E-Paper
Advertisement

మరో ప్రపంచానికి తీసుకెళ్లే ఫాంటసీ థ్రిల్లర్స్… ప్రతీ సినిమా ఒక అద్భుతమే

మరో ప్రపంచానికి తీసుకెళ్లే ఫాంటసీ థ్రిల్లర్స్… ప్రతీ సినిమా ఒక అద్భుతమే
Advertisement

Fantasy Thriller OTT : చూస్తున్నంతసేపూ రియల్ వరల్డ్ నుంచి దూరంగా, రీల్ వరల్డ్ లోని అద్భుతమైన ప్రపంచంలో విహరించేలా చేసే సినిమాలే ఫాంటసీ థ్రిల్లర్లు. చిన్న పిల్లలనే కాదు పెద్దలను కూడా ఆకట్టుకోవడంలో సూపర్ సక్సెస్ అయిన ఈ జానర్లో వచ్చిన కొన్ని బెస్ట్ సినిమాలే ఈరోజు మన మూవీ సజెషన్. మనకు తెలిసిన చిన్నపిల్లల కథలనే పెద్దల కోసం తెరకెక్కిన సినిమాలు ఈ లిస్ట్ లో ఉన్నాయి. మరి ఆ మూవీస్ ఏంటి? ఏ ఓటీటీలో చూడొచ్చు ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

1. Snow White: A Tale Of Terror (1997)

‘స్నో వైట్’లో సిగౌర్నీ వీవర్ ను ఒక క్రూరమైన సవతి తల్లిగా చూడొచ్చు. ఇందులో మ్యాజిక్ కంటే డార్క్ సైకాలజీ ఎక్కువగా కనబడుతుంది. ఫైనల్ గా హ్యాపీ ఎండింగ్ తో మూవీకి శుభం కార్డు పడుతుంది.

2. Gretel & Hansel (2020)

Advertisement

‘గ్రెటెల్ & హాన్సెల్’లో ఆకలితో అడవిలోకి వెళ్ళిన అక్కాతమ్ముళ్లకు ఒక మంత్రగత్తె ఇల్లు కన్పిస్తుంది. ఆ మంత్రగత్తె నరమాంస భక్షకురాలు. ఆ ఇంట్లో ఆవిడ చేసే వికృత పూజలు ఈ సినిమాను ఒక ఆర్ట్-హారర్ మాస్టర్‌ పీస్‌ గా మార్చాయి.

3. Dragonslayer (1981)

రాక్షసుల వేట నేపథ్యంలో సాగే సినిమా ‘డ్రాగన్‌స్లేయర్’. ఇందులో ఒక వృద్ధ మాంత్రికుడి శిష్యుడు భయంకరమైన డ్రాగన్‌ ను చంపడానికి చేసే సాహసం ఐ ఫీస్ట్ అడ్వెంచర్ లా ఉంటుంది. 80ల కాలంలోనే వచ్చినా దీని విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతం.

4. The Head Hunter (2018)

Advertisement

లో-బడ్జెట్ అద్భుతం ‘ద హెడ్ హంటర్’. తన కూతురిని చంపిన రాక్షసుడిని చంపడానికి ఒక యోధుడు చేసే ప్రయత్నమే ఈ మూవీ కథ. ఆ రాక్షసుడి కోసం అడవిలో వేచి చూస్తూనే, కన్పించిన రాక్షసుల తలలను నరికి వేలాడదీస్తూ ఉంటాడు. చివరికి ఆ రాక్షసుడితో జరిగే పోరాటం హైలెట్ గా ఉంటుంది.

Also Read : చిన్న పిల్లలను దారుణంగా చంపే సీరియల్ కిల్లర్… అడుగడుగునా సస్పెన్స్ తో కట్టిపడేస్తున్న స్టోరీ

5. The NeverEnding Story (1984)

మరో అద్భుతమైన ఫాంటసీ ప్రపంచం ‘ద నెవర్ ఎండింగ్ స్టోరీ’. ఒక చిన్న పిల్లాడు ఒక పాత పుస్తకాన్ని చదువుతాడు. అయితే అందులోని ‘ఫాంటాసియా’ అనే లోకం నాశనం కాకుండా కాపాడటానికి ఆ పిల్లాడే హీరోగా మారాల్సి రావడంతో కథలో ఊహించని టర్న్ ఉంటుంది.

6. Highlander (1986)

‘హైలాండర్’ మూవీలో అమరత్వం పొందిన యోధులు ఉంటాడు. వీళ్లంతా శతాబ్దాలుగా ఒకరినొకరు చంపుకునే పనిలోనే ఉంటారు. “చివరికి ఒక్కడు మాత్రమే మిగలాలి” అనే కాన్సెప్ట్‌తో సాగే ఈ యాక్షన్ డ్రామా అప్పట్లో బిగ్గెస్ట్ సెన్సేషన్ గా మారింది. ఈ లిస్ట్ లో ఉన్న సినిమాలన్నీ Amazon Prime Videoలో అందుబాటులో ఉన్నాయి.

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×