E-Paper
Advertisement

Crime Comedy OTT : ‘మీర్జాపూర్’ను తలపించే సిరీస్… గ్యాంగ్ వార్ తో దద్దరిల్లే సిరీస్… ఎక్కడ ఉందో తెలుసా ?

Crime Comedy OTT : ‘మీర్జాపూర్’ను తలపించే సిరీస్… గ్యాంగ్ వార్ తో దద్దరిల్లే సిరీస్… ఎక్కడ ఉందో తెలుసా ?
Advertisement

Crime Comedy OTT : ఓటీటీలో ఇప్పుడు వెబ్ సిరీస్‌ల హవా కొనసాగుతోంది. వీటిలో కొన్ని స్టోరీలను ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంటాయి. మంచి కంటెంట్ ఉన్న కథలను డైరెక్టర్లు అద్భుతంగా తీర్చి దిద్దుతుంటారు. ఇవి చాలా కాలం పాటు వార్తల్లో కూడా ఉంటాయి. ఇప్పుడు మనం చె ప్పుకోబోయే ఒక యాక్షన్ కామెడీని సిరీస్ ను ప్రజలు విపరీతంగా చూశారు. 2023 లో ఇది అత్యధికంగా వ్యూస్ వచ్చిన వెబ్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. 90ల నాటి సెట్టింగ్ లో ఈ కథ ఉంటుంది. ఆ రోజుల్లోకి ఈ సిరీస్ తెసుకెళ్తుంది. ఇక లవ్ స్టోరీలు మాత్రం మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఈ యాక్షన్ కామెడీ సిరీస్ పేరు “గన్స్ & గులాబ్స్” (Guns & Gulaabs). రాజ్ & డికె దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ 2023లో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. వచ్చీరాగానే ఇది మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇందులో రాజ్ కుమార్ రావు, దుల్కర్ సల్మాన్, ఆదర్శ్ గౌరవ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ నటుల నటన కూడా దీనికి హైలెట్ గా నిలిచింది. ఇది ఐయండిబిలో 7.7/10 రేటింగ్‌ను కూడా పొందింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

‘గులాబ్‌గంజ్ అనే ఊరిలో నల్లమందు అక్రమ రవాణా చేసే రెండు గ్యాంగుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఒక గ్యాంగ్ లీడర్ గాంచి పెద్ద డీల్ సెట్ చేయాలని చూస్తుంటే, మధ్యలో ఒక సాదాసీదా మెకానిక్ టిప్పు (రాజ్‌కుమార్ రావు) తన తండ్రి చావుకు పగ తీర్చుకోవడానికి ఈ రౌడీల గొడవల్లోకి దిగుతాడు. అదే టైమ్‌లో ఈ డ్రగ్స్ దందాను ఆపడానికి అర్జున్ వర్మ (దుల్కర్ సల్మాన్) అనే పోలీస్ ఆఫీసర్ ఎంట్రీ ఇస్తాడు. వీళ్లందరి మధ్య జరిగే యాక్షన్, కామెడీ అండ్ క్రైమ్ డ్రామానే ఈ సిరీస్. ఇందులో కేవలం గ్యాంగ్‌స్టర్ గొడవలే కాకుండా.. 90ల నాటి లవ్ స్టోరీలు, అప్పట్లో వాడిన క్యాసెట్లు, రేడియోలు లాంటివి మనల్ని పాత రోజుల్లోకి తీసుకెళ్తాయి. ఒకవైపు సీరియస్‌గా క్రైమ్ జరుగుతున్నా, రాజ్‌కుమార్ రావు చేసే కామెడీ బాగా నవ్విస్తుంది. ఆత్మారాం అనే విచిత్రమైన విలన్ చేసే హత్యలు భయపెడుతూనే ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. మొత్తం మీద ఇదొక ఫుల్ ప్యాక్డ్ డ్రామా.

Read Also : రోడ్డున పడే బతుకులు… మనీ కోసం మాస్టర్ స్కెచ్ … క్లైమాక్స్ వరకు ట్విస్టులే

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×