E-Paper
Advertisement

దొంగా పోలీస్ ఒక్కటైతే… ప్రతి నిమిషం నవ్వులు పూయించే కామెడీ మూవీ

దొంగా పోలీస్ ఒక్కటైతే… ప్రతి నిమిషం నవ్వులు పూయించే కామెడీ మూవీ
Advertisement

Comedy Drama OTT : ఓటీటీలో ఒక కొరియన్ సినిమా ప్రేక్షకులను తెగ ఎంటర్టైన్ చేస్తోంది. ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి కూడా. ఈ సినిమాను కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా కామెడీని కూడా దట్టించి తీశారు. ఒక డిటెక్టివ్, ఒక దొంగ, ఒక గ్యాంగ్స్టర్ మధ్య జరిగే సన్నివేశాలు భలే నవ్వు తెప్పిస్తాయి. ఈ సినిమా షూటింగ్ అంతా సౌత్ కొరియాలోని అందమైన జేజు ఐలాండ్‌లో జరిగింది. అక్కడ ఉండే అందమైన లొకేషన్లు, సముద్ర తీరాలు ఈ సినిమాకు మంచి లుక్ ఇచ్చాయి. యాక్షన్ కామెడీ సినిమాలను ఇష్టపడే వారికి ఇది ఒక మంచి ఆప్షన్.

నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్

ఈ కొరియన్ యాక్షన్ కామెడీ సినిమా పేరు (The Desperate Chase). కిమ్ జే-హూన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2024 ఆగస్టు 21న థియేటర్లలో విడుదలై మంచి విజయం కూడా అందుకుంది. ఇందులో పార్క్ సుంగ్-వూంగ్, క్వాక్ సి-యాంగ్, యూన్ క్యుంగ్-హో లీడ్ రోల్స్ లో నటించారు. సుమారు 110 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం, ప్రేక్షకులను అస్సలు బోర్ కొట్టించకుండా వేగంగా సాగిపోతుంది. ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే, 2024 ఆగస్టులో విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లనే సాధించింది. ఇందులో నటించిన పార్క్ సుంగ్-వూంగ్ అనే నటుడు రకరకాల గెటప్పుల్లో కనిపించి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఇందులో హీరో కిమ్ మామూలోడు కాదు, అచ్చం ఊసరవెల్లిలా రంగులు మార్చేసే రకం. రకరకాల గెటప్పులు వేసి జనాల్ని బురిడీ కొట్టించడంలో తోపు. వీడి తెలివితేటలతో ఎవరినైనా ఇట్టే బుట్టలో వేసేస్తాడు. ఇతనిపేరు చెబితేనే జేజు ఐలాండ్‌లో దొంగలందరికీ వణుకు. వీడు చేసే స్కామ్‌లు, వీడు వేసే ప్లాన్లు అసలు ఎవరికీ ఊహకు కూడా అందవు. ఇక ఇందులో రెండోవాడు డిటెక్టివ్ జో సూ-క్వాంగ్. ఇతనికి కోపం వస్తే ఆపడం ఎవరితరం కాదు. బీపీ వస్తే చాలు, ఎదుటివాడు ఎవడైనా సరే చితక్కొట్టేస్తాడు. ఆ కోపం వల్లే ట్రాన్స్‌ఫర్ అయ్యి ఈ ద్వీపానికి వస్తాడు. ఇక మూడోవాడు అసలైన విలన్ జూ రిన్-పాంగ్. వీడు పెద్ద డాన్, అక్కడ ఉన్న మెడికల్ సెంటర్ ప్రాజెక్టును ఎలాగైనా కొట్టేయాలని చూస్తుంటాడు. వీడు ఎంత క్రూరుడంటే, అడ్డొచ్చిన వాడ్ని లేపేయడానికి అస్సలు వెనకాడడు. ఇక అసలు రచ్చ ఎక్కడ మొదలవుతుందంటే.. ఆ మొండి డిటెక్టివ్, ఈ తెలివైన మోసగాన్ని పట్టుకోవాలని చూస్తుంటాడు. కానీ విధి ఆడిన వింత నాటకంలో, ఇద్దరూ కలిసి ఆ రౌడీ విలన్‌ను కొట్టాల్సి వస్తుంది. ఆ జేజు ఐలాండ్‌లో అసలు ఏం జరుగుతోంది? వీళ్ళిద్దరూ ఆ డాన్‌ను ఎలా ఆడుకున్నారు? అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Read Also : వెన్నులో వణుకు పుట్టించే జాంబీల దండయాత్ర… కలలోను వెంటాడే హారర్ సీన్లు

Tags

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×