E-Paper
Advertisement

Crime Thriller OTT : రోడ్డున పడే బతుకులు… మనీ కోసం మాస్టర్ స్కెచ్ … క్లైమాక్స్ వరకు ట్విస్టులే

Crime Thriller OTT : రోడ్డున పడే బతుకులు… మనీ కోసం మాస్టర్ స్కెచ్ … క్లైమాక్స్ వరకు ట్విస్టులే
Advertisement

Crime Thriller OTT : డిఫరెంట్ కంటెంట్ ఉన్న స్టోరీ కావాలనుకుంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే బెంగాలీ మూవీపై ఓ లుక్ వేయండి. ఈ సినిమా మిమ్మల్ని చూపు తిప్పుకోనివ్వదు. జీవితంలో అన్ని కష్టాలు చూసి, భరించలేక చచ్చిపోదామనుకున్న ఇద్దరు యువకుల చుట్టూ కథ ఉంటుంది. ఇది ఫ్యామిలీతో చూడడానికి కూడా బాగా ఉంటుంది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో ఉందంటే

ఈ బెంగాలీ డ్రామా థ్రిల్లర్ చిత్రం పేరు ‘కచర్ మానుష్’ (Kacher Manush). పథిక్రిత్ బసు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను, దేవ్ ఎంటర్టైన్మెంట్ వెంచర్స్ నిర్మించింది. ఇందులో బెంగాలీ సూపర్ స్టార్స్ ప్రోసెన్‌జిత్ ఛటర్జీ, దేవ్, ఈషా సాహా, సుస్మితా ఛటర్జీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2022 సెప్టెంబర్ 30న థియేటర్లలో దుర్గా పూజా స్పెషల్ గా రిలీజ్ అయింది. ప్రస్తుతం Prime Video, Jio hotstarలో ఈ సినిమా స్ట్రీమింగ్ లో ఉంది. IMDbలో 6.9/10 రేటింగ్ కూడా దీనికి ఉంది.

కథలోకి వెళ్తే

Advertisement

కుంతల్ (దేవ్) అనే యువకుడు, నిరుద్యోగం కారణంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటాడు. అయితే ఈ సమయంలో తన తల్లి అనారోగ్యం బారిన కూడా పడుతుంది. దీంతో జీవితంపై విరక్తి చెందిన కుంతల్ ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తుంటాడు. అదే సమయంలో అతనికి సుదర్శన్ (ప్రోసెన్‌జిత్ ఛటర్జీ) అనే వ్యక్తి పరిచయమవుతాడు. అతను కూడా తన లైఫ్‌లో పెద్ద ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నాడు. ఇన్సూరెన్స్ ఏజెంట్ గా జాబ్ చేస్తుంటాడు. సుదర్శన్ అతనికి ఒక వింతైన ప్లాన్ చెప్తాడు. కుంతల్ పేరు మీద భారీ మొత్తంలో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించి, ఆ తర్వాత ప్రమాదవశాత్తు అతను మరణించినట్లు సృష్టించి, వచ్చే ఇన్సూరెన్స్ డబ్బుతో తన కుటుంబ కష్టాలను తీర్చవచ్చని చెబుతాడు.

డబ్బు కోసం కుంతల్ ఈ ప్లాన్‌కు అంగీకరిస్తాడు. కానీ ఆ తర్వాత వారిద్దరి మధ్య జరిగే ప్రయాణం ఊహించని మలుపులు తిరుగుతుంది. కుంతల్ ఆలోచన మారుతుంది. చనిపోవాలని నిర్ణయించుకున్న వ్యక్తికి జీవితం ఎంత విలువైనదో తెలుస్తుంది. మరోవైపు సుదర్శన్ తన స్వార్థం కోసం కుంతల్‌ను ప్రమాదంలోకి నెట్టాడా ? ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందా ? ఈ క్లైమాక్స్ ఏంటి ? అనే విషయాలను మాత్రం, ఈ బెంగాలీ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : అప్పులు తీర్చడానికి 400 ఏళ్ల నాటి రాజభవనం అమ్మకం… తోలు తీసే ప్రేతాత్మ… ఐయండిబిలో టాప్ రేటింగ్

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×