E-Paper
Advertisement

Actress Aishwarya Varma: పేరెంట్స్ కు ఇష్టం లేదు..ఎన్నో కష్టాలు పడ్డాను.. ఆ కోరిక తీరలేదు..

Actress Aishwarya Varma: పేరెంట్స్ కు ఇష్టం లేదు..ఎన్నో కష్టాలు పడ్డాను.. ఆ కోరిక తీరలేదు..
Advertisement

Actress Aishwarya Varma: తెలుగు టీవీ సీరియల్స్ ద్వారా ఎంతోమంది కన్నడ ముద్దుగుమ్మలు పరిచయమవుతున్నారు. ప్రస్తుతం సీరియల్స్ లో తెలుగు వాళ్ళ కన్నా కన్నడ వాళ్లే ఎక్కువగా ఉన్నారో అని చెప్పడంలో సందేహం లేదు. ప్రతి సీరియల్ లో ఎవరో ఒకరు కన్నడ యాక్టర్ ఉండనే ఉంటున్నారు. అక్కడ సీరియల్స్ సినిమాలలో నటించి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చురగొంటున్నారు. అలాంటి వారిలో బుల్లితెర విలన్ ఐశ్వర్య వర్మ ఒకరు. నటనపై తనకున్న ఆసక్తితో తల్లిదండ్రులను ఎదిరించి మరీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ అమ్మడు ఆ తర్వాత వరుసగా సీరియల్స్ చేసే అవకాశాన్ని అందుకుంది. ఈమె ఇప్పటివరకు చేసిన సీరియల్స్, రెమ్యూనరేషన్ గురించి ఒకసారి తెలుసుకుందాం..

భర్త సపోర్ట్ తోనే ఆపని చేశాను..

అమ్మానాన్న ఒప్పుకోక పోయినా నటనపై ఉన్న అభిమానంతో బుల్లితెరకు పరిచయమైన నటి ఐశ్వర్య వర్మ. కన్నడ, తెలుగు సీరియల్స్‌లో సపోర్టింగ్‌ రోల్స్‌తో అలరిస్తుంది. అంతేకాదు సినిమాలు కూడా చేసింది.. అప్పటిలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. చివరికి నటిగా గుర్తింపు తెచ్చుకున్నాను. భర్త ప్రోత్సాహంతో పెళ్లి తర్వాత కూడా నటిగా కొనసాగుతున్నానని చెప్పుకొచ్చింది ఈ కన్నడ బ్యూటీ.. పెళ్లికి ముందు సీరియల్స్ చేశాను. పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసాను. ఐటీ కంపెనీలో పని నాకు నచ్చలేదు. దాంతో నేను మళ్లీ సీరియల్స్ లోకి అడుగుపెట్టాను అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య అన్నారు.

తెలుగు సీరియల్స్..

Advertisement

బెంగుళూరు బ్యూటీ అనుకోకుండా నటన పై ఇంట్రెస్ట్ తోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మా ఫ్యామిలీలో, బంధువుల్లో ఎవరూ టీవీ, సినిమా ఇండస్ట్రీకి చెందినవారు లేరు. ఎప్పుడైనా ఫేస్‌బుక్‌లో నా ఫొటోలు పోస్టు చేసేదాన్ని. వాటిని చూసి డైరెక్టర్లు తమ సీరియల్‌లో నటించమని చాలా ఆఫర్లే వచ్చాయి. యాక్టింగ్‌ అంటే మా పేరెంట్స్‌ అస్సలు ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఓకే చెప్పడంతో సినిమాలు సీరియల్స్ చేశాను. సినిమాలు కంఫర్ట్ గా లేవు అందుకే వదిలేసాను. ఇప్పుడు కేవలం సీరియల్స్ చేస్తున్నాను అని ఆమె అన్నారు..

Also Read : బుధవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మిస్ అవ్వకుండా చూడాల్సినవి ఇవే..

ఒక్కో సీరియల్ రెమ్యూనరేషన్ ఎంత..? 

Advertisement

ఐశ్వర్య వర్మ తెలుగులో మొదటగా నటించిన సీరియల్ ‘అత్తారింటికి దారేది’. అందులో నా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ‘మల్లీశ్వరి’, ‘అక్కమొగుడు’ సీరియల్స్‌లో కూడా నటించింది. ప్రస్తుతం జీ తెలుగులో చామంతి సీరియల్ లో నెగిటివ్ రోల్స్ లో నటిస్తుంది. ఇకపోతే చామంతితో పాటు కన్నడలోనూ ఒక సీరియల్‌ చేస్తున్నా. సినిమాల్లోనూ మంచి పాత్రల్లో అవకాశం వస్తే నటించాలని ఉందని ఆమె మనసులోని మాటను బయటపెట్టింది. ఇక అనుష్క చేసిన అరుంధతి లాంటి సినిమాలో నటించాలనే కోరిక తీరలేదని అంటుంది.. ప్రస్తుతం ఒక్కో సీరియల్ కు 35 వేలు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది. వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది.

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×