E-Paper
Advertisement

Family Drama OTT: తండ్రీకొడుకుల ఎడబాటు… విధి ఆడే వింత నాటకం… మనసును హత్తుకునే ఫ్యామిలీ డ్రామా

Family Drama OTT: తండ్రీకొడుకుల ఎడబాటు… విధి ఆడే వింత నాటకం… మనసును హత్తుకునే ఫ్యామిలీ డ్రామా
Advertisement

Family Drama OTT : ఒక చూడచక్కని ఫ్యామిలీ డ్రామాని చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే హిందీ సినిమాను చూసేయండి. ఇది ఒక తండ్రి కొడుకుల మధ్య జరిగే ఎమోషనల్ డ్రామా. ఇది విడుదలకు ముందే చికాగో సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. ఐయండిబిలో దీనకి ఏడుకు పైగా రేటింగ్ కూడా ఉంది. ఈ సినిమా పేరు ఏంటి ? ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే …

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్

ఈ హిందీ డ్రామా సినిమా పేరు ‘ది మెహతా బాయ్స్’ (The Mehta Boys). ప్రముఖ నటుడు బోమన్ ఇరానీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇది 2025 ఫిబ్రవరి7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో బోమన్ ఇరానీ, అవినాష్ తివారీ, శ్రేయా చౌదరి, పూజా సరూప్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా స్క్రిప్ట్‌ను బోమన్ ఇరానీ, ఆస్కార్ విజేత అలెగ్జాండర్ దినెలారిస్ కలిసి రాశారు.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ముంబైలో ఉండే అమయ్ మెహతా (అవినాష్ తివారీ) ఒక ఆర్కిటెక్ట్. తన తల్లి అకస్మాత్తుగా చనిపోవడంతో, అమెరికాలో ఉంటున్న తన తండ్రి శివ్ మెహతా (బోమన్ ఇరానీ) ఇండియాకు వస్తాడు. వీరిద్దరి మధ్య గత కొన్ని ఏళ్లుగా అస్సలు మాటల్లేవు, ఒకరంటే ఒకరికి పడదు. అమయ్‌ని ఎక్కువగా భయపెట్టే విషయం, చనిపోయిన తన తల్లిని చూడటం కాదు, తను భరించలేని ఏకైక వ్యక్తిని ఎదుర్కోవాలనే ఆలోచన, అతను ఎవరో కాదు, తన తండ్రి శివ్. ఇక తల్లి అంత్యక్రియలు ముగిశాక, శివ్ తిరిగి అమెరికా వెళ్ళిపోవడానికి సిద్ధమవుతాడు. కానీ అనుకోకుండా ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడంతో, తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి ఒక 48 గంటల పాటు గడపాల్సి వస్తుంది.

ఇక ఈ రెండు రోజుల ప్రయాణంలో వీరిద్దరి మధ్య ఉన్న పాత గొడవలు, కోపాలు బయటపడతాయి. అసలు తండ్రి తన కొడుకు పట్ల ఎందుకు అంత కఠినంగా ఉన్నాడు? కొడుకు మనసులో తండ్రి పట్ల ఉన్న భయం ఏమిటి? చివరకు ఆ 48 గంటల సమయంలో వాళ్ళ మధ్య ఉన్న దూరాన్ని ఎలా తగ్గించుకున్నారు ? ఒకరినొకరు ఎలా క్షమించుకున్నారనేదే ఈ సినిమా అసలు కథ.

Advertisement

Read Also :  ఓటీటీలోకి వచ్చేస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ సిరీస్ ‘సైకో సైయాన్’… ఎప్పుడు ఎక్కడ చూడవచ్చు అంటే?

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×