E-Paper
Advertisement

Comedy Drama OTT : ఇంటి కోసం మామా కోడళ్ళ జగడం… ఎలెక్షన్లతో అలుపెరుగని రణరంగం.. ఓటీటీలోకి వచ్చేసిన బెంగాలీ మూవీ

Comedy Drama OTT : ఇంటి కోసం మామా కోడళ్ళ జగడం… ఎలెక్షన్లతో అలుపెరుగని రణరంగం.. ఓటీటీలోకి వచ్చేసిన బెంగాలీ మూవీ
Advertisement

Comedy Drama OTT : బెంగాలీ ఇండస్ట్రీ నుంచి ఓ కొత్త కామెడీ మూవీ వచ్చేసింది. ఈ సినిమాకు థియేటర్లలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ని తెగనవ్విస్తోంది కూడా. ఈ సినిమా కథ మామగారు, కోడలు మధ్య జరిగే తగాదాల చుట్టూ తిరుగుతుంది. ఈ వీకెండ్ ఫ్యామిలీ తో చూడాల్సిన సినిమా ఇది. టెన్షన్ రిలీఫ్ కోసం ఈ సినిమా ఓ టానిక్ లా పనిచేస్తుంది. మరి ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

జియో హాట్‌స్టార్‌ (Jio Hotstar) లో

ఈ బెంగాలీ ఫ్యామిలీ కామెడీ సినిమా పేరు ‘కీర్తన్ పోర్ కీర్తన్’ (Kirtaner Por Kirtan). ఇది 2023లో వచ్చిన హిట్ సినిమా ‘కీర్తన్’కు సీక్వెల్. అభిమన్యు ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 2026 జనవరి 9న థియేటర్లలో రిలీజ్ అయిన ఏ సినిమా ఇప్పుడు జియో హాట్‌స్టార్‌ (Jio Hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం 2 గంటల 11 నిమిషాల నిడివితో నవ్వులు పూయిస్తుంది. ఇందులో అబినాష్ (మామగారు) పాత్రలో పరణ్ బందోపాధ్యాయ, మణిమాల (కోడలు) పాత్రలో అరుణిమ ఘోష్, అరూప్ (కొడుకు) పాత్రలో గౌరవ్ ఛటర్జీ నటించారు.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

మొదటి భాగంలో పాత ఇంటి గొడవలతో చచ్చీచెడి కొత్త ఫ్లాట్‌లోకి మారిన మామగారు (అబినాష్), కోడలు (మణిమాల) బుద్ధి మార్చుకోరు. కొత్త అపార్ట్‌మెంట్‌లోకి వెళ్ళినా సరే, వీళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే రచ్చ రచ్చ చేసుకుంటూ, ఆఖరికి అపార్ట్‌మెంట్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఒకరి మీద ఒకరు కత్తులు కూడా దూసుకుంటారు. మధ్యలో పాపం ఆ కొడుకు అటు తండ్రిని అనలేక, ఇటు పెళ్లానికి ఏమీ చెప్పలేక నలిగిపోతుంటాడు.

కథలో అసలు ట్విస్ట్ ఎప్పుడు వస్తుందంటే.. వీళ్లకు ఎంతో ఇష్టమైన పాత ఇంటిని ఎవడో మోసగాడు కబ్జా చేశాడని తెలుస్తుంది. అప్పటిదాకా కీచులాడుకున్న మామ కోడలు, ఒక్కసారిగా తమ పాత ఇంటి మీద మమకారంతో ఏకమవుతారు. మన ఇంటి జోలికి వస్తే ఎవడైనా సరే తాట తీస్తాం అన్నట్టుగా ఇద్దరూ కలిసి ప్లాన్ వేసి, ఆ కొత్త విలన్‌ను ఎదిరించడానికి రెడీ అవుతారు. ఆ తర్వాత జరిగేదంతా ఫుల్ కామెడీతో ఉంటుంది. ఒక పక్క గొడవలు పడుతూనే, మరోపక్క ఆ విలన్‌కు చుక్కలు చూపించే సీన్స్, అపార్ట్‌మెంట్‌లో జరిగే పాలిటిక్స్, మామ-కోడళ్ల మధ్య జరిగే పోట్లాటలు చూస్తుంటే, ఎవ్వరికైనా కడుపుబ్బ నవ్వు రావడం ఖాయం.

Advertisement

Read Also : కళ్ళల్లో కనిపించే కసి… టిప్పర్ లారీతో గుద్ది గుద్ది రివేంజ్… భయపెట్టిసున్న సినిమా

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×