E-Paper
Advertisement

Sports Comedy OTT: తప్పి తిప్పలు పడే జపాన్ యోధుడు… కితకితలు పెట్టే కామెడీ కూడా

Sports Comedy OTT: తప్పి తిప్పలు పడే జపాన్ యోధుడు… కితకితలు పెట్టే కామెడీ కూడా
Advertisement

Sports Comedy OTT : సుమో అంటే మనకు తెలిసింది ఒక టాటా వెహికిల్ మాత్రమే. అయితే జపాన్లో సుమో అంటే మల్ల యోధులు. వాళ్లను చూస్తేనే మనకు గుండె జారిపోతుంది. వాళ్ళు చేసే మల్ల యుద్ధాలు జపాన్లో చాలా ఫేమస్. ఇక ఈ నేపథ్యంలో ఒక తమిళ స్పోర్ట్స్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. అయితే అనుకున్నంత రెస్పాన్స్ అయితే ఈ సినిమాకి రాలేదు. కానీ కామెడీ పరంగా పర్వాలేదనిపించింది. ఈ సినిమాలో సుమో పాత్రలో నటించిన యోషినోరి తాషీరో నిజంగా జపాన్‌కు చెందిన మాజీ ప్రొఫెషనల్ సుమో రెజ్లర్. ఇండియాలో ఒక సుమో రెజ్లర్ మెయిన్ రోల్ చేసిన మొదటి సినిమా కూడా ఇదే. కామెడీ కోసం వీకెండ్ లో ఈ సినిమాను ఓ సారి ట్రై చెయ్యచ్చు.

స్టోరీ ఏమిటంటే

ఈ తమిళ స్పోర్ట్స్ కామెడీ సినిమా ‘సుమో’ (Sumo) S. P. హోసిమిన్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో శివ, ప్రియా ఆనంద్, యోషినోరి తాషిరోలు VTV గణేష్, యోగి బాబు, సతీష్ వంటి నటులు నటించారు. నిజానికి ఈ సినిమా 2020లోనే రిలీజ్ కావాల్సింది కానీ కరోనా వల్ల, కొన్ని ఆర్థిక కారణాల వల్ల దాదాపు 5 ఏళ్లు ఆగిపోయింది. చివరకు ఈ సినిమా 2025 ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో విడుదలైన కొన్ని వారాలకే, అంటే 2025 మే 23 నుండి Sun NXT, Tentkotta వంటి ఓటిటి ప్లాట్‌ ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది. మన సౌత్ ఇండియాలో టాప్ సినిమాటోగ్రాఫర్ అయిన రాజీవ్ మీనన్ ఈ సినిమాకు కెమెరా వర్క్ చేశారు. ఆయన విజువల్స్ వల్ల జపాన్ అందాలు, సుమో ఫైట్స్ చాలా గ్రాండ్‌గా కనిపిస్తాయి.

కథలోకి వెళ్తే

Advertisement

ఒక ఊరిలో శివ (హీరో) అనే ఒక కుర్రాడు, చెన్నై సముద్రపు ఒడ్డున కాలక్షేపం చేస్తుంటాడు. అయితే ఉన్నట్టుండి సముద్రపు అలల మీద కొట్టుకుంటూ ఒక భారీకాయుడు, అంటే ఒక జపనీస్ సుమో రెజ్లర్ ఒడ్డుకు చేరుతాడు. చూడ్డానికి కొండలా ఉన్నా, ఆ సుమోకి గతం మర్చిపోయి బుర్ర పని చేయదు. అచ్చం పసిపిల్లాడిలా ప్రవర్తిస్తుంటాడు. వాడికి తిండి పెట్టలేక, వాడు చేసే గోల భరించలేక శివ తల పట్టుకుంటాడు. అలాంటి టైంలో వీడికి ప్రియా (హీరోయిన్) పరిచయం అవుతుంది. ఈ లోపు ఆ సుమో ఎవరో కాదు, జపాన్‌లో పెద్ద ఛాంపియన్ అని వీళ్లకు అర్థమవుతుంది.

అయితే జపాన్ నుండి వచ్చిన కొందరు విలన్లు ఆ సుమోని చంపాలని ప్లాన్ చేస్తుంటారు. ఇంకేముంది, మన హీరో తన ఫ్రెండ్స్ యోగి బాబు, గణేష్‌లతో కలిసి ఆ సుమోని కాపాడి, వాడికి పాత విషయాలన్నీ గుర్తు చేసే బాధ్యత తీసుకుంటాడు. చివరికి మన హీరో ఆ సుమోని తీసుకుని జపాన్ వెళ్తాడు. అక్కడ అతనికి గతం గుర్తుకొస్తుందా ? ఆ సుమోను ఎవరు చంపాలని చూస్తున్నారు ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : దేశం కోసం ప్రాణాలకు తెగించే టీచర్ … యూత్ చూడాల్సిన పొలిటికల్ థ్రిల్లర్

Tags

Related News

కూతురిని కాపాడాలంటే భార్యను పంపమనే మాఫియా డాన్… 8.8 రేటింగ్‌తో దూసుకెళ్తున్న తెలుగు థ్రిల్లర్

పూజారి అంటే పూజలే అనుకుంటున్నారా ? విలన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఫైటర్… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

దుల్కర్‌ సినిమా స్ట్రీమింగ్ విషయంలో గందరగోళం… స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో ? ఎప్పటి నుంచి ?

అపార్ట్‌మెంట్‌లో వరుస మిస్సింగ్స్.. ఆ బిల్డింగ్ కేర్‌టేకర్‌ వెనుక దాగిన భయంకర నిజం… హాలీవుడ్ హారర్ థ్రిల్లర్

ఆ పాత పెట్టె తెరిస్తే పాతాళానికే… ఇంట్లోనే నరకం చూపించిన దుష్టశక్తి… తెలుగులోనే ఈ హారర్ థ్రిల్లర్

అడవిలో ఆపద తెచ్చిన ప్రయాణం… ఆ దారిలో వెళ్తే ప్రాణాలే గాల్లో… టెర్రిఫిక్ తెలుగు థ్రిల్లర్

పూరీ పుణ్యక్షేత్రం రహస్యం… దివ్యశక్తి కోసం విలన్ల ఊచకోత… ఒక్కో సీన్ చూస్తుంటే మతిపోతోంది

ఈజీ మనీ కోసం ఎన్నికల్లో మోసం.. చివరికి ఊరంతా శత్రువులైతే… తెలుగు సినిమానే

Big Stories

Advertisement
×