E-Paper
Advertisement

Romantic drama OTT : ఎక్స్ లవర్ తో ఏకాంతంగా… ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ రొమాంటిక్ డ్రామా

Romantic drama OTT : ఎక్స్ లవర్ తో ఏకాంతంగా… ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ రొమాంటిక్ డ్రామా
Advertisement

Romantic drama OTT : 2025 మలయాళ సినిమా ప్రియులకు ప్రత్యేకంగా గుర్తుండిపోయే ఏడాది. ఈ సంవత్సరం థియేటర్స్‌ లో దుమ్మురేపిన చాలా మలయాళం సినిమాలకు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. అలాంటి సినిమాలలో ‘ఇతిరి నేరం’ (Ithiri Neram) కూడా ఒకటి. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

సన్ నెక్స్ట్ ఓటీటీలో అందుబాటులో

ప్రశాంత్ విజయ్ డైరెక్ట్ చేసిన రొమాంటిక్ డ్రామా ‘ఇతిరి నేరం’ డిసెంబర్ 31న సన్ నెక్స్ట్ (Sun NXT) ఓటీటీలో స్ట్రీమింగ్ షురూ అయ్యింది. రోషన్ మాథ్యూ, జరీన్ షిహాబ్ లీడ్ రూల్స్ లో నటించిన ఈ మూవీ థియేటర్స్‌లో రిలీజ్ అయిన నెల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. మొదట క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్లాన్ చేసినా, కొన్ని కారణాలతో డిలే అయింది. సినిమాలో బాసిల్ సీజే మ్యూజిక్ హైలైట్ అయ్యింది. అలాగే ఎమోషనల్ నరేషన్ బాగుంటుంది. 1 గంట 45 నిమిషాలు రన్ టైమ్ ఉన్న ఈ మూవీ ఓటీటీలో మలయాళం లాంగ్వేజ్ లో మాత్రమే అందుబాటులో ఉంది. కాకపోతే ఇంగ్షీషు సబ్ టైటిల్స్ అవైలబుల్ గా ఉన్నాయి. థియేటర్లలో కంటే ఈ మూవీకి ఓటీటీలోనే మంచి రెస్పాన్స్ దక్కే ఛాన్స్ ఉంది. కాబట్టి మలయాళం మూవీ లవర్స్ డోంట్ మిస్.

Advertisement

Read Also :  భార్య ఉండగానే ప్రియురాలితో… మర్డర్ మిస్టరీలో మతిపోగొట్టే ట్విస్ట్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

స్టోరీలోకి వెళ్తే…

అనిష్ (రోషన్ మాథ్యూ) అనే వ్యక్తి చిన్న కూతురు బాప్టిజం ఈవెంట్ జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయన ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉంటారు. ఈ క్రమంలోనే తన బెస్ట్ ఫ్రెండ్స్‌ తో కలిసి పార్టీ ప్లాన్ చేస్తాడు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ మూమెంట్ ను సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ కి కావలసినంత మందును తెప్పిస్తాడు. కానీ ఇలాంటి టైమ్ లో హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంజనా (జరీన్ షిహాబ్) నుంచి సడన్‌ గా కాల్ వస్తుంది. ఫోన్ లో తాను అమెరికాకు వెళ్లిపోతున్నానని, వెళ్ళే ముందు ఒక్కసారి కలుద్దామని అతన్ని రిక్వెస్ట్ చేస్తుంది. అనిష్ కూడా కాదనలేకపోతాడు. ఇంకేముంది ఇద్దరూ కలుస్తారు. గత జ్ఞాపకాలు నెమరేసుకుంటారు.

Advertisement

ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడం నుంచి విడిపోవడం వరకు అన్ని విషయాలను మాట్లాడుకుంటారు. ఆ చల్లని సాయంత్రం పూట ఈ జంట మధ్య నడిచే కథ మనసుకు హత్తుకునేలా ఉంటుంది. ఎమోషనల్ రోలర్‌ కోస్టర్ లాగా సాగే ఈ స్టోరీ ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. నిజానికి హీరో ముందుగా మాజీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళాలా ? వద్దా ? అని కన్ఫ్యూజన్ లో పడతాడు. కానీ వెళ్లడానికే మొగ్గు చూపుతాడు. మరి అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది ? అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×