E-Paper
Advertisement

Revenge Thriller OTT: కళ్ళల్లో కనిపించే కసి… టిప్పర్ లారీతో గుద్ది గుద్ది రివేంజ్… భయపెట్టిసున్న సినిమా

Revenge Thriller OTT: కళ్ళల్లో కనిపించే కసి… టిప్పర్ లారీతో గుద్ది గుద్ది రివేంజ్… భయపెట్టిసున్న సినిమా
Advertisement

Revenge Thriller OTT : రివేంజ్ సినిమాలు చాలా క్రేజీగా ఉంటాయి చూడటానికి. ఎత్తుకు పైఎత్తులు, ప్రతీకారం తీర్చుకునే సీన్స్ చూపు తిప్పుకోకుండా చేస్తుంటాయి. మరి కొన్ని సినిమాలు అయితే రక్తపాతం మరింత బీభత్సంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక రివెంజ్ థ్రిల్లర్ ఒంట్లో వణుకు పుట్టిస్తోంది. ఇందులొ ఫ్యామిలీ చావుకు కారణమైన కొంతమందిపై, ఒక ట్రక్ డ్రైవర్ కసిగా రివేంజ్ తీర్చుకునే సీన్స్ చాలా ఘోరంగా ఉంటాయి. రీసెంట్ గానే ఇది ఓటీటీలోకి వచ్చింది. మరి ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉందో చూసేద్దాం పదండి.

ఏ ఓటీటీలో ఉందంటే

ఈ రివెంజ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘Trucker’. ఎరోల్ సాక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో డ్వేన్ హిల్టన్ జూనియర్, నికోల్ మాటాక్స్, డేర్ టేలర్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా 2026 మార్చి 10నుంచి Amazon Prime Video, Apple TV, ప్లాట్‌ ఫామ్‌లలో నేరుగా రిలీజ్ అయింది. అయితే ఇది ఇప్పుడు రెంటల్ పద్ధతిలో మాత్రమే అందుబాటులో ఉంది. 1 గంట 25 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాను చూడాలంటే గుండె గట్టిగా ఉన్న వాళ్ళే ధైర్యం చేయండి .

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక మామూలు లారీ డ్రైవర్ తన భార్యాపిల్లలతో సంతోషంగా బతుకుతుంటాడు. కానీ ఒకరోజు కొందరు కుర్రాళ్లు తాగిన మత్తులో కారును విచ్చలవిడి వేగంతో నడిపిస్తుంటారు. అదే సమయంలో ఈ డ్రైవర్ ఫ్యామిలీ మొత్తం లారీలో వెళ్తుంటుంది. ఇక వాళ్ళు అతివేగంగా వస్తుండటంతో తప్పించబోయి లారీ బోల్తా పడుతుంది. అక్కడ మంటలు కూడా అంటుకుంటాయి. కానీ ఆ కుర్రాళ్ళు కనీసం హెల్ప్ కూడా చేయకుండా వెళ్లిపోతారు. ఇక ఆ యాక్సిడెంట్లో ఆ లారీ డ్రైవర్ కళ్ల ముందే తన పెళ్ళాం, పిల్లలు తగలబడిపోయి చనిపోతారు. తన లోకమంతా నాశనమైపోవడంతో ఆ తండ్రి గుండె పగిలిపోతుంది.

పోలీసులు, చట్టం ఆ డబ్బున్న కుర్రాళ్లకు ఏమీ చేయలేవని అర్థం చేసుకున్న ఆ డ్రైవర్, ఇక తానే రంగంలోకి దిగాలని డిసైడ్ అవుతాడు. తన పాత లారీని రిపేర్ చేసుకుని, తన ఫ్యామిలీ చావుకు కారణమైన ఆ పోకిరీ బ్యాచ్ కోసం వేట మొదలుపెడతాడు. వాడు రోడ్డు మీద లారీ ఎక్కించాడంటే మృత్యువు ఎదురుగా వస్తున్నట్లే ఉంటుంది ఇప్పుడు. ఒక్కొక్కడిని ఏరికోరి పట్టుకుని, నడిరోడ్డు మీద చుక్కలు చూపిస్తాడు. ఇక క్లైమాక్స్ లో ఆ డ్రైవర్ పగ మామూలుగా ఉండదు. తన కుటుంబాన్ని ఎలాగైతే నిప్పుల్లో కాల్చారో, అదే రేంజ్ లో ఆ కుర్రాళ్లకు నరకం చూపిస్తాడు ఈ లారీ డ్రైవర్.

Advertisement

Read Also : నిత్య పెళ్ళికూతురు నిఖిలా విమల్ మలయాళ మూవీ ఓటీటీలోకి… ఎక్కడ చూడచ్చో తెలుసా ?

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×