E-Paper
Advertisement

Comedy movie OTT: ఎమ్మెల్యే తోటలో పనస పండ్లు మిస్సింగ్… ఓటీటీలో పొట్ట చెక్కలయ్యే కామెడీ

Comedy movie OTT: ఎమ్మెల్యే తోటలో పనస పండ్లు మిస్సింగ్… ఓటీటీలో పొట్ట చెక్కలయ్యే కామెడీ
Advertisement

Comedy movie OTT : కామెడీ సినిమాలు చాలా వరకు మనసును తేలిక చేస్తాయి. ఆ పవర్ ఒక్క కామెడీ జానర్ కే ఉంది. ఓటీటీలో ఈ జానర్ సినిమాలకి కొదవ లేదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హిందీ సినిమాలో కామెడీ చాలా బాగుంటుంది. ఒక ఎమ్మెల్యే ఇంటి తోట నుండి రెండు పనస పండ్లు దొంగతనానికి గురవుతాయి. ఈ కేసును ఒక మహిళా పోలీస్ ఆఫీసర్ డీల్ చేస్తుంది. ఈ క్రమంలో స్టోరీ ఆసక్తికరంగా, కడుపుబ్బా నవ్వించే విధంగా సాగుతుంది. జాతీయ అవార్డును కూడా ఈ సినిమా గెలుచుకుంది. మరి ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

2023లో విడుదలైన హిందీ కామెడీ సినిమా పేరు ‘కథల్: ఏ జాక్‌ఫ్రూట్ మిస్టరీ’ (Kathal: A Jackfruit Mystery). బాలాజీ మోషన్ పిక్చర్స్, శిఖ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై శోభా కపూర్, ఏక్తా కపూర్, గుణీత్ మోంగా, అచిన్ జైన్ నిర్మించిన ఈ సినిమాకు యశోవర్ధన్‌ మిశ్రా దర్శకత్వం వహించారు. ఇందులో సానియా మల్హోత్రా, అనంత్‌ జోషి, విజయ్‌రాజ్‌, రాజ్‌పాల్ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో హిందీతో పాటు తెలుగు, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక 2025లో ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ హిందీ ఫీచర్ ఫిల్మ్‌గా అవార్డును కూడా గెలుచుకుంది ఈ సినిమా .

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ ఒక వింతైన కేసుతో మొదలవుతుంది. ఒక చిన్న ఊరిలో ఉండే లోకల్ ఎమ్మెల్యే ఇంటి తోటలో రెండు ఖరీదైన పనస పండ్లు దొంగతనానికి గురవుతాయి. ఆ ఎమ్మెల్యేకి ఆ పండ్లు అంటే చాలా ఇష్టం. అంతేకాదు దాంతో చేసిన వంటకాలు సిఎం కి పంపాల్సి ఉంటుంది. అందుకే వాటిని వెతకడానికి పోలీసులపై విపరీతమైన ఒత్తిడి తెస్తాడు. దీంతో పోలీస్ ఆఫీసర్ మహిమా బాసోర్ (సన్యా మల్హోత్రా) ఆ పనస పండ్ల కోసం గాలింపు మొదలుపెడుతుంది. కేవలం రెండు పండ్ల కోసం పోలీసులు పడుతున్న పాట్లు, ఆ క్రమంలో జరిగే కామెడీ సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి.

అయితే ఈ పనస పండ్ల వేటలో మహిమకు ఒక సీరియస్ విషయం తెలుస్తుంది. అదే గ్రామంలో ఒక పేద తోటమాలి కూతురు తప్పిపోయిందని, కానీ ఆమె కోసం పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదని ఆమె గమనిస్తుంది. ఆ అమ్మాయిని వెతకడానికి ఈ పనస పండ్ల కేసును ఒక సాకుగా వాడుకుంటూ మహిమ తన తెలివితేటలతో దర్యాప్తును ముందుకు తీసుకెళ్తుంది. చివరికి ఆ పనస పండ్లు ఏమయ్యాయి? తప్పిపోయిన అమ్మాయిని మహిమ ఎలా కాపాడింది? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : తండ్రీకొడుకుల ఎడబాటు… విధి ఆడే వింత నాటకం… మనసును హత్తుకునే ఫ్యామిలీ డ్రామా

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×