E-Paper
Advertisement

Comedy Movie OTT: పుట్టిన రోజు వేడుకలకు కరెంట్ కట్… పిచ్చుకల కోసం ఊరంతా జాగారం…ఓ చూపు చూడాల్సిన సినిమా

Comedy Movie OTT: పుట్టిన రోజు వేడుకలకు కరెంట్ కట్… పిచ్చుకల కోసం ఊరంతా జాగారం…ఓ చూపు చూడాల్సిన సినిమా
Advertisement

Comedy Movie OTT: కర్ణాటకలోని ఒక అందమైన పల్లెటూరి వాతావరణంలో, పక్కా నాటు స్టైల్‌లో ఒక కామెడీ సినిమా వచ్చింది. ‘కథా సంగమం’, ‘గరుడ వేగ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన అదిత్ అరుణ్, తన పేరును త్రిగుణ్ అని మార్చుకున్నాక ఈ సినిమాలో లైన్ మెన్ పాత్రలో చాలా సహజంగా నటించాడు. సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ పెరిగిపోయాక, మనుషుల మధ్య మాటలు చాలా వరకు తగ్గిపోయాయి. ఈ జబ్బును నయం చేసే మందు కూడా లేకపాయే. అయితే ఒక్క రోజు కరెంటు లేకపోతే మనుషులు మళ్లీ పాత రోజుల్లాగా ఎలా కలిసిపోతారో, ఈ సినిమా చాలా చక్కగా చూపిస్తుంది.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

ఈ కన్నడ కామెడీ సినిమా పేరు ‘లైన్ మెన్’ (Lineman). రఘు శాస్త్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడ, తెలుగు భాషల్లో ఏకకాలంలో నిర్మించబడింది. ఇది 2024 మార్చి 22న థియేటర్లలో విడుదలైంది. ఇందులో త్రిగుణ్, బి. జయశ్రీ, కాజల్ కుందర్, హరిణి శ్రీకాంత్, సుజయ్ శాస్త్రి, అపూర్వ శ్రీ వంటి తారాగణం ఉంది. పర్పుల్ రాక్ ఎంటర్‌టైనర్స్ నిర్మించిన ఈ సినిమాకు కద్రి మణికాంత్ సంగీతం అందించారు. ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Videoలో కన్నడ, తెలుగు వెర్షన్లలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

చందకవాడి అనే ఒక పల్లెటూరు ఉంటుంది. ఆ ఊర్లో అందరికీ ఇష్టమైన శారదమ్మ అనే బామ్మ కూడా ఉంది. ఆమెకి నూరేళ్లు నిండుతుంటే, ఊరంతా కలిసి పెద్ద పండుగలా పుట్టినరోజు వేడుకలు చేయాలనుకుంటారు. ఊరంతా లైట్లతో మెరిసిపోవాలని, డీజేలు పెట్టి రచ్చ చేయాలని ప్లాన్ చేస్తారు. సరిగ్గా అదే టైంలో ఊరికి కరెంటు పోతుంది. అందరూ కంగారుపడి లైన్ మెన్ (త్రిగుణ్) దగ్గరికి పరిగెడతారు. కానీ ఆ లైన్ మెన్ మాత్రం నేను కరెంటు ఇవ్వను అని మొండికేస్తాడు. ఎందుకంటే, ఊరికి కరెంటు సప్లై చేసే మెయిన్ ట్రాన్స్‌ఫార్మర్ బాక్సులో ఒక పిట్ట గూడు కట్టుకుని గుడ్లు పెట్టి ఉంటుంది. ఇప్పుడు కరెంటు ఆన్ చేస్తే ఆ వేడికి ఆ పిట్ట గుడ్లు మాడిపోతాయని, ఆ చిన్న జీవుల ప్రాణాలు పోతాయని అతను కరెంటు తీసేస్తాడు.

ఇక ఊరంతా ఒక్కటయ్యి తిట్టినా, బెదిరించినా సరే.. ఆ పిట్ట పిల్లలు పుట్టేదాకా లైట్లు వేసేదే లేదని భీష్మించుకుని కూర్చుంటాడు లైన్ మెన్. ఇక చేసేదేం లేక ఆ ఊరంతా కరెంటు లేకుండానే ఉండాల్సి వస్తుంది. ఫోన్లు చార్జింగ్ లేక ఆగిపోతాయి, టీవీలు పని చేయవు. దాంతో ఊర్లో వాళ్లంతా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెడతారు. ఫోన్లలో మునిగిపోయే జనం, పక్కన ఉన్న మనుషుల విలువ తెలుసుకుంటారు. చివరికి ఆ చిన్న పిట్ట ప్రాణాల కోసం లైన్ మెన్ చేసిన పోరాటం గెలిచిందా? ఆ ఊరి పండుగ ఎలా జరిగింది? అనేదే ఈ సినిమా అసలు కథ.

Advertisement

Read Also : టీచర్ ను లైన్ లో పెట్టే స్టూడెంట్… రివేంజ్ అంటూ తపిస్తూనే… ఇదో రకం ప్రేమ

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×