E-Paper
Advertisement

వెన్నులో వణుకు పుట్టించే జాంబీల దండయాత్ర… కలలోను వెంటాడే హారర్ సీన్లు

వెన్నులో వణుకు పుట్టించే జాంబీల దండయాత్ర… కలలోను వెంటాడే హారర్ సీన్లు
Advertisement

Horror Movie OTT : జాంబీ సినిమాలు చాలా క్రేజీగా ఉంటాయి. ఇవి భయంకరమైన విజువల్స్ టు ప్రేక్షకులను ఎంతగానో భయపెడుతుంటాయి కూడా. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, అనేక జాంబీ సినిమాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఐయండిబిలో దీనికి 7.2 రేటింగ్ కూడా ఉంది. ఒక్క సారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూస్తారు ఈ సినిమాని. భయపెడుతూనే కావాల్సినంత థ్రిల్ ను ఇస్తుంది ఈ సినిమా. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ జాంబి హర్రర్ ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది. టైమ్ దొరికినప్పుడు ఓ లుక్ వేయండి, మస్త్ మజా ఇస్తుంది ఈ జాంబి సినిమా.

ఎక్కడ చూడచ్చు అంటే 

ఈ జాంబి హర్రర్ సినిమా పేరు ‘డాన్ ఆఫ్ ది డెడ్’ (Dawn of the Dead). 2004లో జాక్ స్నైడర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హర్రర్ చరిత్రలో ఒక మైలురాయి వంటిది. ఇది 1978లో జార్జ్ ఎ. రోమెరో దర్శకత్వంలో వచ్చిన సినిమాకు రీమేక్. అప్పట్లోనే ఇది ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించి, హర్రర్ సినిమాలకు ఒక కొత్త దిశను చూపింది. అయితే పాత సినిమాల్లో జాంబీస్ నెమ్మదిగా నడిచేవాళ్ళు, కానీ ఈ సినిమాలో ఇవి చాలా వేగంగా పరిగెత్తుతూ ప్రేక్షకుల్లో టెన్షన్‌ను మరింత పెంచుతాయి. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, ZEE5 ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో రెంట్‌కు అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఒక వింత వైరస్ సోకి, మనుషులు జాంబీస్‌ గా మారిపోతుంటారు. ఈ జాంబీస్‌ బతికున్న మనుషులపై పడి పీక్కుతినడం మొదలుపెడతారు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకోవడానికి నలుగురు వ్యక్తులు ఒక హెలికాప్టర్ ద్వారా నగరం నుండి తప్పించుకుంటారు. వాళ్ళు సురక్షితమైన ప్లేస్ కోసం వెతుకుతూ, చివరకు ఊరి చివర ఉన్న భారీ షాపింగ్ మాల్‌లోకి చేరుకుంటారు. ఆ మాల్ లోపల కూడా కొన్ని జాంబీస్ తిరుగుతుండటంతో, మనోళ్ళు ధైర్యం చేసి వాటన్నింటినీ బయటకు పంపించేసి, గేట్లన్నీ భద్రంగా మూసివేస్తారు. ఆ మాల్‌లోని తిండి, బట్టలు ఇతర వస్తువులతో వాళ్ళు కొన్ని రోజుల పాటు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా గడుపుతారు. కానీ బయట వేల సంఖ్యలో ఉన్న జాంబీస్ మాత్రం లోపలికి రావడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. అయితే ఒక సారి పొరపాటున ఆ గేట్లు తెరుచుకుంటాయి. దాంతో బయట ఉన్న వేలాది జాంబీస్ ఒక్కసారిగా లోపలికి చొచ్చుకువస్తాయి. ఇక్కడ స్టోరీ పీక్స్ లో ఉంటుంది. చివరికి వాళ్ళు అక్కడి నుంచి ప్రాణాలతో బయట పడ్డారా ? వాళ్ళు కూడా జాంబీస్‌ గా మారిపోతారా ? అనేది ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : కారు డిక్కీలో చిక్కుకున్న మెడికల్ స్టూడెంట్… క్షణ క్షణం ఉత్కంఠ మలుపులు

Related News

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

Big Stories

Advertisement
×