E-Paper
Advertisement

Comedy Thriller OTT : తిట్లతో వచ్చే వింత లెటర్స్… కితకితలు పెట్టే కామెడీ థ్రిల్లర్… స్ట్రీమింగ్ తెలుగులోనే

Comedy Thriller OTT : తిట్లతో వచ్చే వింత లెటర్స్… కితకితలు పెట్టే కామెడీ థ్రిల్లర్… స్ట్రీమింగ్ తెలుగులోనే
Advertisement

Comedy Thriller OTT : కడుపుబ్బా నవ్వించే కామెడీ థ్రిల్లర్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కితకితలు పెట్టే సీన్స్ వచ్చినప్పుడల్లా సరదాగా నవ్వుకుంటూ సినిమాను ఎంజాయ్ చేస్తారు మూవీ లవర్స్. మీకు కూడా అలాంటి మూవీని చూడాలని ఉంటే ఈ మూవీపై ఓసారి లుక్కేయండి. చిన్న పిల్లలతో క్రేజీగా ఉండే ఈ మూవీ తెలుగులోనే ఉంది. కానీ చిన్న పిల్లలతో చూడకపోవడమే బెటర్. మరి పెద్దలకు మాత్రమే అనేలా ఉన్న ఈ కామెడీ ఎంటర్టైనర్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? కథ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

2023లో విడుదలైన బ్రిటిష్ బ్లాక్ కామెడీ మిస్టరీ చిత్రం ‘వికెడ్ లిటిల్ లెటర్స్’ (Wicked Little Letters). థియా షార్రాక్ దర్శకత్వం వహించిన ఈ ఈ సినిమా 1920లలో ఇంగ్లాండ్‌లోని ఒక చిన్న పట్టణంలో జరిగిన నిజమైన ఘటన ఆధారంగా తెరకెక్కింది. అనామక లేఖలు, గాసిప్, సమాజంలోని ద్వేషాలు, హాస్యం మిక్స్ చేసి సరదాగా, భావోద్వేగపూరితంగా చూపించే చిత్రం. సినిమా మార్చి 2023లో థియేటర్లలో విడుదలై మంచి టాక్ అందుకుంది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. 100 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ మూవీ బడ్జెట్ $10 మిలియన్లు కాగా, బాక్సాఫీస్ దగ్గర $25 మిలియన్లు రాబట్టింది. IMDbలో 7.0/10 రేటింగ్ ఉంది. ఒలివియా కోల్‌మన్, జెస్సీ బక్లీ, అన్జనా వాసన్, టిమోతీ స్పాల్, జెమ్మా జోన్స్, లోల్లీ అడెఫోప్, మేబల్ ఒలివియా, జెస్సీ ప్రధాన పాత్రలు పోషించారు.

Advertisement

Also Read : ప్రియాంక చోప్రా స్పై థ్రిల్లర్ ఆగిపోలేదా ? క్రేజీ అప్డేట్ ఇచ్చిన గ్లోబల్ బ్యూటీ

కథలోకి వెళ్తే…

కథ 1920లలో ఇంగ్లాండ్‌లోని లిటిల్ హాంప్టన్ అనే చిన్న పట్టణంలో సాగుతుంది. ఎడిత్ స్వాన్ (ఒలివియా కోల్‌మన్) ఒక సాంప్రదాయకంగా ఉండే మహిళ. తన కుటుంబంతో శాంతియుతంగా జీవిస్తుంది. ఆమెకు రోజ్ గుడింగ్ (జెస్సీ బక్లీ) అనే పొరుగు మహిళతో గొడవలు మొదలవుతాయి. రోజ్ ఒక స్వేచ్ఛాయుత, ధైర్యసాహసమైన మహిళ. ఆమె ప్రవర్తన సమాజ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉంటుంది. ఒక రోజు ఎడిత్‌ కు అనామక లేఖలు రావడం మొదలవుతాయి. అవి రూడ్ గా, అవమానకరంగా ఉంటాయి. వాటిని “వికెడ్ లిటిల్ లెటర్స్”గా పిలుస్తారు.

Advertisement

ఎడిత్ ఆ లేఖలు రోజ్ రాసిందని ఆరోపిస్తుంది. పోలీస్ ఆఫీసర్ గ్లాడ్‌స్టోన్ (అన్జనా వాసన్) ఈ కేస్‌ను దర్యాప్తు చేస్తుంది. మధ్యలో చాలా కామెడీ సన్నివేశాలు ఉంటాయి. నిజమైన కేస్ ఆధారంగా, లేఖల వెనుక ఎవరు ఉన్నారు అనేది మిస్టరీ. చివరికి ఊహించని ట్విస్ట్‌ తో సినిమా ముగుస్తుంది. స్క్రిప్ట్ ఫాస్ట్ పేస్‌తో సాగుతుంది. సినిమా నిజమైన ఘటన ఆధారంగా కావడం వల్ల ఆసక్తికరంగా ఉంది. థియేటర్ రిలీజ్ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో మరిన్ని వ్యూస్ సాధించింది. అంతేకాదు BAFTA నామినేషన్ (బెస్ట్ బ్రిటిష్ ఫిల్మ్), అకాడమీ అవార్డ్స్‌లో షార్ట్‌లిస్ట్ (బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే) కూడా అయింది.

Tags

Related News

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

Big Stories

Advertisement
×