E-Paper
Advertisement

Rangareddy: నకిలీ తుపాకీతో బంగారం షాపు చోరీ.. క్షణాల్లో పరార్, హైదరాబాద్‌లో ఘటన

Rangareddy: నకిలీ తుపాకీతో బంగారం షాపు చోరీ.. క్షణాల్లో పరార్, హైదరాబాద్‌లో ఘటన
Advertisement

Rangareddy: రంగారెడ్డి జిల్లాలో పట్టపగలు జరిగిన ఓ భారీ దోపిడీ ప్రయత్నం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం, సత్యనారాయణ కాలనీలో ఉన్న ఒక గోల్డ్ షాపులో దుండగుడు నకిలీ తుపాకీతో హల్‌చల్ చేశాడు.

సత్యనారాయణ కాలనీలోని జ్యువెలరీ షాపులోకి ఒక వ్యక్తి కస్టమర్‌లా ప్రవేశించాడు. లోపలికి రాగానే ఒక్కసారిగా తన వద్ద ఉన్న నకిలీ తుపాకీని బయటకు తీసి షాపు యజమానిని బెదిరించాడు. షాపులోని నగలను ఇవ్వాలని హుకూం జారీ చేశాడు. అయితే..  యజమాని ఏమాత్రం భయపడకుండా దొంగను ప్రతిఘటించాడు. యజమాని తనను ఎదిరించడంతో కంగారుపడ్డ దొంగ.. వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో యజమానిపై విచక్షణారహితంగా దాడి చేశాడు.

Advertisement

యజమాని అప్రమత్తమై గట్టిగా కేకలు వేయడంతో పాటు ప్రతిఘటించడంతో..  తన ప్లాన్ ఫెయిల్ అవుతుందని దొంగ గ్రహించాడు. దీంతో భయపడిన నిందితుడు తన వద్ద ఉన్న నకిలీ తుపాకీని అక్కడే పడేసి..  కొన్ని బంగారు ఆభరణాలతో అక్కడి నుంచి వేగంగా పరారయ్యాడు. ఈ దాడిలో షాపు యజమాని తలకి, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

సమాచారం అందుకున్న కీసర పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. నిందితుడు వదిలి వెళ్ళిన నకిలీ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. షాపులోని సీసీటీవీ (CCTV) కెమెరా ఫుటేజీని పరిశీలించగా..  దొంగతనం జరిగిన తీరు, నిందితుడి కదలికలు స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పట్టపగలే జనావాసాల మధ్య ఇలాంటి ఘటన జరగడంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ALSO READ:School Bus Accident: ఘోర బస్సు ప్రమాదం.. వాహనంలో మొత్తం 107 మంది.. స్పాట్‌లో 20 మంది..?

Related News

బర్తరఫ్ తర్వాత తొలిసారి నోరు విప్పిన కొండా సురేఖ..సీయం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

Big Stories

Advertisement
×