E-Paper
Advertisement

OTT Movie: మనుషుల్ని చంపి కూర వండుకునే ఫ్యామిలీ… చాలా దేశాల్లో బ్యాన్ అయిన మూవీ

OTT Movie: మనుషుల్ని చంపి కూర వండుకునే ఫ్యామిలీ… చాలా దేశాల్లో బ్యాన్ అయిన మూవీ
Advertisement

OTT Movie : కొన్ని సినిమాలు కంటెంట్ పరంగా చాలా వివాదాలు మూటగట్టుకుంటాయి. ఎంతలా అంటే ఇక ఆ కంటెంట్ సినిమాని బ్యాన్ చేసేలా ఉంటుంది. ఇలా ఎన్నో సినిమాలు వివాదాలతో బ్యాన్ అవుతుంటాయి. అయితే మళ్ళీ వాటిని సెన్సార్ కట్ చేసి రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలేషియన్ మూవీని ప్రపంచవ్యాప్తంగా బ్యాన్ చేశారు. ఇది ఆన్ లైన్ లో దొరకడం కూడా కష్టమే. ఇంతకీ కంటెంట్ ఏమిటంటారా ? అదేనండీ బాబు మనిషి మాంసాన్ని వండి వడ్డించడం. చాలా ఘోరంగా ఈ స్టోరీ ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2011లో వచ్చిన ఈ మలేషియన్ హారర్ మూవీ పేరు ‘క్లేపాట్ కర్రీ కిల్లర్స్’ (Claypot Curry Killers). డైరెక్టర్ జేమ్స్ లీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో డెబ్బీ గోహ్ (చూ), మాండీ చెన్ (చూ డాటర్ 1), ఓలివియా కాంగ్ (డాటర్ 2), పెర్లీ చౌ (డాటర్ 3) లీడ్ రోల్స్ లో నటించారు. 93 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 5.7/10 రేటింగ్ పొందింది. మలేషియాలో టాప్ ఇండిపెండెంట్ హారర్‌గా ఫేమస్ అయింది. ఇప్పుడు Filmdoo వెబ్ సైట్ లో మాత్రమే అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మిసెస్ చూ అనే మహిళ, తన ముగ్గురు కూతుర్లతో కలిసి మలేషియాలో ఒక చిన్న రెస్టారెంట్ నడుపుతుంటుంది. వాళ్ల స్పెషల్ ఐటెమ్ “క్లేపాట్ కర్రీ”. అంటే మట్టి పాత్రలో ఆవిరి పుట్టించి చేసే హోమ్‌మేడ్ కర్రీ అన్న మాట. హోటల్ మామూలుగానే నడుస్తుంది. అయితే ఒకరోజు చూ భర్త పిల్లల మీద అసభ్యంగా ప్రవర్తించడంతో తల్లీకూతుర్లు అతన్ని చంపేస్తారు. అతని మాంసాన్ని కూర వండి కస్టమర్లకు పెడతారు. ఆ కర్రీ టేస్ట్ కూడా గొప్పగా ఉండటంతో రెస్టారెంట్ ఫుల్ రద్దీగా మారుతుంది. దీంతో వీళ్ళు రోజు రాత్రిపూట మనుషులను ట్రాప్ చేసి చంపి కూర వండటం మొదలు పెడతారు.

Read Also : కేసులు లేని డిటెక్టివ్… కుక్క కేసుతో యాక్షన్ షురూ … ఓటీటీలోకి మలయాళ హిట్ మూవీ

Advertisement

మిసెస్ చూ కూతుర్లు రాత్రి నైట్ క్లబ్‌లకు వెళ్లి మగవాళ్లను సెడ్యూస్ చేసి, ఇంటికి తెచ్చి డ్రగ్స్ ఇచ్చి, చంపేసి మాంసం కట్ చేసి కర్రీలో కలిపేస్తుంటారు. ఈ కర్రీ యమ టేస్ట్ ఉందంటూ తింటుంటారు. మిసెస్ చూ రెస్టారెంట్ పాపులర్ అవుతుండగానే పక్క రెస్టారెంట్ ఓనర్స్ జెలసీతో రివెంజ్ ప్లాన్ వేస్తాడు. ఫేమస్ మాస్టర్ చెఫ్ పంపి, చూ రెసిపీ చేయాలని ఆర్డర్ ఇస్తాడు. అతను రెస్టారెంట్‌కి రావడంతో మిసెస్ చూ కూతుర్లు మాత్రం ఏమీ మాట్లాడకుండా, వాళ్లని కూడా కర్రీలో వండేస్తారు. చివరికి వీళ్ళ సీక్రెట్ బయట ప్రపంచానికి తెలుస్తుందా ?కర్రీ కోసం మిగతా వాళ్ళు బలవుతుంటారా ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

 

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×