణ జీవిని ఒక రాక్షసిగా చూపించారు. ఇందులో లియు లిన్‌చెంగ్, జు లీలన్ చక్కటి నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమా వ్యాపారపరంగా మంచి విజయం సాధించడమే కాకుండా, చైనీస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో భారీ వ్యూస్‌ని సొంతం చేసుకుంది. దీనికి వచ్చిన ఆదరణ చూసి, 2021లో ‘వాటర్ మాన్స్టర్ 2: బ్లాక్ వుడ్ ఫారెస్ట్’ పేరుతో దీనికి సీక్వెల్‌ను కూడా విడుదల చేశారు. తెలుగులో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్‌లో అందుబాటులో ఉండటంతో, ఇక్కడి యాక్షన్ హారర్ ప్రియులకు కూడా ఇది బాగా కనెక్ట్ అయింది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఒక పల్లెటూరి పక్కనే ఉన్న నదిలో ‘నీటి కోతి’ అనే ఒక భయంకరమైన రాక్షసి ఉంటుంది. పదేళ్ల క్రితం హీరో కళ్లముందే వాళ్ల నాన్నను ఆ రాక్షసి నీళ్లలోకి లాక్కెళ్లి చంపేస్తుంది. ఆ చేదు సంఘటన హీరో మనసులో బలంగా నాటుకుపోతుంది. పదేళ్ల వరకు ఊరి జనమంతా ఆ నది వైపు వెళ్లాలంటేనే వెన్నులో వణుకు పుట్టేలా భయపడుతుంటారు. చాలా కాలం తర్వాత ఆ రాక్షసి మళ్లీ బయటకు వచ్చి ఊరి మీద పడి మనుషుల్ని చంపడం మొదలుపెడుతుంది. ఊరి పెద్దలు, ప్రజలు అది దేవుడి శాపం అని భయపడి రకరకాల మూఢనమ్మకాలతో పూజలు చేస్తుంటారు. కానీ అప్పటికే పెద్దవాడైన హీరో, ఆ రాక్షసిని చంపడం ఒక్కటే దీనికి పరిష్కారం అని నమ్ముతాడు. తన తండ్రిని చంపిన ఆ క్రూర మృగాన్ని అంతం చేయాలని కంకణం కట్టుకుంటాడు. హీరో ఊరిలో ఉన్న యువకులను అందరినీ ఒక తాటిపైకి తెచ్చి ధైర్యం చెబుతాడు. అందరూ కలిసి నది దగ్గర వలలు, ఆయుధాలతో ఆ రాక్షసి కోసం వేచి చూస్తారు. ఆ నీటి రాక్షసికి, హీరో టీం మధ్య జరిగే పోరాటం చాలా ఉత్కంఠంగా ఉంటుంది. చివరికి హీరో ఆ రాక్షసిని హతమారుస్తాడా ? తన తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకుంటాడా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : కూతురి హత్యపై వ్యవస్థను ప్రశ్నించిన ఓ ఒంటరి తల్లి… ఐయండిబిలో 8.1రేటింగ్

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×