E-Paper
Advertisement

Comedy thriller OTT: స్నేహితుల సరదాకు శవం అడ్డు… గిలిగింతలు పెట్టించే కామెడీ

Comedy thriller OTT: స్నేహితుల సరదాకు శవం అడ్డు… గిలిగింతలు పెట్టించే కామెడీ
Advertisement

Comedy thriller OTT : సస్పెన్స్, కామెడీ కలయికతో ఓ మరాఠీ మూవీ కడుపుబ్బా నవ్విస్తోంది. గత ఏడాది థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా, ఓటీటీలో చూసి కూడా తెగ నవ్వుకుంటున్నారు ప్రేక్షకులు. ఈ కథ చాలా కాలం తరువాత కలిసే బ్యాక్‌బెంచర్‌ల చుట్టూ తిరుగుతుంది. వాళ్ళకి ఒక శవం కనిపించడంతో సరదా కాస్తా గందరగోళంగా మారుతుంది. ఈ సినిమాను ఫ్యామిలితో కలసి ఎంచక్కా ఎంటర్టైన్ అవ్వచ్చు. దీని పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ మరాఠీ కామెడీ థ్రిల్లర్ సినిమా పేరు ‘చికీ చికీ బూబూమ్ బూమ్’ (ChikiChiki BooBoomBoom). 2025లో విడుదలైన ఈ సినిమాకి ప్రసాద్ ఖండేకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో స్వప్నిల్ జోషి, ప్రార్థనా బెహెరే, ప్రజక్తా మాలి, ఖండేకర్, రోహిత్ మానే, ప్రథమేష్ శివల్కర్, నమ్రతా సంభేరావ్, వనితా ఖరత్‌ వంటి నటులు నటించారు. ఇక రోహన్-రోహన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే ..

Advertisement

ఈ సినిమా కథ ఆరుగురు కాలేజ్ స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. చాలా ఏళ్ల తర్వాత వీరంతా ముంబై దగ్గరలోని ఒక ఫామ్‌హౌస్‌లో కలుసుకుంటారు. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ ఆ రాత్రి వాళ్ళు ఊహించని విధంగా ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. దీంతో ఆనందంగా సాగాల్సిన పార్టీ కాస్తా ఒక్కసారిగా గందరగోళంగా, భయంకరంగా మారిపోతుంది.
పోలీసులకు ఫోన్ చేద్దామని అనుకుంటారు కానీ, ఒక చిన్న పొరపాటు వల్ల పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం లేకుండా పోతుంది. ఆ శవాన్ని ఏం చేయాలి? అసలు ఆ వ్యక్తి ఎలా చనిపోయాడు? అన్న విషయాలను దాచిపెట్టే క్రమంలో వాళ్ళు పడే ఇబ్బందులు, చేసే పొరపాట్లు నవ్వు తెప్పిస్తాయి. సస్పెన్స్, కామెడీ కలగలిసిన ఈ కథలో ఆ స్నేహితులు చివరకు ఆ సమస్య నుండి ఎలా బయటపడ్డారు అనేదే ఈ సినిమా.

Read Also :  సిరీస్‌ గా రాబోతున్న మోస్ట్ డేంజరస్ అడవి దొంగ వీరప్పన్ జీవిత చరిత్ర… ఏ ఓటీటీలో ఎప్పుడు చూడచ్చు అంటే ?

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×