E-Paper
Advertisement

Crime Drama OTT: డబ్బు కోసం ఎంతకైనా… మైండ్ బ్లాక్ చేసే మోసాలు… ఫ్యూజులు అవుటయ్యే క్లైమాక్స్

Crime Drama OTT: డబ్బు కోసం ఎంతకైనా… మైండ్ బ్లాక్ చేసే మోసాలు… ఫ్యూజులు అవుటయ్యే క్లైమాక్స్
Advertisement

Crime Drama OTT : ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలు అందుబాటులో ఉన్నాయి. అయితే స్టాక్ మార్కెట్ మాయాజాలం ఎంత ప్రమాదకరమో, ప్రజలకు తెలియజేసే మూవీ మాత్రం చైనా నుంచి వచ్చింది. ఈ సినిమా ముఖ్య ఉద్దేశం కూడా ఇదేనని నటుడు ఆండీ లౌ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. పేదరికం నుండి వచ్చిన ఒక తెలివైన ఫైనాన్స్ విద్యార్థి, ఇన్వెస్ట్‌మెంట్ మాయా ప్రపంచంలోకి అడుగుపెట్టి అక్కడ మోసాలను ఎలా ఎదుర్కొన్నాడనేది ఈ సినిమా కథ. ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ వుతుందంటే

ఈ బ్యాంకింగ్ క్రైమ్ డ్రామా సినిమా పేరు ‘Gilded Game’. యాక్షన్ సినిమాలకు పేరుగాంచిన హర్మన్ యాయు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ఆండీ లౌ ప్రధాన పాత్రలో నటించారు. ఇది 2025 మే 1న చైనాలో విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీ Apple TV లో అద్దెకు మాత్రమే అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

గావో హాన్ అనే కుర్రాడు చాలా తెలివైనవాడు కానీ పేదరికం నుండి వస్తాడు. ఫైనాన్స్ చదువు పూర్తి చేసి, ఎలాగైనా లైఫ్‌లో సెటిల్ అవ్వాలని బ్లూస్టోన్ అనే పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌లో ఇంటర్న్‌గా చేరతాడు. అక్కడ అతనికి ఫైనాన్స్ దిగ్గజం టాడ్ జాంగ్ పరిచయం అవుతాడు. టాడ్ శిక్షణలో గావో హాన్ త్వరగానే బ్యాంకింగ్ మెళకువలు నేర్చుకుంటాడు. కానీ ఆ స్టాక్ మార్కెట్ మాయాజాలంలో బయట పడని భయంకరమైన రహస్యాలు ఉన్నాయని అతనికి నెమ్మదిగా అర్థమవుతుంది.

ఒక కథ నడిచే కొద్దీ, ఒక పెద్ద కంపెనీకి సంబంధించిన షేర్ల వ్యవహారంలో భారీ కుంభకోణం జరుగుతుందని గావో హాన్‌కు తెలుస్తుంది. తన గురువు అయిన టాడ్ జాంగ్‌తో కలిసి పని చేస్తున్నప్పుడు, అక్కడ జరుగుతున్న మార్కెట్ మోసాలు అతన్ని చిక్కుల్లో పడేస్తాయి. ఆ మరో ప్రపంచంలో నిజాయితీగా ఉండాలా ? డబ్బు కోసం తప్పు చేయాలా ? అనే ఆలోచలలో పడతాడు గావో హాన్. చివరికి ఈ క్లైమాక్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనునుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : పూల తోటలో మృతదేహాలు… ప్రేమలో పడ్డ అమ్మాయిని కూడా… ఈ ఆరు ఎపిసోడ్‌ల క్రైమ్ థ్రిల్లర్ భీభత్సమే

Tags

Related News

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×