E-Paper
Advertisement

CM Revanth: హైదరాబాద్‌కు ‘సదరన్ కమాండ్ సెంటర్’.. సివిల్ మిలిటరీ కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి.

CM Revanth: హైదరాబాద్‌కు ‘సదరన్ కమాండ్ సెంటర్’.. సివిల్ మిలిటరీ కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి.
Advertisement

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్మీ ఉన్నతాధికారులను కోరారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం అధ్యక్షతన గురువారం ‘సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్’ (Civil Military Liaison Conference) నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం, సైన్యం మధ్య నెలకొన్న పలు భూ సమస్యలు, పరిపాలనాపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

దశాబ్ద కాలంగా అన్యాయం..

Advertisement

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దేశంలోని వివిధ రాష్ట్రాలకు కేంద్రం రెండు నుంచి నాలుగు సైనిక్ స్కూళ్లను మంజూరు చేసినప్పటికీ, గత పదేళ్లుగా తెలంగాణకు ఒక్క స్కూల్ కూడా మంజూరు కాలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలోని యువతకు రక్షణ రంగంలో మెరుగైన శిక్షణ అందించేందుకు సైనిక్ స్కూల్ ఆవశ్యకతను ఆయన వివరించారు. అలాగే, ప్రస్తుతం పుణెలో ఉన్న సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని భౌగోళికంగా.. వ్యూహాత్మకంగా కీలకమైన హైదరాబాద్‌కు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు.

రక్షణ రంగానికి పూర్తి సహకారం..

Advertisement

దేశ భద్రతకు సంబంధించిన ఏ విషయంలోనైనా సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందుకు నిదర్శనంగా వికారాబాద్ జిల్లాలో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 3,000 ఎకరాల భూమిని కేటాయించినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. సైన్యానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన తెలిపారు.

సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారులు..

ఆర్మీ మరియు తెలంగాణ ప్రభుత్వం మధ్య పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు, రహదారుల నిర్మాణం వంటి సమస్యలను పరిష్కరించేందుకు ఇరుపక్షాల నుంచి సమన్వయం అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. దీని కోసం ఆర్మీ వైపు నుండి ప్రత్యేక అధికారులను నియమించాలని కోరారు. నిరంతర చర్చలు, సమన్వయం ద్వారానే ఏళ్ల తరబడి ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించుకోవచ్చని ఆయన అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, తెలంగాణ, ఆంధ్ర సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, డీజీపీ శివధర్ రెడ్డితో పాటు రక్షణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ALSO READ: West Godavari: సంక్రాంతి బరుల్లో కాసుల వర్షం.. రూ.లక్ష, 2లక్షలు కాదు.. రూ.1.53 కోట్లు గెలుచుకున్న పందెంరాయుడు!

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×