E-Paper
Advertisement

Haq on OTT : ఓటీటీలోకి వచ్చేసిన సెన్సేషనల్ కోర్టు రూమ్ డ్రామా ‘హక్’… అస్సలు మిస్ అవ్వొద్దు భయ్యా

Haq on OTT : ఓటీటీలోకి వచ్చేసిన సెన్సేషనల్ కోర్టు రూమ్ డ్రామా ‘హక్’… అస్సలు మిస్ అవ్వొద్దు భయ్యా
Advertisement

Haq on OTT : హిందీ కోర్ట్ రూమ్ డ్రామా ‘హక్’ (Haq) ఓటీటీ అరంగేట్రం చేసింది. సీరియస్ సబ్జెక్ట్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో థియేటర్లలో ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు కంటెంట్-ఆధారిత కథనాలను ఇష్టపడే డిజిటల్ ప్రేక్షకులను చేరుకుంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? మూవీ టాక్ ఆఫ్ ది టౌన్ అవ్వడానికి గల కారణం ఏంటి? అన్నది తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

యామి గౌతమ్, ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రల్లో నటించిన కోర్ట్ రూమ్ డ్రామా చిత్రం ‘హక్'(Haq). గత ఏడాది నవంబర్ 7న థియేటర్లలో విడుదలైంది. సుపర్మ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 2025లో క్రిటిక్స్ ను మెప్పించిన హిందీ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కానీ ఆడియన్స్ ఆదరణ మాత్రం దక్కలేదు. ఇక థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత, ‘హక్’ జనవరి 2 నుండి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో ప్రసారం అవుతోంది. ఇందులో ‘షీబా చద్దా’ కూడా ఒక ముఖ్యమైన సహాయ పాత్రలో నటించారు. వినీత్ జైన్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా, హర్మాన్ బవేజా ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు. నెట్‌ఫ్లిక్స్ విడుదల అనంతరం ఈ చిత్రానికి థియేటర్లలో కంటే ఓటీటీలోనే మంచి రెస్పాన్స్ దక్కుతుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Read Also : ఎక్స్ లవర్ తో ఏకాంతంగా… ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ రొమాంటిక్ డ్రామా

స్టోరీ ఇదే… వరుస వివాదాలు

షా బానో బేగం జీవితం, ఆమె చేసిన న్యాయ పోరాటం ఇన్స్పైర్డ్ మూవీ ‘హక్’. ఆమె వేసిన పిటిషన్‌పై 1985లో సుప్రీం కోర్టు విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు భరణ హక్కును కల్పిస్తూ తీర్పు ఇచ్చింది. 1978లో తన భర్త, న్యాయవాది మహ్మద్ అహ్మద్ ఖాన్ ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత, షా బానో భరణం కోరుతూ స్థానిక కోర్టులో దావా వేసింది. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, 1985లో సుప్రీంకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ముస్లిం మహిళలు చట్టం ప్రకారం భరణం పొందేందుకు అర్హులని తీర్పు చెప్పింది. అయితే ముస్లిం సంస్థల నిరసనల తర్వాత, కేంద్రంలోని అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో ముస్లిం మహిళల (విడాకులపై హక్కుల రక్షణ) చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఇది సుప్రీంకోర్టు నిర్ణయాన్ని రద్దు చేసింది. బానో 1992లో మరణించింది.

Advertisement

ఈ సినిమా విడుదలకు ముందు, షా బానో బేగం కుమార్తె సిద్ధికా బేగం ఖాన్ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా తమ కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా నిర్మించబడిందని, తన దివంగత తల్లి జీవితంలోని వ్యక్తిగత అంశాలను తప్పుగా చిత్రీకరించారని ఆమె ఆరోపించారు. ఒక వ్యక్తికి ఉన్న కీర్తి లేదా గోప్యత హక్కు వారసత్వంగా రాదు అని పేర్కొంటూ కోర్టు పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఒక వ్యక్తి మరణంతో అలాంటి హక్కులు ముగుస్తాయి. చిత్రనిర్మాతలు సిద్ధికా ఖాన్ నుండి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫిబ్రవరి 2024 నుండి మీడియా సినిమా నిర్మాణం గురించి వార్తలు వస్తున్నప్పటికీ, పిటిషనర్ చాలా ఆలస్యంగా కోర్టును ఆశ్రయించారని కూడా హైకోర్టు పేర్కొంది.

Tags

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×